EPAPER

World Hepatitis Day 2024: ప్రమాద ఘంటికలు మోగిస్తున్న హెపటైటిస్ ? హెపటైటిస్ అంటే ఏమిటి ?

World Hepatitis Day 2024: ప్రమాద ఘంటికలు మోగిస్తున్న హెపటైటిస్ ? హెపటైటిస్ అంటే ఏమిటి  ?

World Hepatitis Day 2024: ప్రపంచవ్యాప్తంగా జూలై 28వ తేదీన ప్రపంచ హెపటైటిస్ డేగా జరుపుకుంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేరకు ఈ రోజును నిర్వహిస్తున్నారు. హెపటైటిస్‌‌ను నిరోధించడం వ్యాధి సోకిన వారిని వెంటనే గుర్తించి చికిత్స ప్రారంభించడం, తద్వారా దీర్ఘకాలిక వ్యాధిగా హెపటైటిస్ మారకుండా చేయడం వంటివి దీని ముఖ్య ఉద్దేశాలు.


ఎయిడ్స్ వల్ల చనిపోతున్న వారి కంటే హెపటైటిస్ వల్ల చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ నివేదికలో వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా హెపటైటిస్ వల్ల మరణిస్తున్న వారిలో 58% తూర్పు, దక్షిణాసియాకు చెందినవారే. అయితే ఈ వ్యాధి వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 14 లక్షల మంది మరణిస్తున్నారు. దాదాపు అందులో 2 లక్షల మంది భారతీయులు ఉండటం గమనార్హం. తీవ్రమైన ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని డబ్ల్యూహెచ్‌ఓ హెపటైటిస్ డేను ప్రకటించింది.

హెపటైటిస్ అంటే ?
మానవ శరీరంలో కీలకమైన అవయవాల్లో కాలేయం కూడా ఒకటి. పోషకాలను శరీరం స్వీకరణకు అనుకూలంగా మార్చడం రక్తాన్ని వడబోయడం ఇన్ఫెక్షన్లతో పోరాడడం ద్వారా వ్యక్తి ఆరోగ్యాన్ని కాలేయం పరిరక్షిస్తుంది. కాలేయానికి సోకే వ్యాధుల్లో హెపటైటిస్ ప్రధానమైంది. హెపటైటిస్ వచ్చిన తర్వాత క్రమంగా దీనిని నిర్లక్ష్యం చేస్తే ఇది పనిచేయలేని స్థితికి చేరుకుంటుంది. మితిమీరిన మద్యం సేవించడం, ఆహారం పానీయాల ద్వారా శరీరంలోకి ప్రవేశించిన విషపదార్థాలు అనేక రకాల ఔషధాలు, వంశపారంపర్యంగా కూడా కొన్ని సందర్భాల్లో హెపటైటిస్ వ్యాధి వస్తుంది.


ఐతే చాలా సందర్భాల్లో వైరస్‌లు కూడా ఈ వ్యాధికి కారణమవుతుంటాయని నిపుణులు చెబుతున్నారు. హెపటైటిస్ల్ లో ఐదు రకాలు ఇన్‌ఫెక్షన్ ఉంటాయి. హెపటైటిస్ ఎ, బి, సి,డి, ఇ వంటివి ఉంటాయి. మన దేశంలో సాధారణంగా హెపటైటిస్ ఎ,సి,బి లు వైరస్ వల్ల ఎక్కువగా వస్తుంటాయి. హెపటైటిస్ వైరస్ మన శరీరంలోకి ప్రవేశించిన తర్వాత వ్యాధి లక్షణాలు కనిపించే వరకూ పట్టే సమయాన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అని పిలుస్తారు. ఈ సమయంలో వైరస్ రకాన్ని బట్టి మారుతూ ఉంటుంది.

హెపటైటిస్ ఇ వైరస్‌ల రెండు నుంచి ఆరు వారాలు ఉంటుంది. హెపటైటిస్ బి, సి వైరస్‌ల రెండు నుంచి ఆరు నెలల సమయం తీసుకుంటుంది. తీవ్రమైన హెపటైటిస్ ఇది కాలేయ మార్పిడి చేసేందుకు కారణం అవుతుంది. అంటే కాలేయం పూర్తిగా పని చేయలేని స్థితిలో ఉన్నప్పుడు కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేస్తారు.హెపటైటిస్ వ్యాధిగ్రస్తుల్లో 80% మందికి అకాల మృత్యువును కలిగిస్తుంది.
అందుబాటులో ఉన్న టీకాలు..

హెపటైటిస్ బి వైరస్ నుంచి రక్షణ ఇవ్వగల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. ఏడాది నుంచి రెండేళ్ల మధ్య వయసున్న పిల్లలు అందరికీ హెపటైటిస్ వ్యాక్సిన్ చేయించడం మంచిది. హెపటైటిస్ సోకే అవకాశం ఉన్నవారిలో, దీర్ఘకాలికంగా హెపటైటిస్ బి, సిలతో బాధపడుతున్న వారికి కూడా ఎప్పటి టీకాలు చేయించడం అవసరం. ఇదేవిధంగా హెపటైటిస్ సోకే అవకాశం ఉన్న అన్ని వయసుల వారు వ్యాక్సిన్‌ను వేయించుకోవాలి.

టీకా ఉన్నా..
టీకా మందుల ద్వారా హెపటైటిస్‌ను నిరోధించే అవకాశం ఉన్నప్పటకీ దేశంలో చాలామంది ఈ వ్యాక్సిన్లు వేయించుకోడం లేదు. నిజానికి కాలేయ క్యాన్సర్ రాకుండా ముందు జాగ్రత్తగా డబ్ల్యూహెచ్‌ఓ హెపటైటిస్ మందును సూచించింది. హెపటైటిస్ బి,సి రెండు కూడా శరీరంలో స్థిరపడి లివర్ సిరోసిస్ ఏర్పడేటట్లు చేస్తాయి. పెద్దగా రోగ లక్షణాలు ప్రదర్శించకుండా ఉండడం వల్ల వీటిని గుర్తించి చికిత్స ప్రారంభించడానికి ప్రధాన ఆటంకంగా మారుతోంది.

చాప కింద నీరులా విస్తరిస్తున్న హెపటైటిస్ ను నిరోధించే లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఈ ప్రపంచ హెపటైటిస్ దినం పాటిస్తూ వారి వారి దేశాల్లో ఈ వ్యాధి నిరోధం, చికిత్సల గురించి ప్రజల్లో అవగాహన పెంచేందుకు కృషి చేస్తున్నారు. సంవత్సరాలకు పైగా జరుగుతున్న ఈ ప్రపంచ దేశాల ప్రయత్నం సమిష్టి కృషితో భారీ లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తోంది.

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×