Weight Loss: ప్రస్తుతం చాలా మంది అధిక బరువు సమస్యతో నానా పాట్లు పడుతున్నారు. పెరిగిన బరువు తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అధిక బరువు కారణంగా వివిధ రకాల వ్యాధులు కూడా వస్తుంటాయి. అందుకే వయస్సు, ఎత్తు తగిన బరువు కలిగి ఉంటే ఎలాంటి సమస్యలు ఉండవు.
ప్రస్తుత రోజుల్లో ఊబకాయం సమస్య చిన్నవయసులోనే కనిపిస్తోంది. పెరిగిన బరువు మీ శరీర ఆకృతిని మార్చడమే కాకుండా, ఆత్మవిశ్వాసం కోల్పోవడానికి దారితీస్తుంది. అంతే కాకుండా ఇది తీవ్రమైన వ్యాధులు రావడానికి కూడా కారణం అవుతుంది. సరైన ఆహారపు అలవాట్లు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల బరువును తగ్గించుకోవచ్చు. దీంతో పాటు, కొన్ని హోం రెమెడీస్ కూడా బరువు తగ్గడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.
బరువు పెరగడం ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తుంది.అధిక బరువు సమస్యను ఎదుర్కుంటున్నారు. ఇంట్లోనే కొన్ని రకాల హోం రెమెడీస్ తయారు చేసుకుని వాడటం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. అల్లం, నిమ్మకాయతో తయారు చేసిన డ్రింక్ బరువు తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. అల్లం, నిమ్మకాయ జ్యూస్ తయారీ, దీని వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
నిమ్మకాయ రసం, అల్లం ప్రయోజనాలు:
జీవక్రియను పెంచుతుంది: మీరు నిమ్మకాయ, అల్లం సరిగ్గా ఉపయోగిస్తే అది మీ బరువును తగ్గిస్తుంది.నిమ్మకాయ రసం, అల్లంలో బరువు తగ్గించడంలో సహాయపడే గుణాలు ఉన్నాయి. నిమ్మ, అల్లం రెండూ శరీరంలోని జీవక్రియను పెంచడంలో సహాయపడతాయి. జీవక్రియను పెంచడం ద్వారా, శరీరం వేగంగా కేలరీలను బర్న్ చేస్తుంది. అంతే కాకుండా బరువు కూడా తగ్గుతుంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: ఈ రెండూ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. బరువు తగ్గడానికి ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ చాలా ముఖ్యం.
హానికర పదార్థాలు: నిమ్మ, అల్లం శరీరం నుండి శరీరానికి హానికరమైన పదార్థాలను తొలగించడంలో సహాయపడతాయి.ఫలితంగా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఆకలిని తగ్గిస్తుంది: నిమ్మకాయ, అల్లం ఆకలిని తగ్గించడంలో సహాయపడతాయి. కాబట్టి మీరు తక్కువ తిని.. బరువు తగ్గుతారు.
నిమ్మకాయ రసం, అల్లం ఎలా తీసుకోవాలి ?
నిమ్మకాయ-అల్లం నీరు: ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం, అల్లం ముక్క కలిపి తాగాలి.
అల్లం టీ: అల్లం టీలో నిమ్మరసం కలుపుకుని కూడా తాగవచ్చు.
సలాడ్లో ఉపయోగించండి: మీరు సలాడ్లో నిమ్మరసం, తురిమిన అల్లం కలుపుకుని తినడం వల్ల బరువు తగ్గుతుంది. అంతే కాకుండా ఇది మీ సలాడ్ రుచిని కూడా పెంచుతుంది.
Also Read: జుట్టు రాలకుండా ఉండటానికి.. ఈ యోగాసనాలు చేయండి
ఈ జాగ్రత్తలు తీసుకోండి :
నిమ్మకాయ, అల్లం బరువు తగ్గడానికి సహజమైన మార్గం, కానీ అవి మాత్రమే బరువును తగ్గించలేవు.
బరువు తగ్గడానికి, మీరు సమతుల్య ఆహారం తీసుకోవాలి. అంతే కాకుండా క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే, నిమ్మ, అల్లం త్రాగే ముందు తప్పకుండా వైద్యుడిని సంప్రదించండి.
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. డాక్టర్ను సంప్రదించిన తర్వాతే వీటిని పాటించాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.