Big Stories

Nutrition Food for Kids : పిల్లలకు ఈ పోషక పదార్ధాలను అందించండి..

Nutrition Food for Kids : పిల్లలకు పోషక పదార్ధాలు తినేలా ప్రోత్సహించాలి. పిల్లలు పెరిగే వయసులోనే పోషకపదార్ధాలు తింటే ఫలితం ఎక్కువగా ఉంటుంది. వయసు పెరిగిన తరువాత అనేక ఆరోగ్య నియమాలు పాటించడం కంటే చిన్న వయసులోనే పోషకపదార్ధాలు పిల్లలకు ఇస్తే.. భవిష్యత్తులో ఆరోగ్యంగా ఉంటారని గ్యారంటీ ఇవ్వవచ్చు.

- Advertisement -

ప్రతీ రోజు ఉదయం పిల్లలకు నానబెట్టిన బాదంపప్పులను, ఉడకబెట్టిన కోడి గుడ్డును తినిపించాలి. వీటినే బ్రేక్‌ఫాస్ట్‌గా అందిస్తే ఇంకా మంచిది. వీటివల్ల పిల్లలకు రోగనిరోధకశక్తి పెరుగుతుంది. చాక్లెట్లు, బిస్కెట్లను సాధ్యమైనంత వరకు తగ్గించాలి. వాటి స్థానంలో ఒక్కో రకం పండును వాళ్లు తినేలా చేయాలి. పండును అందంగా కట్‌చేసి ఇస్తే.. పిల్లలు వాటితో ఆడుకుంటూ తినేస్తారు. అలా కనీసం రోజుకో పండును అయినా సరే తినిపించాలి.

- Advertisement -

ఇంట్లో ఉండే కూరలు, మసాలాలను పిల్లలకు పెట్టకూడదు. వయసులో ఉన్నవారికి అవి సులభంగా జీర్ణం అవుతాయి కానీ పిల్లలకు కడుపులో అజీర్తిగా ఉంటుంది. కడుపునొప్పి సమస్యలు కూడా వస్తాయి. పిల్లలు ప్రతీ రోజు తినే ఆహారంలో.. పాలు, పెరుగు, నెయ్యి ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. వీటితో కొంత రుచికరమైనవి వండికూడా తినిపించవచ్చు.

పిల్లలు స్కూలుకు వెళ్లినప్పుడు, స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నప్పుడు మనకు తెలియకుండా ఏవేవో ఆహార పదార్ధాలను తింటుంటారు. వీటిపై పెద్దలు ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచాలి. జంక్‌ఫుడ్‌కు పిల్లలను దూరంగా ఉంచాలి. జంక్ ఫుడ్‌కు అలవాటు పడితే వదలుకోవడం చాలా కష్టం. ముందు నుంచే జంక్‌ఫుడ్‌ను పిల్లలు తినకుండా అవసరమైతే తక్కువగా తినేలా జాగ్రత్త పడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News