Winter Skin : చర్మ సంబంధిత సమస్యలు మొదలయ్యేది వింటర్లోనే. ఒక్క ముఖాన్నే కాదు శరీరం మొత్తం చర్మాన్ని ప్రభావితం చేస్తాయి. దీని కారణంగా ఆ రోజు మొత్తం చాలా చిరాకుగా అనిపిస్తుంటుంది. అందుకే చలికాలంలో చర్మాన్ని సున్నితంగా ఉంచుకోవడానికి ఈ చిట్కాలను పాటించేద్దాం.
వింటర్లో స్నానాన్ని కేవలం 5 నుంచి 10 నిమిషాల్లోపే ముగించాలి. అది కూడా గోరువెచ్చని నీటితోనే చేయాలి.
రసాయనాలు అధికంగా ఉన్న ఉత్పత్తులు కాకుండా.. సహజమైన మాయిశ్చరైజర్ వాడాలి.
పెదవులు పగిలిపోకుండా లిప్‌బామ్ వాడాలి. కానీ దాన్ని పదే పదే రాయకూడదు. రోజుకు రెండు మూడుసార్లు చాలు.
చలికి ఎక్కువ దాహం వేయదు. కానీ తరచూ నీరు తాగడం అలవాటు చేసుకోవాలి.
సన్‌స్క్రీన్‌ను వేసవిలోనే కాదు.. వింటర్లో కూడా రాసుకోవచ్చు.