EPAPER

Sugar Less Coffee: షుగర్ లెస్ కాఫీ.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా ?

Sugar Less Coffee: షుగర్ లెస్ కాఫీ.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా ?

Uses of Sugar Less Coffee: కాఫీ.. చాలామందికి ఇష్టమైన పానీయం. ఉదయాన్నే బెడ్ దిగకుండానే కాఫీ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. కొందరు తమ రోజును కాఫీతోనే ప్రారంభిస్తారు. కాఫీ తాగకపోతే అస్సలు ఆ రోజు గడిచినట్టే ఉండదు. ఇంకొందరు రోజువారీ పనుల్లోకి వెళ్లే ముందు తాగుతారు. తలనొప్పి వచ్చినా, అలసిపోయినా, ఏం తోచకపోయినా ముందు తాగేది కాఫీ.


నిజానికి మన దేశంలో టీ, కాఫీ లవర్స్ చాలా ఎక్కువ. టీ లలో నార్మల్ టీ, మసాలా టీ, శొంఠి టీ, అల్లం ఛాయ్ వంటి రకాలు ఉన్నట్టే.. కాఫీలోనూ రకాలున్నాయ్. కాఫీ, ఫిల్టర్ కాఫీ, బ్లాక్ కాఫీ, కోల్డ్ కాఫీ.. లిస్ట్ తీయాలే గానీ చాలానే ఉంటాయి.

కాఫీ గింజల్లో నాలుగు ప్రధాన రకాలున్నాయి. అరబికా, రోబస్టా, ఎక్సెల్సా, లైబెరికా. ఈ నాలుగు విభిన్నమైన రుచులను కలిగి ఉంటాయి. మన ఆంధ్రాలో మాత్రం అరకు కాఫీ ఫేమస్. వరల్డ్ వైడ్ గా చూస్తే.. ఇటలీలో పెంచుతున్న ఎస్ప్రెస్సో కాఫీ చాలా ప్రజాదరణ పొందింది. కాఫీ గింజలను గ్రైండ్ చేసి.. అందులో వేడి నీటిని కలిపి తాగితే.. మీ అలసట మొత్తం పోతుందట.


Also Read : మిరియాలలో పుష్కలమైన పోషకాలు.. ఇలా వాడితే ఆరోగ్యానికి ఊహించని ప్రయోజనాలు..

ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం.. కొందరైతే రాత్రి, అర్థరాత్రులు కూడా కాఫీలు తాగుతుంటారు. కాఫీ అంటే అంత పిచ్చి ఉంటుంది మరి వాళ్లకి. అయితే కాఫీల్లో షుగర్ కలుపుకునే తాగుతాం. అది కంపల్సరీ. డయాబెటిక్ పేషంట్లయితే షుగర్ లేకుండా తాగాల్సిందే. షుగర్ లెస్ కాఫీ తాగితే అందరి ఆరోగ్యానికి మంచిదేనంటున్నారు ఆరోగ్య నిపుణులు.

షుగర్ లెస్ కాఫీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు

కాఫీలో ఉండే కెఫిన్ గుండె జబ్బుల సమస్యలకు చెక్ పెడుతుంది.

డయాబెటీస్ కంట్రోల్ లో ఉంటుంది.

జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

అధిక బరువు, ఊబకాయం వంటి సమస్యల నుంచి బయటపడతారు.

కాలేయ సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.

నోటిలో బ్యాక్టీరియా తగ్గి.. దంత సమస్యల నుంచి కాపాడుతుంది.

హైబీపీ వంటి ఆరోగ్య సమస్యలు రావు

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

 

Related News

Back Pain Relief Tips: నడుము నొప్పిని తగ్గించే టిప్స్ !

Homemade Face Mask: వీటితో 5 నిమిషాల్లోనే అదిరిపోయే అందం !

Dandruff Home Remedies: ఇంట్లోనే చుండ్రు తగ్గించుకోండిలా ?

Causes Of Pimples: మొటిమలు రావడానికి కారణాలు ఇవే !

Health Tips: నెయ్యి ఎవరు తినకూడదో తెలుసా ?

Benefits Of Pomegranate Flowers: ఈ పువ్వు ఆరోగ్యానికి దివ్యౌషధం.. దీని చూర్ణం తేనెతో కలిపి తీసుకుంటే ఆ సమస్యలన్నీ మాయం

Unwanted Hair Tips: అవాంఛిత రోమాలతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఇలా చెక్ పెట్టండి..

Big Stories

×