EPAPER

Aloe Vera Health Benefits: కలబందతో మతిపోయే ప్రయోజనాలు !

Aloe Vera Health Benefits: కలబందతో మతిపోయే ప్రయోజనాలు !

Aloe Vera Health Benefits: కలబందలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. కలబందను ఔషధాల తయారీలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా కలబందలో అనేక విటమిన్లు, మినరల్స్ అధిక మొత్తంలో ఉంటాయి. కలబందలోని విటమిన్ ఏ,సీ,బీ1,బీ2,బీ3 మొదలైనవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కలబందను తరుచుగా తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి.


కలబంద ప్రయోజనాలు:

చర్మ మెరుపు కోసం:


కలబంద యాంటీ ఇన్‌ఫ్లమేటరీ , యాంటీ ఆక్సిండెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి తగిన పోషకాలు అందిస్తాయి. సూర్యుడి కిరణాల వల్ల కలిగే నష్టాన్ని చర్మానికి తగ్గిస్తాయి. అంతే కాకుండా మొటిమలను నయం చేయడానికి కలబంద దోహదం చేస్తుంది. చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో ఉపయోగపడుతుంది.

జుట్టుకు మేలు:
కలబందలో ఉండే పోషకాలు జుట్టుకు బలాన్ని ఇస్తాయి. అంతే కాకుండా జుట్టు రాలడాన్ని కూడా నివారిస్తాయి. కలబంద జుట్టుకు పోషణనిచ్చి జుట్టును మృదువుగా మెరిసేలా చేస్తుంది.

జీర్ణవ్యవస్థ మెరుగుదల :
అలోవెరా జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా మలబద్ధకం, అసిడిటీ, కడుపు మంట వంటి సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది.

ఇమ్యూనిటీ బూస్టర్:
కలబందలో యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. అంతే కాకుండా శరీరాన్ని అంటువ్యాధుల బారిన పడకుండా చేస్తాయి.

గాయాలకు:

అలోవెరా జెల్‌ను మొటిమల మీద అప్లై చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ఇది చర్మంపై ఉన్న గాయాలను కూడా నయం చేయడానికి ఉపయోగపడుతుంది.అంతే కాకుండా ముఖంపై ఉన్న మచ్చలను తగ్గించడానికి సహాయపడుతుంది.

బరువు తగ్గడానికి :

కలబంద బరువు తగ్గడానికి ఎంతగానో ఉపయోపడుతుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, డిటాక్సిఫైయింగ్ పుష్కలంగా ఉంటాయి. ఇవి పరోక్షంగా బరువు తగ్గడానికి దోహదం చేస్తాయి. తరుచుగా కలందను తినడం వల్ల బరువు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

Also Read: బార్లీ వాటర్‌తో అనారోగ్య సమస్యలు దూరం !

ముఖ మెరుపు:

కలబంద రసం ముఖాన్ని మెరిసేలా చేస్తుంది. అనేక ప్రధాన వ్యాధుల నుంచి ఇది రక్షిస్తుంది. అలోవెరా జ్యూస్ ప్రతిరోజు తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. వాతావరణం మారుతున్న కొద్దీ చర్మం రంగు మారుతుంది. కలబందతో అందమైన చర్మం మీ సొంతం చేసుకోవచ్చు. కలబంద చర్మాన్ని యవ్వనంగా, కాంతివంతంగా చేస్తుంది. మొటిమలను కూడా తగ్గిస్తుంది మచ్చలను పోగొడుతుంది. అనేక చర్మ సమస్యలను కూడా ఇది నయం చేస్తుంది. దీని వల్ల జుట్టు కూడా ఆరోగ్యంగా తయారవుతుంది. కుదుళ్లు బలంగా మారుతాయి.

ఆరోగ్యానికి: 

రక్తహీనతతో బాధపడుతున్న వారు ప్రతి రోజు కలబంద తినడం మంచిది. ఇది శరీరంలో ఎర్ర రక్తకణాల పెరుగుదలకు సహాయపడుతుంది. బలహీనమైన శరీరం ఉన్నవారు రోజు కలబంద తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. శరీరాన్ని బలోపేతం చేయడంలో కూడా ఇది సహాయపడుతుంది. అలాగే ఇది శరీరంలో ఉండే వ్యర్థ పదార్థాలను బయటకు పంపుతుంది. అంతేకాకుండా బరువు తగ్గడానికి ఇది సహాయపడుతుంది.

శరీరం ఫిట్ గా ఉంచడానికి ిది ఉపయోగపడుతుంది. అలోవెరా శరీరాన్ని డిటాక్సి‌ఫై చేయడానికి దోహదపడుతుంది. కలబంద రసంలో శరీరానికి అవసరమైన యాంటీడిటాక్సీఫైయింగ్ ఏజెంట్లు ఉంటాయి. మలబద్దకం, అజీర్తి తో బాధపడేవారు కూడా కలబంద రాసాన్ని తీసుకోవడం మంచిది. కలబంద ప్రీ బయోటిక్‌గా ఉపయోగపడుతుంది.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Hair Care Tips: జుట్టు సమస్యలన్నింటికీ చెక్ పెట్టండిలా !

Tips For Skin Glow: క్షణాల్లోనే మీ ముఖాన్ని అందంగా మార్చే టిప్స్ !

Yoga For Stress Release: ఒత్తిడి తగ్గేందుకు ఈ యోగాసనాలు చేయండి

Throat Infection: గొంతు నొప్పిని ఈజీగా తగ్గించే డ్రింక్స్ ఇవే..

Skin Care Tips: గ్లోయింగ్ స్కిన్ కోసం.. ఇంట్లోనే ఈ ఫేస్ ప్యాక్స్ ట్రై చేయండి

Sweets: స్వీట్లు ఇష్టపడేవారు ఈ సమయంలో తింటే అన్నీ సమస్యలే..!

Coffee For Glowing Skin: కాఫీ పౌడర్‌లో ఇవి కలిపి ఫేస్‌ప్యాక్ వేస్తే.. మీ ముఖం మెరిసిపోవడం ఖాయం

Big Stories

×