EPAPER

Tulasi Leaves Benefits: తులసి నీళ్లతో అందం, ఆరోగ్యం.. ఇంకా మరెన్నో ప్రయోజనాలు!

Tulasi Leaves Benefits: తులసి నీళ్లతో అందం, ఆరోగ్యం.. ఇంకా మరెన్నో ప్రయోజనాలు!

Tulasi Leaves Benefits: తులసికి ఆయుర్వేదంలో చాలా ప్రాముఖ్య ఉంటుంది. ప్రతీ ఆయుర్వేద మూలికలు, మందుల్లోను తులసిని వాడుతుంటారు. పూర్వకాలంలో తులసితోనే ఆయుర్వేదంలో చాలా రకాల మందులు తయారు చేసే వారు. తులసిలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అయితే తులసి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని ఆయుర్వేదంతో పాటు వైద్యులు కూడా సూచిస్తుంటారు. తులసి ఆకులను తినడం వల్ల ఎంత మేలు ఉంటుందో.. తులసి నీటిని తాగడం వల్ల కూడా అంతే ప్రయోజనాలు ఉంటాయట.


అందుకే ప్రతీ ఆలయంలోను తీర్థంగా తులసి నీటినే ఇస్తుంటారు. దేవతలకు కూడా తులసి అంతే ప్రీతి పాత్రమైనది. అందువల్ల ప్రతీ రోజూ తులసి ఆకుల నీటిని కూడా తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుందట. మరి ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం.

తులసిలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోబయల్ వంటి లక్షణాలతో నిండి ఉంటుంది. అందువల్ల తులసిని తీసుకుంటే రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు, వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది. తులసిలో ఉండే అడాప్టోజెనిక్ గుణాల ద్వారా శరీరాన్ని ఒత్తిడిని ఎదుర్కునేలా తయారుచేస్తుంది. ముఖ్యంగా వేసవి కాలంలో తులసి నీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉంటాయి.


Also Read: Maida Flour: మైదాతో చేసిన ఆహార పదార్థాలు తింటే ఎంత ప్రమాదమో తెలుసా.. !

తులసి నీటిని పరిగడుపున ఖాళీ కడుపుతో తాగడం వల్ల చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. జీర్ణ సమస్యలు, అసిడిటీ, గ్యాస్, కడుపునొప్పి, అజిర్తీ వంటి అనేక సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాదు శరీరాన్ని శుభ్రపరిచి జీర్ణ క్రియ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాదు దగ్గు, జలుబు వంటి లక్షణాలను తగ్గించేందుకు కూడా తులసి నీరు చక్కగా పనిచేస్తుంది.

ఖాళీ కడుపుతో తులసి నీటిని తాగడం వల్ల డిటీక్సిఫికేషన్ అవుతుంది. శరీరంలోని టాక్సిన్స్ వంటివి కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలను తొలగించి ఆరోగ్యంగా ఉంచేలా బలోపేతం చేస్తుంది. బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలకు చికిత్స చేయడానికి ఉపయోగపడతాయి.

Tags

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×