EPAPER

Hibiscus Hair Mask: మందారంలో వీటిని కలిపి ఈ హెయిర్ మాస్క్ ట్రై చేశారంటే.. పట్టులాంటి జుట్టు మీ సొంతం

Hibiscus Hair Mask: మందారంలో వీటిని కలిపి ఈ హెయిర్ మాస్క్ ట్రై చేశారంటే.. పట్టులాంటి జుట్టు మీ సొంతం

Hibiscus Hair Mask For Hair Growth: జుట్టు పొడవుగా, ఒత్తుగా ఉండాలని ప్రతి అమ్మాయికి ఉంటుంది. అయితే ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు ప్రధానంగా ఎదుర్కుంటున్న సమస్య జుట్టు రాలిపోవడం. చుండ్రు ఎక్కువ అవడం. దీనికి కారణం దుమ్మూ, ధూళి, సరైన పోషకాహారం తీసుకోకపోవడం, జీవన శైలిలో మార్పులు, ఒత్తిడి ఇంకా వివిధ రకాల కారణాలు కావచ్చు. జుట్టు రాలిపోకుండా ఉండేందుకు బయట మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్ వాడుతుంటారు. కానీ వాటి వల్ల ఫలితం ఉండదు. కాబట్టి జుట్టు ఒత్తుగా, మృదువుగా, సిల్కీగాపెరగాలంటే మందార పువ్వులను ట్రై చేయొచ్చు. దేవుడు దగ్గర పూజకు కోసం పెట్టే మందార పుష్పాలు.. చూడటానికి ఎంత ఆకర్క్షణీయంగా ఉంటాయో. మీ జుట్టుకు కూడా మందార పువ్వులతో హెయిర్ మాస్క్ అప్లై చేశారంటే అందే అందగా కనిపిస్తుంది. జుట్టు ఊడకుండ ఉండటానికి , సౌందర్యానికి మందార పువ్వులు(Hibiscus)బాగా ఉపయోగపడతాయని అమ్మమ్మల కాలం నుంచి చెబుతున్న వాస్తవం. కాబట్టి మీరు కూడా మందార పువ్వులతో ఈ హెయిర్ మాస్క్ ట్రై చేయండి.


జుట్టు కోసం మందారం హెయిర్ మాస్క్
మందార పువ్వులను మిక్సీ పట్టి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అందులో కొంచె కొబ్బరి నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 20-25 నిమిషాలు తర్వాత తలస్నానం చేయ్యండి. ఇలా వారానికి ఒకసారి చేస్తే జుట్టు రాలడం ఆగిపోయి, ఒత్తుగా పెరుగుతుంది.

మందారం, ఉసిరి హెయిర్ మాస్క్
మందార పువ్వులను మెత్తగా పేస్ట్ చేసి, అందులో ఉసిరి పొడిని కలిపాలి. ఈ మిశ్రమాన్ని బాగా జుట్టు కుదుళ్లకు పట్టించండి. 40 నిమిషాల తర్వాత తేలిక పాటి షాంపుతో తలస్నానం చేయండి. ఇలా వారినికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఉసిరిలో విటమిన్ సి, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి, ఇవి జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడంలో ఉపయేగపడతాయి. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.


Also Read:  పండుగ వేళ.. ఇంట్లో దొరికే వస్తువులతో ఫేస్ ప్యాక్ ట్రై చేశారంటే.. ఇన్‌స్టంట్‌ గ్లో ఖాయం

అలోవెరా, మందారం హెయిర్ మాస్క్
మందార పువ్వుల్లో తాజా అలోవెరా జెల్ వేసి మెత్తగా పేస్ట్ చేసి జుట్టుకు అప్లై చేయండి. 45 నిమిషాల తర్వాత తలస్నానం చెయ్యండి. ఇలా వారానికి ఒక సారి చేస్తే జుట్టు మృదువుగా మారుతుంది. సిల్కీగా తయారవుతుంది.

మందారం, ఉల్లిపాయ హెయిర్ మాస్క్
మందారపువ్వులను, ఉల్లిపాయలను మెత్తగా పేస్ట్ చేసి, ఆతర్వాత వాటిని వడకట్టి రసాన్ని తలకు పట్టించండి. అరగంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చెయ్యండి. మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఉల్లిపాయలో జుట్టు పెరుగుదలకు కావాల్సిన గుణాలు పుష్కలంగా లభిస్తాయి.

మందారం, పెరుగు,, నిమ్మకాయ హెయిర్ మాస్క్
మందార పువ్వు పేస్ట్‌లో రెండు టేబుల్ స్పూన్ పెరుగు, టీ స్పూన్ నిమ్మకాయం కలిపి తలకు అప్లై చేయండి. అరగంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చుండ్రు సమస్యలు తొలగిపోయి జుట్టు పెరగటానికి సహాయపడుతుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

 

Related News

Panasa Curry: ఆవపెట్టిన పనస కూర ఇలా వండారంటే ఆ రుచికి ఎవరైనా దాసోహమే, రెసిపీ తెలుసుకోండి

Instant Glow Facial: పండుగ వేళ.. ఇంట్లో దొరికే వస్తువులతో ఫేస్ ప్యాక్ ట్రై చేశారంటే.. ఇన్‌స్టంట్‌ గ్లో ఖాయం

Relationships: మీ మాజీ లవర్‌తో ఇప్పటికీ స్నేహంగా ఉంటున్నారా? ఇది మంచి ఆలోచనేనా?

Amla Rice: ఉసిరికాయ అన్నం ఇలా చేసుకొని తింటే లంచ్ బాక్స్‌కు బాగుంటుంది, ఇది ఎంతో ఆరోగ్యం కూడా

Youthful Glow: ఎప్పటికీ యవ్వనంగా ఉండాలా? డైలీ, ఈ యాంటీ ఏజింగ్ ఫుడ్స్ తింటే చాలు.. వయస్సే తెలియదు

Rice Water: గంజి వచ్చేలా అన్నం వండి ఆ గంజినీళ్లను ప్రతిరోజూ తాగండి, మీరు ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి

Big Stories

×