EPAPER
Kirrak Couples Episode 1

Pregnant Women : కాబోయే అమ్మలూ.. ఇవి మీ కోసమే!

Pregnant Women : కాబోయే అమ్మలూ.. ఇవి మీ కోసమే!
Pregnant Women

Pregnant Women : మహిళలు తల్లి అవడం ఒక ప్రత్యేక అనుభూతి. గర్భం దాల్చినప్పుడు వారి ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఇలాంటి పరిస్థితుల్లో కాబోయే అమ్మలు మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. దీంతోపాటు మరింత శక్తిని పుంజుకోవాలంటే విటమిన్స్, మినరల్స్ ఉన్న జ్యూసులు తాగడం కూడా అంతే ముఖ్యం. మరి కాబోయే తల్లులకు మేలు చేసే డ్రింక్స్ ఏవో చూద్దామా!


అల్లం పాలు
గర్భవతులు అల్లం పాలు తాగడం వల్ల వాంతుల సమస్య తగ్గుతుంది. అలాగే ఉదర సంబంధిత సమస్యలు అంటే.. అజీర్తి, కడుపు ఉబ్బరం, కడుపులో వికారం వంటి సమస్యలు తగ్గుతాయి.

వేడినీటి నిమ్మరసం
ఇమ్యూనిటీని పెంచడంలో నిమ్మరసం సహాయపడుతుంది. వేడినీటిలో నిమ్మరసం కలుపుకుని తాగితే.. సీజనల్ వ్యాధులు బారిన పడకుండా ఉంటారు. అలాగే పుట్టే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుంది.


చికెన్-ఆనియన్ సూప్
ఈ సూప్ తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కండరాలు బలపడతాయి. కండరాలు బలంగా ఉంటే మహిళలకు గర్భాన్ని మోయడంలో ఇబ్బంది ఉండదు.

వేడి పాలు
గర్భవతులు క్రమం తప్పకుండా వేడి పాలు తాగితే కూడా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో కాబోయే తల్లలు పదే పదే అనారోగ్యానికి గురవ్వకుండా ఆరోగ్యంగా ఉంటారు.

Related News

Vegetable pulao: నూనె అవసరం లేకుండా వెజిటబుల్ పులావ్ ఇలా చేసేయండి, ఇది ఎంతో హెల్తీ రెసిపీ

Ghee Purity Check: కల్తీ నెయ్యిని ఎలా గుర్తించాలి ?

Brain Health: మీ మెదడును రహస్యంగా దెబ్బతీసే రోజువారీ అలవాట్లు ఇవే, ఇప్పటినుంచి మానేయండి

Turmeric Benefits: పసుపుతో అద్భుతాలు.. ఈ సమస్యలన్నీ దూరం

Tomato Face Packs: టమాటోతో గ్లోయింగ్ స్కిన్..

Sitting Too Much Health: ఎక్కువ సేపు కూర్చొని పనిచేస్తే ఆరోగ్య సమస్యలు.. ఇదే పరిష్కారం..

Health Tips: ఖాళీ కడుపుతో ఈ ఆహారం తింటే ఆరోగ్యానికి ఎంత ప్రమాదం తెలుసా !

Big Stories

×