EPAPER
Kirrak Couples Episode 1

Immunity Booster: వీటిని ఆహారంలో తీసుకుంటే వందల రోగాలైనా దరి చేరవు..

Immunity Booster: వీటిని ఆహారంలో తీసుకుంటే వందల రోగాలైనా దరి చేరవు..

Immunity Booster: వంట గదిలో దొరికే ఆహార పదార్థాలు, వస్తువులతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతుంటారు. వంట గదిలో లభించే ప్రతీ ఒక్క వస్తువుతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. వంటింట్లో లభించే అల్లం, పసుపుతో మంచి ప్రయోజనాలు ఉంటాయి. వీటితో శరీరానికి పోషకాలు అందుతాయి. అంతే కాదు పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్, విటమిన్ సి, ఇ, కె, పొటాషియం, మాంగనీస్, ఐరన్ వంటివి పుష్కలంగా ఉంటాయి.


పసుపు, అల్లంలో ఉండే పోషకాలు శరీరానికి చాలా మేలు చేస్తాయి. అందువల్ల తరచూ తీసుకునే ఆహారంలో పసుపు, అల్లం చేర్చడం వల్ల మంచి ప్రయోజనాలు లభిస్తాయి. అయితే అల్లంలో విటమిన్ బి6, సి, పొటాషియం, మెగ్నిషీయం, కాపర్ వంటివి పుష్కలంగా ఉంటాయి. అందువల్ల వీటిని ఆహారంలో చేర్చడం వల్ల మంచి రుచి, వాసన కూడా ఉంటుంది. వీటితో చాలా రకాల ఆరోగ్య సమస్యలు కూడా తీర్చుకోవచ్చు.

అల్లం, పసుపులో ఫ్రీ రాడికల్స్ ఉంటాయి. ఇవి సెల్ డ్యామేజ్‌ను నివారిస్తాయి. అంతేకాదు కీళ్ల నొప్పులు, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. వీటిని ఆయుర్వేదంలోను ఉపయోగిస్తారు. ఆయుర్వేద మూలికలుగా వీటిని ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. సబ్బులు, పౌడర్లు, ముఖానికి ఫేస్ ప్యాక్ లు వంటి వాటిల్లోను ఉపయోగిస్తారు. అల్లం, పసుపు అనేది జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి, మంటను తగ్గిస్తుంది. అజీర్ణం, అపానవాయువు వంటి సమస్యలను నివారించేందుకు తోడ్పడుతుంది.


రక్త ప్రసరణను కూడా మెరుగుపరచడంలో అల్లం, పసుపు కూడా కీలక పాత్రను పోషిస్తాయి. ఇన్ఫెక్షన్లు, కొలస్ట్రాల్, గుండెపోటు, స్ట్రోక్ వంటి ఎన్నో రకాల సమస్యలను తగ్గించడంలోను తోడ్పడతాయి.

Tags

Related News

Turmeric Benefits: పసుపుతో అద్భుతాలు.. ఈ సమస్యలన్నీ దూరం

Tomato Face Packs: టమాటోతో గ్లోయింగ్ స్కిన్..

Sitting Too Much Health: ఎక్కువ సేపు కూర్చొని పనిచేస్తే ఆరోగ్య సమస్యలు.. ఇదే పరిష్కారం..

Health Tips: ఖాళీ కడుపుతో ఈ ఆహారం తింటే ఆరోగ్యానికి ఎంత ప్రమాదం తెలుసా !

Drinking alcohol before sleep : రాత్రి నిద్రపోయేముందు మద్యం సేవిస్తున్నారా?.. ఈ సమస్యలు వచ్చే ప్రమాదముంది జాగ్రత్త!

Study on Men: మగాళ్లు మాయమైపోతారా? 2040 నాటికి ఆ గండం!

Weight Loss Drink: ఈ ఆకు నానబెట్టిన నీరు తాగితే వేగంగా బరువు తగ్గుతారు..

Big Stories

×