EPAPER

Hair Spa: ఇంట్లోనే హెయిర్ స్పా.. ఎలా చేసుకోవాలో తెలుసా ?

Hair Spa: ఇంట్లోనే హెయిర్ స్పా.. ఎలా చేసుకోవాలో తెలుసా ?

Hair Spa: ఈ రోజుల్లో మారిన జీవనశైలి కారణంగా మన జుట్టు రాలడం ఎక్కువవుతోంది. చాలా మంది ప్రస్తుతం జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యను తగ్గించుకోవడానికి కొందరు వివిద రకాల ఆయిల్స్ వాడితే మరికొందరు పార్లర్ల చుట్టూ తిరుగుతుంటారు. పార్లర్ లో జుట్టు సమస్యలు తగ్గడానికి హెయిర్ స్పా చేయించుకునే వారు ఎక్కువగానే ఉంటారు.


హెయిర్ స్పా ట్రీట్‌మెంట్ వల్ల జుట్టు చిట్లడం, జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. జుట్టు అందంగా, మెరిసేలా ఉండాలంటే తరచుగా 15 రోజులకు ఒకసారి స్పా చేయించుకోవాలిని నిపుణులు చెబుతున్నారు. కానీ పార్లర్ లో హెయిర్ స్పా చేయడానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. అందుకే ఇంట్లోనే హెయిర్ స్పా చేసుకునే అలవాటు చేసుకోవాలి. దీని వల్ల ఎక్కువ డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం లేదు. మరి ఇంట్లోనే ఈజీగా హెయిర్ స్పా ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ 4 విధాలుగా ఇంట్లో హెయిర్ స్పా చేసుకోండి..


జుట్టుకు నూనె రాయండి:
హెయిర్ స్పా చేయడానికి ముందు, మీ జుట్టుకు కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనెను రాయండి. నూనె అప్లై చేసే ముందు కాస్త వేడి చేసి జుట్టుకు పట్టించాలి. ఎందుకంటే ఇందులో ఉండే అనేక రకాల పోషకాలు జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. 15 నిమిషాల తర్వాత జుట్టును సున్నితంగా దువ్వండి. ఆ తర్వాత మీ తలపై నూనెతో బాగా మసాజ్ చేయండి. 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి.

దీని తరువాత, మీ జుట్టుకు ఆవిరి పట్టించాలి. ఇందు కోసం ఒక పాన్లో నీటిని 15 నిమిషాల పాటు వేడి చేయండి. ఆ తర్వాత వేడి నీటిలో టవల్‌ను ముంచి.. జుట్టుపై కప్పి ఉంచండి. ఇలా చేయడం వల్ల స్కాల్ప్ రంధ్రాలు తెరుచుకుని రక్త ప్రసరణ మెరుగవుతుంది. దీనితో పాటు, జుట్టు రాలడాన్ని కూడా తగ్గించుకోవచ్చు. కానీ 10 నిమిషాలు మాత్రమే ఇలా ఆవిరి పట్టాలి.

జుట్టుకు బాగా ఆవిరి పట్టిన తర్వాత షాంపూ సహాయంతో జుట్టును శుభ్రం చేసుకోండి. జుట్టుకు వేడి నీటిని అస్సలు ఉపయోగించకూడదని గుర్తుంచుకోండి. ఇలా చేయడం వల్ల జుట్టుకు పోషణ తగ్గుతుంది.

Also Read: జుట్టుకు హెన్నా పెడుతున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

హెయిర్ మాస్క్ ఉపయోగించండి:
మీకు జుట్టు చివర్లు చీలిపోయే సమస్య ఉంటే, దాన్ని వదిలించుకోవడానికి, మీ జుట్టుకు హెయిర్ మాస్క్‌ను అప్లై చేయడం ప్రారంభించండి. దీని కోసం, మీరు ఇంట్లో తయారుచేసిన హెయిర్ మాస్క్‌ని కూడా ఉపయోగించవచ్చు లేదా మార్కెట్‌లో అందుబాటులో ఉన్న మాస్క్‌ను అప్లై చేయవచ్చు.

దీని తర్వాత మీరు షాంపూతో మీ జుట్టును కడగాలి. ఇది మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తుంది. ఇలా చేయడం వల్ల మీ జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. కానీ కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Thyroid: వీటితో ఇంట్లోనే థైరాయిడ్‌కు చెక్ !

Henna For Hair: జుట్టుకు హెన్నా పెడుతున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

Beetroot Juice: శరీరంలో బ్లడ్ పెరగాలా ? ఈ జ్యూస్ తాగితే సరి

Face Fat: మీ ముఖంపై ఫ్యాట్ పెరిగిందా ?.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Work Pressure: పని ఒత్తిడి.. చివరకు ఆత్మహత్యలకు కారణమవుతుందా..?

Headache: తలనొప్పితో ఇబ్బంది పడుతున్నారా ? ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Big Stories

×