EPAPER

Watermelon Seeds: పుచ్చగింజలు పడేస్తున్నారా ? పోషకాలు తెలిస్తే షాక్ అవుతారు

Watermelon Seeds: పుచ్చగింజలు పడేస్తున్నారా ? పోషకాలు తెలిస్తే షాక్ అవుతారు

 Health Benefits Of  Watermelon Seeds: పుచ్చకాయ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. చాలా మంది పుచ్చకాయను తినేటప్పుడు గింజలను పక్కన పడేస్తున్నారు. కానీ వాటిని తినడం వల్ల కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పుచ్చగింజల్లో ఉండే పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. పుచ్చ గింజల వల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.


పోషకాలు ఫుల్:
పుచ్చకాయతో పోషకాలతో పోలిస్తే గింజల్లోనే ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా విటమిన్ సి, ప్రోటీన్లు, ఫైబర్, ఆరోగ్యమైన కొవ్వులతో పాటు ఐరన్, కాపర్, జింక్ ,మాంగనీస్ వంటివి పుచ్చ గింజల్లో సమృద్ధిగా ఉంటాయి. వీటిని తినడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

గుండె జబ్బులు:
పుచ్చ గింజల్లో మోనో అన్‌శాచురేటెడ్, పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని డైట్‌లో చేర్చుకోవడం ద్వారా గుండెనొప్పి, మధుమేహం, గుండెపోటు వంటి దీర్ఘకాలిక సమస్యల నుంచి రక్షణ పొందవచ్చున ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ గింజల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు గుండె పనితీరును మెరుగుపరుస్తాయి.


జీర్ణక్రియ మెరుగుదల:
పుచ్చగింజలను డైట్‌లో చేర్చుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇందులో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం ద్వారా జీర్ణ శక్తి పెరగడమే కాకుండా ఘట్ సిస్టమ్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

రోగ నిరోధక శక్తి:
పుచ్చగింజల్లో ఉండే జింక్, విటమిన్ సి వంటివి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇమ్యూనిటీ పవర్ పెంచడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఈ గింజలు మీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

జ్ఞాపకశక్తి పెరుగుదల:
పుచ్చగింజల్లో శరీరానికి శక్తినిచ్చే గుణాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా వీటిలోని పోషకాలు ఆకలిని అదుపు చేస్తాయి. కడుపు నిండిన అనుభూతిని కూడా కలిగిస్తాయి. అలాగే మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తాయి. జ్ఞాపకశక్తిని పెంపొందించడంలో ఈ విత్తనాలు బాగా పనిచేస్తాయని నిపుణులు చెబుతురన్నారు.

చర్మ సంరక్షణ:
ముఖంపై ముడతలు తొలగిపోయి మిలమిల మెరవాలంటే పుచ్చగింజలను ఆహారంలో భాగంగా చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులో మెగ్నీషియం, జింక్ ఇతర ఖనిజ లవణాలు శరీరానికి పోషణను అందిస్తాయి. అంతే కాకుండా వృద్ధాప్య ఛాయలు రాకుండా అడ్డుకుంటాయి. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాలు వీటిలో ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

క్రమం తప్పకుండా పుచ్చ గింజలు తినడం వల్ల ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో ఉండే పోషకాలు కండరాలను దృఢంగా మారుస్తాయి. రక్తంలో చక్కెర స్థాయి నియంత్రించడంలో ప్రభావవంతవగా పని చేస్తాయి.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Multani Mitti Face Pack:ముల్తానీ మిట్టితో స్మూత్, గ్లోయింగ్ స్కిన్..

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Big Stories

×