EPAPER

Farting : గ్యాస్ ప్రాబ్లమ్.. ఎందుకిలా వదులుతారు?

Farting : గ్యాస్ ప్రాబ్లమ్.. ఎందుకిలా వదులుతారు?
Farting
Farting

Farting : గ్యాస్ ప్రాబ్లమ్.. మనల్ని వేధించే ప్రధాన జీర్ణ సంబంధిత సమస్యల్లో ఇది కూడా ఒకటి. ఈ సమస్యతో చాలా మంది చెప్పలేని బాధను అనుభవిస్తుంటారు. కానీ ఆ సమస్య గురంచి ఎవరూ మాట్లాడరు. గ్యాస్‌ను అపానవాయువు అని కూడా అంటారు. ఇది చాలా సహజసిద్దమైనది, ఆరోగ్యకరమైనది. జీర్ణం సమయంలో తయారైన వాయువులను శరీరం బయటకు పంపుతుంది. అపానవాయువు సహజసిద్ధమైనది అయినప్పటికీ.. ఇది స్నేహితులతో కలిసి ఉన్నప్పుడు లేదా బంధువుల మధ్యలో ఉన్నప్పుడు రిలీజ్ అయితే.. దేవుడా ఆ బాధ చెప్పలేనిది. ఈ స‌మస్యకు గల ప్రధాన కారణాలు తెలుసుకోండి.


అపానవాయువుకు కారణాలు ఏమిటి? అది నియంత్రించుకోవడం ఎందుకు కుదరదు? అనే విషయానికి వస్తే.. హెల్త్‌లైన్ కథనం ప్రకారం అపానవాయువు లేదా ఫార్ట్ అనేది ప్రేగులలో ఏర్పడే గ్యాస్‌ను బయటికి వదలడం వల్ల జరుగుతుంది. దీని కారణంగా ఆహారం సులువుగా జీర్ణం అవుతుంది. ఆహారాన్ని నమిలే ప్రక్రియలో మన శరీరంలోకి గ్యాస్ చేరుతూ ఉంటుంది. కార్బొనేటెడ్ పానీయాల వలన కూడా గ్యాస్ పెరుగుతుంది.

Also Read : మచ్చలు ఉన్న అరటి పండు.. తింటే ఏమి జరుగుతుందో తెలుసా..?


చిన్న ప్రేగులలో బ్యాక్టీరియా కావలసినదానికన్నా ఎక్కువ పెరగడం కూడా దీనికి కారణంగా చెప్పవచ్చు. టైప్-2 డయాబెటిస్, సెలియాక్ లేదా కాలేయానికి సంబంధించిన వ్యాధుల వలన చిన్న ప్రేగుల్లో ఈ బ్యాక్టీరియా పెరుగుతుంది. పూర్తిగా జీర్ణం కాని కార్బోహైడ్రేట్స్ వలన ఈ గ్యాస్ తయారవుతుంది. చిన్న ప్రేగుల్లోకి చేరిన ఆహారం మొత్తం జీర్ణం కాకపోవచ్చు. ఇక్కడ జీర్ణం కాని కార్బోహైడ్రేడ్స్ మలద్వారంలోకి చేరుతాయి. ఈ క్రమంలో అక్కడున్న బ్యాక్టీరియా దీన్ని హైడ్రోజన్, కార్బన్ డైఆక్సైడ్‌గా మారుస్తుంది.

ఇలా తయారయిన గ్యాస్ మొత్తం ఎలాగోలా బయటికి రావాలి. ఇందులో కొంతభాగాన్ని మన శరీరం సహజంగా తీసేసుకుంటుంది. కానీ ఈ గ్యాస్‌లో అధిక శాతం మలాశయం పైభాగంలో చేరిచే కొలోన్ గోడల మీద ఒత్తిడిని పెంచుతుంది. అందువల్ల కడుపు నొప్పి వస్తుంది. దీనివల్ల గ్యాస్ ఒక్కోసారి ఛాతీలోకి చేరిపోతుంటుంది. కారణంగా ఛాతీ పట్టేసినట్టు ఉండడం లాంటివి కలుగుతాయి.

ఫార్ట్ (పిత్తడం), అపానవాయువును విడుదల చేయడం అనేది కడుపులోని గ్యాస్‌ను బయటికి పంపే చర్య. సాధారణంగా దీన్ని ఆపుకోకూడదు. ఆపుకుంటే వెంటనే చెడు ఫలితాలు కనిపించకపోవచ్చు. కానీ ఈ గ్యాస్ ఎలాగోలా బయటికి రావాలి. అది తాత్కాలికంగా ఆగినా తరువాత ఎప్పుడైనా బయటికి కచ్చితంగా రావాలి.

Also Read : పురుగులు పట్టిన బియ్యం తింటే ఏమవుతుంది..?

మనం రోజంతా గ్యాస్ ఎక్కువగా తయారు చేసే ఆహారపదార్థాలు తింటూ ఉంటే సాయంత్రానికి కడుపుబ్బరం పెరుగుతుంది. ఇది కాకుండా పేగుల్లో ఉన్న కండరాలు బలహీనమైనప్పుడు కూడా అపానవాయువు ఎక్కువగా బయటకు వస్తుంది. సాధారణంగా మలవిసర్జన సమయంలో ఈ గ్యాస్ బయటికి వచ్చేస్తుంటుంది. నిజానికి అపానవాయువు వదలడం అంత చింతించాల్సిన విషయమేం కాదు.

Disclaimer : ఈ కథనాన్ని మెడికల్ జర్నల్స్ ఆధారంగా, నిపుణుల సలహా మేరకు అందిస్తున్నాం. దీనిని అవగాహనగా మాత్రమే భావించండి.

Related News

Weight Gain Foods For Children: మీ పిల్లలు బరువు పెరగడం లేదా ? ఈ ఫుడ్స్ తినిపించండి

Aloe Vera Health Benefits: కలబందతో మతిపోయే ప్రయోజనాలు !

Lip Care Tips: పెదాలు ఎర్రగా మారడానికి చిట్కాలు ఇవే !

Barley Water Benefits: బార్లీ వాటర్‌తో అనారోగ్య సమస్యలు దూరం !

Chana Dal For Diabeties: డయాబెటీస్ ఉన్నవారికి శనగపప్పుతో ఉండే లాభాలు తెలిస్తే అస్సలు వదలరు..

Figs Side Effects: ఆరోగ్యానికి మంచిది అని అంజీర పండ్లను అతిగా తినేస్తున్నారా ?

Chia Seeds Benefits for Skin: చియా సీడ్స్‌తో ఫేస్ ప్యాక్.. మీ చర్మం మెరిసిపోవడం ఖాయం

Big Stories

×