EPAPER

Hair Fall Control Serum: జుట్టు ఎక్కువగా రాలుతోందా ? ఈ సీరమ్ ను వాడితే అద్భుతమైన రిజల్ట్స్

Hair Fall Control Serum: జుట్టు ఎక్కువగా రాలుతోందా ? ఈ సీరమ్ ను వాడితే అద్భుతమైన రిజల్ట్స్

Hair Fall Control Serum at Home(Health tips in Telugu): హెయిర్ ఫాల్. నూటికి 90 శాతం మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఇది ఒకటి. చిన్న, పెద్ద తేడా లేదు. మూడుపదుల వయసైనా నిండకుండానే జుట్టు రాలిపోయి.. బట్టతల అవుతుంది. పట్టణాలు, మెట్రో సిటీల్లో ఉండే వారికైతే ఈ సమస్య అధికంగా ఉంటోంది.


జుట్టురాలడం తగ్గాలని రకరకాల షాంపూలు, నూనెలు వాడుతుంటారు. వాటి వల్ల హెయిర్ ఫాల్ మరింత పెరుగుతుందే తప్ప ఫలితం ఉండదు. చాలామంది.. మేం చిన్న పిల్లలుగా ఉన్నపుడు మా జుట్టు చాలా బాగుండేది. ఇప్పుడేమో కొత్తమీర కట్టలాగా తయారైందని వాపోతుంటారు. తేడా ఏంటంటే.. అప్పుడు అంతా అమ్మ చేసిన వంట తినేవారు. ఇప్పుడేమో ఫాస్ట్ ఫుడ్స్, బిర్యానీలు, పిజ్జాలు, బర్గర్లు, కేక్ లు, వగైరా ఆహారాలు తింటున్నారు. వాటిలో వాడే హైలీ ఫ్యాటెడ్ కంటెంట్ శరీరానికి ఏ మాత్రం మంచిది కాదు.

బయట మార్కెట్లో దొరికే షాంపూలకు బదులుగా కుంకుడుకాయలు వాడటం అలవాటు చేసుకోండి. అలాగే కెమికల్స్ తో తయారు చేసిన సీరమ్ కు బదులుగా మీ ఇంట్లోనే హెయిర్ సీరమ్ తయారు చేసుకుని వాడండి. జుట్టు ఆరోగ్యంగా, షైనీగా ఉండటంతో పాటు రాలడం తగ్గి.. పెరుగుతుంది.


హెయిర్ ఫాల్ ను తగ్గించే సీరమ్ తయారీకి కావలసిన పదార్థాలు

నీరు – 1 గ్లాసు

బియ్యం – 1 టీ స్పూన్

అవిసె గింజలు – 1 టీ స్పూన్

మెంతులు – 1 టీ స్పూన్

కరివేపాకు – 10-12 ఆకులు

తయారీ విధానం

స్టవ్ పై ఒక గిన్నెను పెట్టుకుని అందులో గ్లాస్ నీరు పోయాలి. ఇప్పుడు పైన చెప్పిన పదార్థాలను ఆ క్వాంటిటీలో ఒక్కొక్కటిగా వేసి.. 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఈ నీటిని వడకట్టుకుని 1 టీ స్పూన్ కొబ్బరినూనెను వేసి కలుపుకోవాలి. అంతే హెయిర్ ఫాల్ కంట్రోల్ సీరమ్ రెడీ. ఈ సీరమ్ ను డ్రై హెయిర్ పై అప్లై చేసుకుని అలాగే ఉంచుకోవాలి. మీకు నచ్చకపోతే ఆరిపోయాక వాష్ చేసుకోవచ్చు. ఇలా వారానికి 2 సార్లు చొప్పున చేస్తే.. హెయిర్ ఫాల్ క్రమంగా తగ్గి.. జుట్టు పెరుగుతుంది.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనికి ఎలాంటి బాధ్యత వహించదు.)

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×