EPAPER

Dry Coconut Benefits: ఎండుకొబ్బరితో ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చు తెలుసా ?

Dry Coconut Benefits: ఎండుకొబ్బరితో ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చు తెలుసా ?

Dry Coconut Benefits: ఎండుకొబ్బరిని సాధారణంగా వంటకాలతో పాటు కొన్ని రకాల పూజా కార్యక్రమాల్లో ఉపయోగిస్తుంటారు. ఎండు కొబ్బరిని వంటల్లో వాడడం వల్ల వాటికి మంచి రుచి వస్తుంది. కాకపోతే మనందరికీ పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనే విషయం మాత్రమే తెలుసు. అయితే ఇవి మాత్రమే కాదు.. ఎండుకొబ్బరి కూడా మన శరీర ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. దీనిని తినడం వల్ల బోలెడు బెనిఫిట్స్ పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎండు కొబ్బరిలోని పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


ఎండు కొబ్బరిలో మాంగనీస్ ,మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, కాల్షియం, పాస్ఫరస్, ప్రొటీన్లు విటమిన్ల వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అంతేకాకుండా ఎండుకొబ్బరి అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. కాబట్టి ఇన్ని పోషకాలు ఉన్న ఎండుకొబ్బరిని డైలీ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

రోగ నిరోధక శక్తి:
శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగాలంటే ఎండు కొబ్బరిని కచ్చితంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఇమ్యూనిటీ పవర్ పెంచడంలో చాలా ఉపయోగపడతాయి. ఫలితంగా ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. వైరల్ ఇన్‌ఫెక్షన్ల నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చు.


గుండెకు మేలు:
రెండు కొబ్బరి తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు దీనిలో పోషకాలు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి అలాగే ఎండు కొబ్బరిలో ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి.

రక్తహీనత తగ్గుతుంది:
ఎండు కొబ్బరి తినడం వల్ల రక్తహీనత సమస్యను తగ్గించుకోవచ్చు. ఇందులో ఉండే ఐరన్ చేయడంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడానికి ఉపయోగపడుతుంది.

మెదడుకు మేలు:
ఎండు కొబ్బరి తినడం వల్ల బ్రెయిన్ పనితీరు మెరుగు పడటంతో పాటు మతిమరపు సమస్యలు రాకుండా ఉంటుంది. దీనిలో ఉండే పోషకాలు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని తద్వారా జ్ఞాపకశక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

జుట్టు ఆరోగ్యానికి:
ఎండు కొబ్బరి డైలీ తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా దీనిలో ఉండే పోషకాలు జుట్టు రాలే సమస్యను తగ్గించడంతో పాటు కొత్త జుట్టు పెరిగేలా చేస్తాయని అంటున్నారు.

Also Read: ఇష్టంగా నూడిల్స్ తింటున్నారా ? డేంజర్‌లో పడతారు జాగ్రత్త

ఎముకలు బలంగా:
ఎండు కొబ్బరి తినడం వల్ల ఎముకలకు బలం చేకూరుతుంది. ఎందుకంటే దీనిలో కాల్షియం మెండుగా ఉంటుంది. దీంతొ ఎముకలు పటిష్టంగా ఉంటాయి.

క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది:
ఎండు కొబ్బరి తినడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు తగ్గుతాయి. దీనిలో ఉండే పోషకాలు, రొమ్ము, ప్రోస్టేట్ క్యాన్సర్‌ను చాలా వరకు అడ్డుకుంటాయి. ఎండుకొబ్బరి జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా ఉపయోగపడుతుంది. తలనొప్పితో బాధ పడేవారికి ఇది ఎంతో దోహదపడుతుంది.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×