Home Remedies: అందంగా కనిపించడం కోసం చాలా మంది బయట మార్కెట్లో దొరికే రకరకాల ఫేస్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. వాటితో ఇన్స్టంట్ గ్లో మాత్రమే వస్తుంది. తరువాత మామూలై పోతుంది. అందుకే గ్లోయింగ్ స్కిన్ కోసం హోం రెమెడీస్ వాడటం చాలా మంచిది. వీటితో ముఖం శాశ్వతంగా మెరుస్తూ కనిపిస్తుంది. అంతే కాకుండా చర్మం అందంగా మారుతుంది. మరి ఈ హెం రెమెడీస్ తయారు చేయడానికి ఏ ఏ పదార్థాలు అవసరం అవుతాయి. వీటిని తయారు చేసుకునే పద్దతి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. శనగ పిండి,పెరుగు, పసుపు ఫేస్ట్ :
కావలసినవి:
శనగపిండి – 2 స్పూన్లు
పెరుగు – 1 టీ స్పూన్
పసుపు – 1/4 టీ స్పూన్
తయారీ విధానం: పైన చెప్పిన పదార్థాలన్నీ బాగా మిక్స్ చేసి పేస్ట్‌లా చేసుకోవాలి. తర్వాత దీనిని ముఖ, మెడపై అప్లై చేసి 15-20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఇలా తరుచుగా చేయడం వల్ల మంచి లాభాలు ఉంటాయి. అంతే కాకుండా ముఖంపై ఉన్న జిడ్డు కూడా తొలగిపోతుంది.
ప్రయోజనాలు: ఈ స్క్రబ్ చర్మాన్ని శుభ్రపరుస్తుంది. టానింగ్‌ను కూడా తగ్గిస్తుంది.
2. చందనం, రోజ్ వాటర్, దోసకాయ రసం:
కావలసినవి:
గంధపు పొడి – 1 టేబుల్ స్పూన్
రోజ్ వాటర్ – 2 టేబుల్ స్పూన్లు
దోసకాయ రసం – 1 టేబుల్ స్పూన్
తయారీ విధానం: పైన చెప్పిన అన్ని పదార్థాలను ఒక బౌల్‌లో వేసి మిక్స్ చేయండి. తర్వాత ఈ ఫేస్ట్‌ని ముఖానికి అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో కడిగేయండి.
ప్రయోజనాలు:ఈ పేస్ట్ చర్మాన్ని ఉపశమనం చేస్తుంది. అంతే కాకుండా చికాకును తగ్గిస్తుంది.
3. ఓట్స్, తేనె , పాలు :
కావలసినవి:
ఓట్స్ పౌడర్ – 2 టీస్పూన్లు
తేనె – 1 టీ స్పూన్
పాలు – 1 టీ స్పూన్
తయారీ విధానం: ఓట్స్‌ను గ్రైండ్ చేసి పొడి చేసుకోవాలి. తర్వాత పైన చెప్పిన అన్ని పదార్థాలను ఒక బౌల్ లో వేసి పేస్ట్ లాగా చేసుకోండి. తర్వాత దీనిని ముఖానికి అప్లై చేసి 15-20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి.
ప్రయోజనాలు: ఈ పేస్ట్ చర్మాన్ని మృదువుగా చేస్తుంది. అంతే కాకుండా మృత చర్మ కణాలను తొలగించి చర్మానికి పోషణనిస్తుంది.
4. టమోటా, పెరుగు, నిమ్మరసం పేస్ట్ :
కావలసినవి:
టమాటో గుజ్జు – 1 టీస్పూన్
పెరుగు – 1 టీస్పూన్
నిమ్మరసం – కొన్ని చుక్కలు
తయారీ విధానం: అన్ని పదార్థాలను కలపండి మరియు పేస్ట్ చేయండి. ముఖానికి అప్లై చేసి 15-20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి.
ప్రయోజనాలు: ఈ పేస్ట్ చర్మాన్ని టోన్ చేస్తుంది, మచ్చలను తగ్గిస్తుంది మరియు గ్లో తెస్తుంది.
5. శనగ పిండి, పసుపు, చందనం పేస్ట్ :
కావలసినవి:
శనగపిండి – 2 స్పూన్లు
పసుపు – 1/4 టీ స్పూన్
గంధపు పొడి – 1 టీ స్పూన్
వాటర్ – తగినంత
తయారీ విధానం: అన్ని పదార్థాలను పైన చెప్పిన మోతాదుల్లో ఒక బౌల్‌లోకి తీసుకుని మిక్స్ చేయండి. తర్వాత దీనిని ముఖానికి అప్లై చేసి 15-20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి.
ప్రయోజనాలు: ఈ పేస్ట్ చర్మాన్ని శుభ్రపరుస్తుంది. అంతే కాకుండా కాంతివంతంగా చేస్తుంది.
Also Read:రాత్రి పూట ప్రతి రోజు వీటిని ముఖానికి రాస్తే.. గ్లోయింగ్ స్కిన్ గ్యారంటీ
కొన్ని అదనపు చిట్కాలు :
పై పేస్ట్ అప్లై చేయడానికి ముందు, ముఖాన్ని పూర్తిగా శుభ్రం చేసుకోండి.
చేతులతో ముఖాన్ని మసాజ్ చేయండి.
15-20 నిమిషాల పాటు పేస్ట్ ముఖంపై ఉంచండి.
పేస్ట్ శుభ్రం చేసుకున్న తర్వాత, మాయిశ్చరైజర్ అప్లై చేయండి.