EPAPER

Chia Seeds For Glowing Skin: చియా సీడ్స్‌తో గ్లాస్ స్కిన్.. ఎలా వాడాలో తెలుసా మరి..?

Chia Seeds For Glowing Skin: చియా సీడ్స్‌తో గ్లాస్ స్కిన్.. ఎలా వాడాలో తెలుసా మరి..?

Chia Seeds For Glowing Skin: చియా సీడ్స్ అంటే తెలియని వారెవరు ఉండరు. చియా సీడ్స్ వల్ల శరీరానికి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. చియా సీడ్స్ లో ఉండే కేలరీలు, మెగ్నీషియం, కొవ్వు, ప్రోటీన్, పిండి పదార్థాలు, ఫైబర్ వంటివి పుష్కలంగా ఉంటాయి. దీంతో శరీరానికి, చర్మానికి చాలా రకాలుగా ఉపయోగపడతాయి. ఇందులో 14 శాతం కాల్షియం, ఫాస్పరస్, జింక్, విటమిన్ బీ2, బీ3 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే ఈ పోషకాలు జుట్టు, చర్మం, ఆరోగ్య ప్రయోజనాలు అన్నింటికి తోడ్పడతాయి.


చియా సీడ్స్ ను ఎలా వాడాలనేది చాలా మందికి తెలియదు. కేవలం ఆరోగ్య ప్రయోజనాల కోసం మాత్రమే వీటిని ఉపయోగిస్తుంటారు. చియా సీడ్స్ లో పోషకాలు, ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పుష్కలంగా ఉండడం వల్ల ఇవి చర్మానికి, ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. చియా సీడ్స్ లో ఉండే విటమిన్ ఎ,సీ, ఐరన్, ఫోలేట్, చర్మం కాంతివంతంగా ఉండేందుకు సహకరిస్తాయి. అంతేకాదు వీటిని క్రమం తప్పకుండా ఉపయోగిస్తే కేవలం కొన్ని వారాల్లోనే మార్పులు కనిపిస్తాయి.

చియా సీడ్స్ లో వాటర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల శరీరం తేమగా మార్చేందుకు సహకరిస్తుంది. దెబ్బ తిన్న చర్మాన్ని కూడా రిపేర్ చేసేందుకు చియా సీడ్స్ ఉపయోగపడతాయి. చర్మంపై ఉండే ముడతలు, ఫైన్ లైన్స్ వంటివి కూడా తొలగించేందుకు ఉపయోగపడుతుంది. చర్మం హైడ్రేటెడ్ గా, మెరిసెలా, మృదువుగా చేస్తుంది. అంతేకాదు వాపు సమస్యలను కూడా దూరం చేస్తుంది.


ఎలా ఉపయోగించాలి..

చియా సీడ్స్ ను నీటిలో నానబెట్టాలి. అవి జిగురులా ఏర్పడిన అనంతరం ఆలివ్ ఆయిల్ లేదా తేనె కలిపి ముఖం, చేతులు, పాదాలు మొత్తానికి అప్లై చేసుకోవాలి. మొత్తం శరీరానికి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా తరచూ చేయడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. చియా పౌడర్ తో కూడా ఫేషియల్ స్క్రబ్ చేసుకోవడం వల్ల ఎక్స్ ఫోలియేట్ చేయడానికి ఉపయోగపడతాయి.

Tags

Related News

Hair Care Tips: జుట్టు సమస్యలన్నింటికీ చెక్ పెట్టండిలా !

Tips For Skin Glow: క్షణాల్లోనే మీ ముఖాన్ని అందంగా మార్చే టిప్స్ !

Yoga For Stress Release: ఒత్తిడి తగ్గేందుకు ఈ యోగాసనాలు చేయండి

Throat Infection: గొంతు నొప్పిని ఈజీగా తగ్గించే డ్రింక్స్ ఇవే..

Skin Care Tips: గ్లోయింగ్ స్కిన్ కోసం.. ఇంట్లోనే ఈ ఫేస్ ప్యాక్స్ ట్రై చేయండి

Sweets: స్వీట్లు ఇష్టపడేవారు ఈ సమయంలో తింటే అన్నీ సమస్యలే..!

Coffee For Glowing Skin: కాఫీ పౌడర్‌లో ఇవి కలిపి ఫేస్‌ప్యాక్ వేస్తే.. మీ ముఖం మెరిసిపోవడం ఖాయం

Big Stories

×