EPAPER

Dark Neck Elbows: వీటితో మెడ, మోచేతులపై ఉన్న నలుపు మాయం

Dark Neck Elbows: వీటితో మెడ, మోచేతులపై ఉన్న నలుపు మాయం

Dark Neck Elbows: తరచుగా మన ముఖం, చేతులు, కాళ్ళను జాగ్రత్తగా చూసుకుంటాము. కానీ మెడ , మోచేతుపై ఉండే నలుపును తగ్గించడం పట్ల అంతంగా శ్రద్ద చూపించము. అందుకే మోచేతులు, మోకాళ్లపై ఉన్న నలుపు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ మెడ, మోచేతులు నల్లగా కనిపించడం ప్రారంభించినప్పుడు అందం కాస్త తగ్గినట్టు కనిపిస్తుంది.


మీకు కూడా ఇలా జరిగితే, నిర్లక్ష్యం చేయకండి. మోచేతులు, మోకాళ్లు నల్లగా ఉన్నప్పుడు నల్లదనాన్ని తొలగించడానికి కొన్ని రకాల టిప్స్ పాటించడం అవసరం. ఈ టిప్స్ ప్రభావవంతంగా పనిచేస్తాయి. అంతే కాకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న హోం రెమెడీస్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1.నిమ్మ, తేనె ఉపయోగించండి:


నిమ్మకాయలో సహజసిద్ధమైన బ్లీచింగ్ ఏజెంట్లు ఉన్నాయి. ఇవి చర్మం యొక్క ఛాయను మెరుగుపరచడంలో సహాయపడతాయి. అంతే కాకుండా తేనె చర్మాన్ని తేమగా చేసి మృదువుగా మారుస్తుంది.

కావలసినవి:
నిమ్మకాయ- 1 టేబుల్ స్పూన్
తేనె- చిన్న టీ స్పూన్

అప్లై చేసే విధానం: ఒక బౌల్ తీసుకుని అందులో పైన చెప్పిన మోతాదుల్లో నిమ్మకాయ రసం, తేనె కలపి మిక్స్ చేయండి. ఇలా చేసిన ఈ మిశ్రమాన్ని మీ మెడ , మోచేతులపై రాయండి. 15-20 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై గోరువెచ్చని నీటితో కడగాలి.
ఈ రెమెడీని వారానికి 2-3 సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

2. శనగపిండి పిండి, పసుపు పేస్ట్:

శనగ పిండి , పసుపు యొక్క పేస్ట్ చర్మం యొక్క ఛాయను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. పసుపులో క్రిమినాశక గుణాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యవంతంగా చేయడంతో పాటు చర్మం నల్లబడడాన్ని తగ్గిస్తుంది.

కావలసినవి:

శనగపిండి- 2 టేబుల్ స్పూన్లు
పసుపు- 1 టేబుల్ స్పూన్
పాలు- 1 టేబుల్ స్పూన్

Also Read:  మీ ఫేస్ తెల్లగా మెరిసిపోవాలా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే !

అప్లై చేయు విధానం: ఒక బౌల్ తీసుకుని పైన చెప్పిన మోతాదుల్లో శనగపిండి, పసుపు, కొద్దిగా పాలు వేసి చిక్కటి పేస్ట్‌లా తయారు చేయండి. దీన్ని మెడ, మోచేతులకు పట్టించి ఆరనివ్వాలి.ఇది ఆరిన తర్వాత, సున్నితంగా స్క్రబ్ చేస్తూ కడగాలి. దీన్ని వారానికి రెండు సార్లు వాడితే చర్మంపై నలుపు క్రమంగా తగ్గుతుంది.

మెడ, మోచేతుల నలుపును తొలగించడానికి, రెగ్యులర్ కేర్ , రైట్ హోం రెమెడీస్ చాలా ముఖ్యమైనవి. సహజసిద్ధమైన పదార్థాలను ఉపయోగించడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చర్మాన్ని అందంగా, క్లియర్ గా మార్చుకోవచ్చు. ఈ చర్యలను అనుసరించడం ద్వారా, మీరు మీ మెడ, మోచేతుల చర్మాన్ని ఆరోగ్యంగా, శుభ్రంగా, మెరిసేలా చేసుకోవచ్చు.  చర్మం కాంతి వంతంగా మార్చడంలో ఇవి  ఎంతగానో ఉపయోగపడతాయి.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Tips For Skin Whitening: మీ ఫేస్ తెల్లగా మెరిసిపోవాలా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే !

Joint Pain Diet: కీళ్ల నొప్పులు తగ్గాలంటే.. ఖచ్చితంగా ఇవి తినాల్సిందే !

Tips For Weight Loss: తక్కువ టైంలో.. ఎక్కువ బరువు తగ్గించే బెస్ట్ డ్రింక్

Aloe Vera: అలోవెరా తింటే శరీరంలో జరిగే 5 మ్యాజిక్స్ ఇవే !

Dark Elbows: మోచేతుల నలుపుదనానికి చెక్ పెట్టండిలా !

Yoga for healthy hair: జుట్టు రాలకుండా ఉండటానికి.. ఈ యోగాసనాలు చేయండి

Big Stories

×