EPAPER

Flax Seeds For Skin: ఫ్లాక్ సీడ్స్‌తో ఫేస్ ప్యాక్.. మీ ముఖం మెరిసిపోవడం ఖాయం

Flax Seeds For Skin: ఫ్లాక్ సీడ్స్‌తో ఫేస్ ప్యాక్.. మీ ముఖం మెరిసిపోవడం ఖాయం

Flax Seeds For Skin: ప్రస్తుతం చాలా మంది ముఖంపై మొటిమలు, మచ్చలతో ఇబ్బందిపడుతున్నారు. ఇందుకోసం ముఖ్యంగా మహిళలు ఖరీదైన ఫేస్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. అయినప్పటికీ ఫలితం అంతంత మాత్రమే . అందుకే హోం మేడ్ ఫేస్ ప్యాక్ లను తయారు చేసుకుని వాడటం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. అవిసె గింజలతో తయారు చేసిన ఫేస్ ప్యాక్ లను వాడటం వల్ల ముఖంపై మచ్చలు తొలగిపోతాయి. స్కిన్ టోన్ మెరుగుపరచడంతో ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది.


1. అవిసె గింజలు, ముల్తానీ మిట్టి ఫేస్ ప్యాక్

కావలసినవి:


ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ – 1 టేబుల్ స్పూన్
ముల్తానీ మట్టి- 1 టేబుల్ స్పూన్
తేనె- 2 టేబుల్ స్పూన్లు
నిమ్మరసం- 1/2 టేబుల్ స్పూన్

తయారీ విధానం:
పైన చెప్పిన మోతాదుల్లో పదార్థాలను ఒక బౌల్ లో వేసుకుని మిక్స్ చేయాలి. ఇలా తయారు చేసిన ఈ మిశ్రమాన్ని ఫేస్ పై అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత ఈ ఫేస్ ప్యాక్ ను చల్లటి నీటితో కడిగేయాలి. దీనిని వారానికి ఒక సారి వాడటం వల్ల ముఖం అందంగా మెరిసిపోతుంది. ముఖంపై మచ్చలు కూడా రాకుండా ఉంటాయి.

2. పసుపు, అవిసె గింజల ఫేస్ ప్యాక్:

కావలసినవి:

పసుపు- 1/2 టేబుల్ స్పూన్
అవిసె గింజల పొడి – 1 టేబుల్ స్పూన్

తయారీ విధానం:

పైన చెప్పిన మోతాదుల్లో పదార్థాలను తీసుకుని వాటిని ఒక బౌల్‌లో వేసుకుని కలుపుకోవాలి. ఆ తర్వాత ముఖానికి అప్లై చేసుకోవాలి. దీనిని 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. దీంతో ముఖంపై మచ్చలు తొలగిపోతాయి. ముఖం అందంగా మారుతుంది. తరుచుగా ఈ ఫేస్ ప్యాక్ వాడటం వల్ల ముఖం కాంతి వంతంగా మెరుస్తుంది.

Also Read: 40 ఏళ్లలో కూడా యంగ్‌‌గా కనిపించాలా ?

3. రోజ్ వాటర్, ఫ్లాక్ సీడ్స్ ఫేస్ ప్యాక్:

కావలసినవి:
ఫ్లాక్ సీడ్స్ పౌడర్ – 2 టేబుల్ స్పూన్స్
నీరు- 1/4 కప్పు
రోజ్ వాటర్- 1 టీ స్పూన్

తయారీ విధానం:

ముందుగా పైన చెప్పిన విధంగా పదార్థాలను ఒక గిన్నెలో వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేయాలి. ఆ తర్వాత 15 నిమిషాల పాటు ఉంచి కడిగేయాలి. తరుచుగా ఈ ఫేస్ ప్యాక్ ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖం అందంగా మారుతుంది.  అంతే కాకుండా ముఖం మెరిసిపోతుంది.

ఫ్లాక్ సీడ్స్ తో  తయారు చేేసిన ఫేస్ ప్యాక్ లను వాడటం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా ముఖంపై ఉన్న మచ్చలను తొలగించడానికి  ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. మచ్చలను కూడా రాకుండా చేస్తాయి. అవిసె గింజల్లోని పోషకాలు చర్మ సంబంధిత సమస్యలను రాకుండా చేస్తుంది. ఫ్లాక్ సీడ్స్ చర్మ సౌందర్యానికే కాదు. ముఖ సౌందర్యానికి కూడా అనేక లాభాలను కలిగిస్తాయి. ప్రతి రోజు ఉదయం అవిసె గింజలను తినడం వల్ల కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×