EPAPER
Kirrak Couples Episode 1

Pomegranate benefits : దానిమ్మతో దిమ్మతిరిగే ఆరోగ్య ప్రయోజనాలు.. !

Pomegranate benefits : దానిమ్మతో దిమ్మతిరిగే ఆరోగ్య ప్రయోజనాలు.. !
Pomegranate benefits

Pomegranate benefits : వివిధ విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లతో నిండిన పోషకమైన ఫలాల్లో దానిమ్మది అగ్రస్థానం. దీని పుష్పం, బెరడు, వేళ్లు, ఆకులు, కాండం అన్నీ ఔషధ భరితాలే. తరచుగా దానిమ్మను తినటం వల్ల అనేక ఆరోగ్య, సౌందర్య ప్రయోజనాలున్నాయి. అవి..


దానిమ్మలో పుష్కలంగా ఉండే విటమిన్ సీ మన రోగనిరోధక శక్తిని తక్కువ సమయంలో పెంచుతుంది. ఇక.. దానిమ్మలోని ఐరన్.. రక్తహీనతను దూరం చేస్తుంది. దానిమ్మ.. రక్తం గడ్డకట్టటానికి దోహదపడుతుంది. రక్తంలోని అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. దానిమ్మలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్ (ఆరోగ్యాన్ని దెబ్బతీసే హానికారక కణాలు)ను కట్టడి చేయటమే గాక, జీవక్రియల వేగాన్ని పెంచుతాయి. దానిమ్మలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు ఒళ్లు నొప్పులను తగ్గిస్తాయి.

తరచూ దానిమ్మను తీసుకునే వారిలో గుండె జబ్బులు, కేన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల బెడద కూడా తగ్గుతుంది. అధిక రక్తపోటు ఉన్నవారికి దానిమ్మ దివ్యమైన ఔషధమనే చెప్పాలి. దీని వినియోగం వల్ల రక్తపోటు తగ్గి, గుండె పనితీరు బాగుంటుంది. గుండెకు రక్త ప్రసరణ కూడా మెరుగు పడుతుంది. జ్ఞాపకశక్తిని పెంచటంలోనూ దానిమ్మ పాత్ర అమోఘం. ముఖ్యంగా వృద్ధులు రోజూ దానిమ్మ తినటం వల్ల వారి మెదడు పనితీరు దెబ్బతినకుండా ఉంటుంది. దీనివల్ల మెమరీ లాస్ వంటి సమస్యలు తగ్గుతాయి.


కేన్సర్‌ను కట్టడి చేయటంలోనూ దానిమ్మ పాత్ర అమోఘం. ముఖ్యంగా ప్రోస్టేట్ కేన్సర్‌ను కట్టడి చేయటంలో ఇది బాగా పనిచేస్తుంది. సంతానం కోరుకునే వారికి ఇది అద్భుత ఫలితాలను ఇస్తుందని కూడా వైద్యులు చెబుతున్నారు. కడుపునొప్పి, కడుపులో వికారంగా ఉంటే.. దానిమ్మ ఆకుల టీ బాగా పనిచేస్తుంది. మలబద్దకం, గ్యాస్, ఎసిడిటీ బాధితులు రోజూ 2 చెంచాల దానిమ్మ ఆకుల రసం తీసుకుంటే సమస్య దారికొస్తుంది. గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులున్న వారు దానిమ్మ ఆకులు నూరి పూతగా రాసుకుంటే తగ్గుతాయి.

తీవ్రమైన దగ్గు ఉంటే.. ఎండు దానిమ్మ ఆకుల పొడి, దానిమ్మ పూల మొగ్గలు, నల్లమిరియాలు, తులసి ఆకులు నీటిలో వేసి ఐదు నిమిషాలు మరగించి, ఆ నీటిని రోజుకి రెండు సార్లు తాగితే దగ్గు తగ్గిపోతుంది. నోటి దుర్వాసన, చిగుళ్ల వాపు, నోటిలో పుండ్ల నివారణకు గుప్పెడు దానిమ్మ ఆకుల రసం తీసి 400ఎం.ఎల్ నీటిలో వేసి సగానికి మరిగించి, ఆ నీటితో నోరు పుక్కిలిస్తే నోటి సమస్యలు దూరమవుతాయి.

Related News

Ghee Purity Check: కల్తీ నెయ్యిని ఎలా గుర్తించాలి ?

Brain Health: మీ మెదడును రహస్యంగా దెబ్బతీసే రోజువారీ అలవాట్లు ఇవే, ఇప్పటినుంచి మానేయండి

Turmeric Benefits: పసుపుతో అద్భుతాలు.. ఈ సమస్యలన్నీ దూరం

Tomato Face Packs: టమాటోతో గ్లోయింగ్ స్కిన్..

Sitting Too Much Health: ఎక్కువ సేపు కూర్చొని పనిచేస్తే ఆరోగ్య సమస్యలు.. ఇదే పరిష్కారం..

Health Tips: ఖాళీ కడుపుతో ఈ ఆహారం తింటే ఆరోగ్యానికి ఎంత ప్రమాదం తెలుసా !

Drinking alcohol before sleep : రాత్రి నిద్రపోయేముందు మద్యం సేవిస్తున్నారా?.. ఈ సమస్యలు వచ్చే ప్రమాదముంది జాగ్రత్త!

Big Stories

×