EPAPER

Onion Oil For Hair: ఈ ఆయిల్‌తో జుట్టు రాలడం తగ్గి, ఒత్తుగా పెరగడం మాత్రం పక్కా !

Onion Oil For Hair: ఈ ఆయిల్‌తో జుట్టు రాలడం తగ్గి, ఒత్తుగా పెరగడం మాత్రం పక్కా !

Onion Oil For Hair: ప్రస్తుతం మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంటున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా రాలే జుట్టుతో ఇబ్బంది పడుతున్నారు. జుట్టు రంగు మారడం, చుండ్రు రకరకాల సమస్యలతో మరి కొంత మంది ఇబ్బంది బాధపడుతున్నారు. ఇలాంటి వారు జుట్టు సంబంధిత సమస్యల నుంచి బయటపడేందుకు అనేక హెయిర్ ఆయిల్ ఉత్పత్తులను వాడుతుంటారు. ఎన్ని చేసినా ఫలితం మాత్రం అంతంత మాత్రమే. అలాంటి వారి కోసమే ఈ అద్భుతమైన హెయిర్ ఆయిల్. అదే ఆనియన్ ఆయిల్.


ఉల్లిపాయతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఉల్లి ఆరోగ్యానికే కాదు జుట్టుకు కూడా ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉల్లితో హెయిర్ ఆయిల్ తయారు చేసుకుని వాడితే అనేక రకాల జుట్టు సంబంధిత సమస్యలు తగ్గుతాయని అంటున్నారు. మరి ఈ నూనెల తయారు చేసుకోండి దీనివల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు..
ఉలిపాయ – ఒకటి
కొబ్బరి నూనె- అరకప్పు
మెంతులు – 1టేబుల్‌ స్పూన్
కరివేపాకు- 15 నుంచి 20 ఆకులు


తయారీ విధానం..
ఉల్లిపాయలను ముందుగా పొట్టు తొలగించి సన్నటి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టౌ మీద మంద పాటి గిన్నె ఉంచి అందులో కొబ్బరి నూనె, మెంతులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలను వేయాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని మీడియం మంట మీద అరగంటపాటు మరగనివ్వాలి. ఇలా చేయడం వల్ల ఉల్లి, కరివేపాకు, మెంతుల్లో ఉండే పోషకాలన్నీ నూనెలోకి చేరతాయి.

స్టౌ ఆఫ్ చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని చల్లార్చి శుభ్రమైన క్లాత్ తీసుకొని దాని సహాయంతో వడకట్టుకోవాలి. ఆ తర్వాత గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. కావాల్సినప్పుడల్లా దీన్ని ఉపయోగించుకోవచ్చు.

ఆనియన్ ఆయిల్‌ ప్రయోజనాలు..
ఉల్లి నూనె తయారీలో వాడిన కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి జుట్టుకు కావల్సిన తేమను అందించి సహజ మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా ఇవి జుట్టు కుదుళ్లకు బలాన్ని అందిస్తాయి. జుట్టు చివర్లు కూడా చిట్లిపోకుండా కాపాడతాయి.

కొబ్బరి నూనె కాలుష్య ప్రభావం నుంచి వెంట్రుకలను రక్షిస్తుంది. అంతే కాకుండా కుదుళ్లకు బలాన్ని అందించి జుట్టు చివర్లు చిట్లిపోకుండా చేస్తుంది. ఉల్లిపాయలో ఉండే పోషకాలు జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా వీటిలో ఉండే యాంటీ ఫంగల్ బ్యాక్టీరియా, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు జుట్టు సమస్యలను దూరం చేస్తాయి. అంతే కాకుండా ఇది జుట్టు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

Also Read: తలకు నూనె ఇలా పెట్టుకుంటే ఊడమన్నా.. ఊడదు !

ఆనియన్ ఆయిల్ జుట్టు రాలడాన్ని అరికట్టి హెయిర్‌ రీ గ్రోత్‌కు ఉపయోగపడుతుంది. వెంట్రుకలు బలంగా ఉండేలా చేస్తుంది. ఉల్లి నూనె తయారీలో వాడిన మెంతుల్లో ఉండే ప్రొటీన్, నికోటినిక్ యాసిడ్ చుండ్రు సమస్యను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఆనియన్ ఆయిల్ తరచుగా వాడటం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. జుట్టు రాలే సమస్య కూడా చాలా వరకు తగ్గుతుంది.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Hair Care Tips: జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగాలంటే.. ఈ ఆహారాలు తినాల్సిందే!

Papad History: కరకరలాడే అప్పడాలు ఈనాటివి కాదు, వేల ఏళ్ల నుంచి మనం తింటూనే ఉన్నాం

Biryani Cooking Tips: రెస్టారెంట్ స్టైల్‌లో ఇంట్లోనే బిర్యానీ వండుకుని తినాలనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Bitter Gourd Juice For Diabetes: కాకరకాయ జ్యూస్‌తో షుగర్ కంట్రోల్.. మరెన్నో లాభాలు

Potato For Skin Glow: బంగాళదుంపతో ఇలా చేసారంటే.. అందరూ అసూయపడే అందం మీ సొంతం

Multani Mitti Face Pack:ముల్తానీ మిట్టితో స్మూత్, గ్లోయింగ్ స్కిన్..

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Big Stories

×