Happy Kiss Day : వాలైంటైన్ వీక్ ప్రారంభమైన రేపు ఫ్రిబ్రవరి 14తో ముగియనుంది. ఇందులో భాగంగానే ఈ రోజు ఫిబ్రవరి 13న ప్రేమికులు కిస్ డే జరుపుకుంటున్నారు. రిలేషన్ స్ట్రాంగ్ అవ్వాలంటే ముద్దు కూడా చాలా ముఖ్యం అయినది. నాలుగు పెదవులు కిలిస్తే శరీరంలో లవ్, హ్యాపీ హార్మోన్లు రిలీజ్ అవుతాయని సైన్స్ చెబుతుంది.
ఈ హార్మోన్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రేమికులు ఇచ్చిపుచ్చుకునే ముద్దుల్లో చాలా రకాలు ఉంటాయి. నుదిటిపై ముద్దు వారికి మనకున్న ప్రేమను తెలియజేస్తే..చెంపపై ముద్దు నీపై చాలా ప్రేమ ఉందని చెబుతుంది. కిస్ డే సందర్భంగా ముద్దు రకాలు వాటి అర్థాలు తెలుసుకుందాం.
Read More : హ్యాపీ హగ్ డే.. వీలైతే ఒక్క హగ్ ఇవ్వండి డ్యూడ్..!
ముద్దులు వివిధ రకాలు ఉండగా.. ఒక్కో ముద్దు ఒక్కో అర్థాన్ని చెబుతుంది. చెంప మీద ముద్దు ఆప్యాయత, సాన్నిహిత్యాన్ని సూచిస్తుంది. చిన్న పిల్లల్ని చూడగానే బుగ్గలపై ప్రేమగా ముద్దుపెట్టుకుంటాం. ఈ ముద్దు మధురమైన అనుబంధాన్ని తెలుపుతుంది. అలానే మన భాగస్వామి చెంపపై పెట్టుకునే ముద్దు ఇద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని చెబుతుంది.
మన ప్రియమైన వారిని నుదిటిపై పెట్టుకుంటాం. పిల్లలు ఏదైనా సాధించినప్పుడు తల్లిదండ్రులు వారి నుదిటపై ముద్దు పెట్టుకుంటారు. పిల్లలు నిద్రిస్తున్నప్పుడు ఓ తల్లి వారి నుదిటిపై ముద్దు పెట్టుకుంటుంది. ఈ ముద్దులు ప్రత్యేక ఆప్యాయతను చెబుతాయి. అలానే మీ భాగస్వామి నుదిటిపై మీరు ప్రేమతో పెట్టుకునే ముద్దు భద్రతా భావాన్ని సూచిస్తుంది.
చేతిపై ముద్దులు పెట్టుకునే సంస్కృతి యూరోపియన్ దేశాల్లో మొదట ప్రారంభమైంది. ఈ ముద్దును గౌరవం, సాన్నిహిత్యానికి చిహ్నంగా చెబుతారు. అదే ఈ కాలంలో అయితే చేతిపై ముద్దులకు చాలా అర్థాలు ఉన్నాయి. ఒక వ్యక్తి అమ్మాయి చేతిపై ముద్దుపెట్టుకుంటే.. ఆమె పట్ల ఆసక్తిని కలిగి ఉన్నాడని అర్థం.
Read More : యాంటీ వాలెంటైన్ వీక్.. చెంప పగలగొట్టొచ్చు..!
లిప్ టు లిప్ కిస్ అనేది ప్రేమ భావానికి పరాకాష్ట. దీనినే ఫ్రెంచ్ కిస్ అంటారు. ఈ ఫ్రెంచ్ కిస్ లైంగికంగా ఇద్దరిని ప్రేరేపిస్తుంది. ఈ ప్రేమలో కామం, ప్రేమ అన్నీ ఉంటాయి. శృంగారానికి నాంది కూడా ఒక ముద్దుతోనే పడుతుంది.
లైంగిక ప్రేరణకు చెవిపై ముద్దు పెట్టుకుంటారు. జంటల రొమాన్స్‌ను మంచి మూడ్‌లోకి ఈ ముద్దు తీసుకెళ్తుంది. జంటల మధ్య భాగస్వామ్యం ధృడంగా ఉండాలంటే ముద్దు ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. ఇలా ముద్దులకు చాలా అర్థాలు ఉన్నాయి. మీ ప్రేయసికి ఒక ముద్దు ఈ కిస్ డేను సెలబ్రేట్ చేసుకోండి.
కిస్ డే కొటేషన్స్ మీ కోసం..