EPAPER

Henna For Hair: జుట్టుకు హెన్నా పెడుతున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

Henna For Hair: జుట్టుకు హెన్నా పెడుతున్నారా ?  ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

Henna For Hair: ప్రస్తుతం చాలా మంది జుట్టుకు మెహందీ పెట్టడం మనం చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా తెల్ల జుట్టు నల్లగా మారడానికి చాలా మంది హెన్నాను కూడా అప్లై చేస్తుంటారు. ప్రస్తుతం మార్కెట్‌లో అనేక రకాల హెన్నాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని ప్రజలు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. తలకు హెన్నా పెట్టే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. న్యాచురల్ హెన్నా జుట్టు సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. కానీ కొన్నిసార్లు చిన్న పొరపాట్లు జుట్టుకు హాని కలిగిస్తాయి.


ఈ రోజుల్లో రసాయనాలతో తయారు చేసిన హెన్నా, బ్లాక్ హెన్నా కూడా విరివిగా అందుబాటులో ఉన్నాయి. హెర్బల్ హెన్నాకు బదులుగా వాటిని ఉపయోగించడం కొన్నిసార్లు హానికరం. అందుకే హెన్నా ను అప్లై చేసే ముందు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి.

హెన్నా తలకు పెట్టేటప్పుడు తీసుకోవాల్సి జాగ్రత్తలు :


హెన్నా కొనడం:
మార్కెట్‌లో లభించే అనేక హెన్నాలలో జుట్టు, చర్మానికి హాని కలిగించే హానికరమైన రసాయనాలు ఉంటాయి. చాలా మంది బ్లాక్ హెన్నా వాడుతుంటారు. ఇది PPD (పారా-ఫెనిలెన్డియమైన్) అనే రసాయనం నుంచి తయారవుతుంది. ఇది అలెర్జీలకు కారణమవుతుంది. కొనుగోలు చేసేటప్పుడు, ఎల్లప్పుడూ పేరున్న బ్రాండ్ నుండి లేబుల్ చేయబడిన హెన్నాను మాత్రమే కొనాలి.

హెన్నా తయారు చేయడంలో పొరపాటు:
హెన్నా పొడిలో సరిపడ నీటిని వేయకుండా హెన్నాను తయారు చేసి జుట్టుకు పెడుతుంటారు. ఇలా చేయడం అంత మంచిది కాదు. హెన్నాను కనీసం 2-3 గంటలు నానబెట్టండి. రాత్రిపూట నానపెట్టి ఉదయం ఉపయోగించినా మంచి ఫలితం ఉంటుంది.

అప్లై చేయు విధానం:
మురికి జుట్టు మీద హెన్నాను ఎప్పుడూ అప్లై చేయకూడదు. హెన్నాను అప్లై చేసే ముందు జుట్టుకు నూనె రాయకండి. హెన్నాను జుట్టు అంతటా, ముఖ్యంగా మూలాలపై సమానంగా అప్లై చూసుకోండి. మందంగా జుట్టుకు హెన్నా అప్లై చేయండి.

వాషింగ్ మిస్టేక్:
చాలా మంది హెన్నా త్వరగా కడుగుతారు. హెన్నాను కనీసం 6-8 గంటలు , రాత్రిపూట పెట్టుకుని ప్రొద్దున తలస్నానం చేయాలి.మెహందీని వేడి నీళ్లతో శుభ్రం చేయకూడదు. చల్లని లేదా గోరువెచ్చని నీటిని హెన్నా ను శుభ్రం చేయడానికి ఉపయోగించండి. మొదటి రోజు హెన్నా వాష్ చేసుకునేటప్పుడు తలకు సబ్బు, షాంపూ ఉపయోగించకూడదని గుర్తుంచుకోండి.

Also Read: అరటి పండుతో గ్లోయింగ్ స్కిన్

హెన్నాను జుట్టుకు అప్లై చేయడానికి సరైన మార్గం:
ముందుగా తలస్నానం చేసి జిడ్డు పోయిన తర్వాత తలను ఆరనివ్వాలి. మీ జుట్టు పొడవుగా లేదా మందంగా ఉంటే, దానిని విభాగాలుగా చేయండి. ఆ తర్వాత తగిన పరిమాణంలో హెన్నాలో నీరు పోసి కలుపుకోండి . ఆ తర్వాత చేతికి గ్లౌజ్లు పెట్టుకురని హెన్నా అప్లై చేయండి. హెన్నా పేస్ట్‌ను బ్రష్ లేదా అప్లికేటర్‌తో జుట్టుకు రాయండి. మూలాల నుంచి క్రమంగా జుట్టు చివర్ల వరకు అప్లై చేయండి. ఈ పేస్ట్ కనీసం 6-8 గంటలు లేదా రాత్రిపూట పెట్టుకుని పూర్తిగా ఆరిన తర్వాత వాష్ చేసుకోండి.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Hair Spa: ఇంట్లోనే హెయిర్ స్పా.. ఎలా చేసుకోవాలో తెలుసా ?

Beetroot Juice: శరీరంలో బ్లడ్ పెరగాలా ? ఈ జ్యూస్ తాగితే సరి

Face Fat: మీ ముఖంపై ఫ్యాట్ పెరిగిందా ?.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Work Pressure: పని ఒత్తిడి.. చివరకు ఆత్మహత్యలకు కారణమవుతుందా..?

Headache: తలనొప్పితో ఇబ్బంది పడుతున్నారా ? ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Banana For Skin: అరటి పండుతో గ్లోయింగ్ స్కిన్

Big Stories

×