EPAPER

Shatpavali Ritual : శతపావళి.. సెలబ్రిటీల ఆరోగ్య రహస్యం ఇదే.. మీరూ ట్రై చేయండి.

Shatpavali Ritual : శతపావళి.. సెలబ్రిటీల ఆరోగ్య రహస్యం ఇదే.. మీరూ ట్రై చేయండి.

Benefits of Shatpavali : సెలబ్రిటీలు ఎప్పుడూ ఫిట్ గా, అందంగా కనిపిస్తారు. ఎంత ఒత్తిడి ఉన్నా.. వీలైనంతవరకూ ఆ ఒత్తిడిని ముఖంలో కనిపించనివ్వరు. పైగా శరీర కొలతల్లో తేడా రానివ్వరు. అందుకు వారు పాటించే హెల్త్ సీక్రెట్లు చాలానే ఉంటాయి. వాటిలో ఒకటి శతపావళి. దీనిగురించి ఇటీవలే హీరోయిన కత్రినా కైఫ్ కూడా చెప్పింది. ఆమె ఒక్కరే కాదు. సెలబ్రిటీలు దాదాపు దీనిని పాటిస్తారు. భోజనం చేశాక 100 అడుగులు వేయడమే శతపావళి. మన ఆయుర్వేదంలో దీని ప్రయోజనాల గురించి వివరించారు.


భోజనం చేశాక 100 అడుగులు నడిస్తే.. జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. మన జీవనశైలిలో ఫేస్ చేస్తున్న ఎన్నోరకాల వ్యాధులు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. నిజానికి శతపావళి అనేది మరాఠీ పదం. భాష ఏదైతే ఏంటి.. తిన్నాక 100 అడుగులు వేయాలన్నదే దాని అర్థం. జీర్ణక్రియతో ముడిపడి ఉన్న ఓ ప్రక్రియ ఇది. చాలామంది తిన్న తర్వాత కూడా కుర్చీలకే పరిమితమవుతుంటారు. అది చాలా ప్రమాదం. ఊబకాయానికి ప్రథమ కారణమవుతుంది.

Also Read  : ఈ సంగతి తెలిస్తే వెంటనే చాయ్ తాగడం మానేస్తారు?


అపానవాయువు, మలబద్ధకం వంటి జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలున్నవారు శతపావళిని పాటిస్తే.. ఆ సమస్యలు తగ్గుతాయట. భోజనం చేశాక పొట్టలోకి గ్యాస్ కూడా రావడం సాధారణం. తిన్నాక కొద్దిదూరం నడిస్తే అలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఎసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా రాత్రిపూజ తినగానే 100 అడుగులు వేస్తే.. త్వరగా నిద్రపడుతుంది. కానీ.. కాళ్లకు చెప్పులు, షూస్ లేకుండా నడిచేందుకు ప్రయత్నించడం మంచిది. శరీరంలో రక్తప్రసరణ కూడా మెరుగవుతుంది.

అలాగే.. బరువు కూడా తగ్గొచ్చు. పావుగంట పాటు రోజూ రాత్రి భోజనం చేశాక నడిస్తే.. ఇది మీ ఊబకాయంపై ప్రభావం చూపకుండా ఉంటుంది. నెలరోజులపాటు దానిని పాటిస్తే చాలా మార్పులు వస్తాయి. టైప్ 2 డయాబెటీస్ ఉన్నవారు కూడా భోజనం తర్వాత వాకింగ్ చేస్తే.. రక్తంలో షుగర్ లెవల్స్ పెరగకుండా ఉంటాయి.

Related News

Multani Mitti Face Pack:ముల్తానీ మిట్టితో స్మూత్, గ్లోయింగ్ స్కిన్..

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండారంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Big Stories

×