EPAPER

Amla Rice: ఉసిరికాయ అన్నం ఇలా చేసుకొని తింటే లంచ్ బాక్స్‌కు బాగుంటుంది, ఇది ఎంతో ఆరోగ్యం కూడా

Amla Rice: ఉసిరికాయ అన్నం ఇలా చేసుకొని తింటే లంచ్ బాక్స్‌కు బాగుంటుంది, ఇది ఎంతో ఆరోగ్యం కూడా
Amla Rice: రుచి కోసమే కాదు, ఆరోగ్యం కోసం కూడా ప్రత్యేకంగా కొన్ని ఆహారాలను తినాలి. అలాంటి వాటిలో ఉసిరికాయ ఒకటి. ఇక్కడ మేము ఉసిరికాయ రైస్ రెసిపీ ఇచ్చాము. ఇది ఆరోగ్యాన్ని కాపాడే రెసిపీ. దీన్ని చేయడం కూడా చాలా సులువు. ఉసిరికాయ రైస్‌లో ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి. శీతాకాలం వస్తుందంటే ఉసిరికాయ చెట్టు చిగురు పెట్టడం మొదలై ఉసిరికాయలను అందిస్తుంది. వాటితో మీరు ఓసారి ఆమ్లా రైస్ ప్రయత్నించి చూడండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. లంచ్ బాక్స్‌లోనూ రాత్రి డిన్నర్ లో కూడా ఈ అన్నాన్ని తినవచ్చు. ఉసిరికాయ రైస్ రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
ఉసిరికాయ రైస్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు 
బియ్యం – ఒక కప్పు
ఉసిరికాయలు – ఐదు
నువ్వులు – రెండు స్పూన్లు
మిరియాలు – అర స్పూను
పసుపు – అర స్పూను
నీళ్లు – సరిపడినన్ని
ఉప్పు – రుచికి సరిపడా
అల్లం తురుము – అర స్పూను
కరివేపాకులు – గుప్పెడు
ఇంగువ – చిటికెడు
జీలకర్ర – ఒక స్పూను
మినపప్పు – ఒక స్పూన్
శనగపప్పు – ఒక స్పూన్
ఆవాలు – ఒక స్పూన్
నూనె – సరిపడినంత
వేరుశెనగ పలుకులు – గుప్పెడు
పచ్చిమిర్చి – రెండు
ఎండుమిర్చి – రెండు
ఉసిరికాయ రైస్ రెసిపీ 
1. ఉసిరికాయ రైస్ వండడానికి ముందుగా అన్నాన్ని వండి పెట్టుకోవాలి.
2.  బియ్యం శుభ్రంగా కడిగి గిన్నెలో వేసి పసుపును కలపాలి.
3. అలాగే కాస్త ఉప్పును కూడా కలిపి నీళ్లు వేసి అన్నం వండుకోవాలి.
4. అన్నం ఉడికాక పొడిపొడిగా వచ్చేలా ఒక ప్లేట్లో ఆరబెట్టుకోవాలి.
5. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నువ్వులు, మిరియాలు వేసి వేయించుకోవాలి.
6. వాటిని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.
7. ఈలోపు ఉసిరికాయలను సన్నగా తురిమి పక్కన ఉంచుకోవాలి.
8. స్టవ్ మీద ఉన్న కళాయిలో నూనె వేసి ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, వేరుశెనగ పలుకులు వేసి వేయించుకోవాలి.
9. వాటి తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఇంగువ, కరివేపాకులు వేసి కలుపుకోవాలి.
10. అలాగే అల్లం తురుము, వెల్లుల్లి తురుము, ఉసిరికాయ తురుమును కూడా వేసి బాగా కలుపుకోవాలి.
11. ఈ మొత్తాన్ని చిన్నవంట మీద ఫ్రై చేయాలి.
12. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి.
13. అన్నంలో ఆల్రెడీ ఉప్పు వేసి ఉడికించాము కాబట్టి అవసరమైతేనే ఉప్పును వేయండి.
14. ఇప్పుడు ఈ మిశ్రమంలో ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని వేసి పులిహోరలోగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే టేస్టీ ఉసిరికాయ రైస్ రెడీ అయిపోతుంది. ఇది చాలా రుచిగా ఉంటుంది.
ఉసిరికాయతో ఉపయోగాలు 
ఉసిరికాయలో యాంటీ ఏజింగ్ లక్షణాలు అధికంగా ఉంటాయి. కాబట్టి ఉసిరికాయ తినడం వల్ల చర్మం ఆరోగ్యంగా, మచ్చలు లేనిదిగా, ముడతలు లేనిదిగా ఉంటుంది. ఉసిరికాయలు సీజనల్‌గా దొరికేవి. కచ్చితంగా ఆయా సీజన్లో తినాల్సిందే. ఇలా ఉసిరికాయ రైస్‌ను తినడం వల్ల మీకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పోషకాలు అందిస్తాయి. దీని రుచి కూడా బాగుంటుంది. లంచ్ బాక్స్ రెసిపీకి అదిరిపోతుంది. ఉసిరికాయ రైస్‌తో పాటు పక్కన రైతా, కర్రీ లాంటివి అవసరం లేదు.


Related News

Relationships: మీ మాజీ లవర్‌తో ఇప్పటికీ స్నేహంగా ఉంటున్నారా? ఇది మంచి ఆలోచనేనా?

Youthful Glow: ఎప్పటికీ యవ్వనంగా ఉండాలా? డైలీ, ఈ యాంటీ ఏజింగ్ ఫుడ్స్ తింటే చాలు.. వయస్సే తెలియదు

Rice Water: గంజి వచ్చేలా అన్నం వండి ఆ గంజినీళ్లను ప్రతిరోజూ తాగండి, మీరు ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి

Thyroid: వీటితో ఇంట్లోనే థైరాయిడ్‌కు చెక్ !

Hair Spa: ఇంట్లోనే హెయిర్ స్పా.. ఎలా చేసుకోవాలో తెలుసా ?

Henna For Hair: జుట్టుకు హెన్నా పెడుతున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

Big Stories

×