EPAPER

Black Pepper Tea: ఈ టీతో ఎన్ని లాభాలో తెలుసా ?

Black Pepper Tea: ఈ టీతో ఎన్ని లాభాలో తెలుసా ?

Black Pepper Tea: నల్ల మిరియాలు ప్రతి వంటింట్లోనూ ఉంటాయి. ఇవి అనేక ఔషధ గుణాలతో నిండి ఉంటాయి. వర్షాకాలంలో బ్లాక్ పెప్పర్ టీ తాగడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. బ్లాక్ పెప్పర్ టీ వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వర్షాకాలంలో జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులతో పోరాడడంలో బ్లాక్ పెప్పర్ టీ ప్రభావవంతంగా పోరాడుతుంది. దీనిని బ్లాక్ పెప్పర్ టీ, మసాలా టీ అని కూడా పిలుస్తారు. ఇది మంచి సువాసన, రుచిని కలిగి ఉంటుంది. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న పెప్పర్ టీ ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.


బ్లాక్ పెప్పర్ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
మిరియాల్లో ఉండే పైపెరిన్ అనే మూలకం జీర్ణక్రియను ఉత్తేజపరిచే శక్తిని కలిగి ఉంటుంది. కడుపులో గ్యాస్ , అజీర్ణాన్ని తగ్గించే లక్షణాలను కలిగి ఉంటుంది. నల్ల మిరియాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ , యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. అందువల్ల ఇవి జలుబు, దగ్గు లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి. తరుచుగా బ్లాక్ పెప్పర్ టీ తాగడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి.


రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది:
నల్ల మిరియాలు విటమిన్ సి , యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అంతే కాకుండా ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి. బ్లాక్ పెప్పర్ టీ తాగడం వల్ల రోగ నిరోదక శక్తి కూడా పెరుగుతుంది.

కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం:
నల్ల మిరియాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి, ఇవి కీళ్ల నొప్పులు, వాపులను తగ్గించడంలో సహాయపడతాయి. నల్ల మిరియాలు యాంటీడిప్రెసెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. అందుకే వీటితో తయారు చేసిన టీ తాగడం వల్ల మానసిక స్థితిని మెరుగుపడుతుంది. అంతే కాకుండా ఒత్తిడిని తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది.

Also Read: ఈజీగా బరువు తగ్గించే డ్రింక్ ఇదే !

మధుమేహం, బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది:
నల్ల మిరియాలు జీవక్రియను పెంచడానికి ఎంతో సహాయపడతాయి. అంతే కాకుండా కొవ్వును కరించేందుకు సహాయపడే లక్షణాలను కలిగి ఉన్నాయి. నల్ల మిరియాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. వీటితో తయారు చేసిన టీ తాగడం వల్ల డయాబెటిస్ ప్రమాదం చాలా వరకు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది:

నల్ల మిరియాలు యాంటీ డిప్రెసెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి మానసిక స్థితిని మెరుగుపరచడంతో పాటు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. ఒత్తిడితో బాధపడేవారు బ్లాక్ పెప్పర్ టీ తాగితే ప్రయోజనం ఉంటుంది. తరుచుగా ఈ టీ త్రాగడం వల్ల మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అనేక అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.

గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే వీటిని పాటించాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×