EPAPER

Back Pain:- వేధించే వెన్నునొప్పికి ఇలా చెక్‌ పెట్టండి

Back Pain:- వేధించే వెన్నునొప్పికి ఇలా చెక్‌ పెట్టండి

Back Pain:– ఒకప్పుడు వెన్ను నొప్పి తక్కువ శాతం మందికే వచ్చేది. ప్రస్తుత కాలంలో మారిన జీవన ప్రమాణాలతో ప్రతి ఒక్కరినీ ఈ వెన్ను నొప్పి వేధిస్తోంది.
యువకులు, మధ్య వయసు ఉన్నవారు, వృద్ధులు అని తేడాలు లేకుండా అందరికీ వస్తోంది. ఎక్కువ సమయం కూర్చొని పనిచేయడంతో చాలా మంది వెన్నునొప్పితో బాధపడుతున్నారు. సరిగా వ్యాయామం చేయకపోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. పోషకాల లోపంతో, బరువైన వస్తువులను ఎత్తడం వల్ల వెన్నునొప్పి వస్తోంది. వెన్నునొప్పి సమస్యకు ఎక్కువగా మందులు వాడాల్సిన పనిలేదు, ఆపరేషన్లు అంతకంటే అవసరం లేదు. కేవలం నొప్పి నుంచి ఉపశమనం కలిగించే ఆహారాలు తీసుకుంటే సరిపోతుందని నిపుణులు అంటున్నారు. వెన్నునొప్పిని తగ్గించడంలో డార్క్‌ చాక్లెట్‌ సమర్థవంతంగా పనిచేస్తుంది. దీనిలోని మెగ్నీషియం మన ఎముకలను బలంగా ఉంచుతుంది. అంతేకాకుండా బాడీలో మెగ్నీషియం లోపించడం వల్ల వెన్నునొప్పితో పాటు పలు రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. డార్క్‌ చాక్లెట్‌, స్వీట్స్‌, షేక్‌లు వెన్నునొప్పిని తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఆకుపచ్చని కూరగాయలు కూడా వెన్నునొప్పికి మంచి ఔషధంగా పనిచేస్తాయి. సాధారణంగా ఆరోగ్యం బాగుండాలంటే ఆకుకూరలు తింటూ ఉండాలి. వీటిలో ఉండే విటమిన్‌ కె. ఐరన్‌, కాల్షియం వెన్నునొప్పిని తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. గుడ్డులో కాల్షియం, విటమిన్‌ డి బాగా ఉంటాయి. ఇది ఎముకలకు ఎంతో బలాన్ని ఇస్తుంది. ప్రతిరోజూ మన ఆహారంలో ఒక గుడ్డును భాగం చేసుకుంటే వెన్నునొప్పి ఉండదు. అలాగే పసుపులో ఔషధ గుణాలు అధికంగా ఉంటాయి. పలు రకాల ఇన్‌ఫెక్షన్ల నుంచి పసుపు మన శరీరాన్ని రక్షిస్తుంది. పసుపు కలిపిన పాలు, పసుపు టీని తీసుకోవడం వల్ల వెన్నునొప్పిని దూరం చేసుకోవచ్చు. అల్లం కూడా వెన్నునొప్పిని తగ్గించడంలో భాగా సహాయపడుతుంది. దీనిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు వెన్నునొప్పిని ఇట్టే తగ్గిస్తాయి. రోజూ 2 స్పూన్ల అల్లం రసంలో ఒక స్పూన్‌ తేనె కలిసి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు అంటున్నారు.


Hair Growth Tips : బట్టతలపై జుట్టు వచ్చేలా చేసే మొక్క ఇదే!


Related News

Potato For Skin Glow: బంగాళదుంపతో ఇలా చేసారంటే.. అందరూ అసూయపడే అందం మీ సొంతం

Multani Mitti Face Pack:ముల్తానీ మిట్టితో స్మూత్, గ్లోయింగ్ స్కిన్..

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Big Stories

×