EPAPER

Ginger Benefits: అల్లంతో కీళ్ల నొప్పులు మాయం

Ginger Benefits: అల్లంతో కీళ్ల నొప్పులు మాయం

Ginger Benefits: ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో కీళ్ల నొప్పుల సమస్య కూడా ఒకటి.  ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్నవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. చాలా మంది కీళ్ల సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. కానీ పెయిన్ కిల్లర్స్ వాడి నప్పుడు తాత్కాలిక ఉపశమనాన్ని ఇచ్చినప్పటికీ ఆరోగ్యంపై భవిష్యత్తులో తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా వంటింట్లో లభించే చిన్న అల్లం ముక్కతో ఈ నొప్పులకు ఈజీగా తగ్గించుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.


అల్లం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా అల్లంలో ఉండే జింజెరాల్ కు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఆర్థరైటిస్ తో పాటు కండరాల నొప్పులను కూడా తగ్గించడంలో ఉపయోగపడుతుంది.

అంతే కాకుండా జింజర్‌లో కీళ్ల ఆరోగ్యానికి అవసరమయ్యే మాంగనీస్, మెగ్నీషియం, కాపర్, బీ6 విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి డైట్ లో అల్లాన్ని భాగంగా చేసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి.


2001 లో రుమటాలజీ అనే జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం.. ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న వ్యక్తులకు 4 వారాల పాటు రోజుకు రెండు గ్రాముల అల్లం ఇచ్చారు. ఫలితంగా వారిలో ఆర్థరైటిస్ తగ్గింది. అంతే కాకుండా కీళ్ల పని తీరు కూడా మెరుగు పడిందని పరిశోధకులు వెల్లడించారు. యూఎస్ లోని యూనివర్సిటీ అఫ్ కనెక్టికట్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌ డాక్టర్లు ఈ పరిశోధనలో పాల్గొన్నారు. అల్లంలోని ఔషధ గుణాలు కీళ్ల నొప్పులను తగ్గించడంతో ఉపయోగపడతాయి.

ఉదయాన్నే కాస్త వేడి నీటిలో అల్లం, పసుపు వేసి మరిగించుకుని తాగినా కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అల్లం టీ తీసుకున్నా కూడా మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. నొప్పులతో పాటు జలుబు, దగ్గులాంటి వాటిని కూడా తగ్గించడంలో అల్లం ఉపయోగపడుతుంది. ట్యాబ్లెట్లు , క్రీమ్ లు రాయడం కంటే వంటింట్లో దొరికే అల్లం తీసుకోవడం వల్ల అనేక రకాలుగా మేలు జరుగుతుంది.

కొలెస్ట్రాల్ :
చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో అల్లం ఎంతో సహాయపడుతుంది. పచ్చి అల్లం లేదా అల్లం నీరును తీసుకోవడం ద్వారా చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. గుండె ఆరోగ్యానికి కూడా ఇది మేలు చేస్తుంది.

క్యాన్సర్‌కు విరుగుడు:
అల్లం క్యాన్సర్‌ను నిరోధిస్తుంది. అల్లంలో ఉండే కొలొరెక్టర్ లివర్ క్యాన్సర్లపై పోరాడే గుణాలు పుష్కలంగా ఉంటాయి. డైలీ డైట్‌లో అల్లం చేర్చడం వల్ల వివిధ క్యాన్సర్ల ముప్పు నుంచి బయటపడవచ్చు.

జీర్ణ సమస్యలు:
కడుపు నొప్పి, అజీర్ణం, పొట్ట ఉబ్బరం, వికారం వంటి వాటితో బాధపడే వారు అల్లం తీసుకుంటే తక్షణ ఉపశమనం లభిస్తుంది. పాలు లేకుండా అల్లం టీ లేదా బ్లాక్ టీ తాగడం వల్ల కొద్ది నిమిషాల్లోనే కడుపు నొప్పి తగ్గుతుంది. అంతే కాకుండా అల్లం ఒత్తిడి, ఆందోళన వంటి భావనలను తగ్గిస్తుంది.

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×