EPAPER

Hyderabad Tourist spots: హైదరాబాద్ వాసులు కుటుంబంతో సరదాగా గడిపేందుకు అందమైన ప్రాంతాలివే.. సెలవుల్లో మంచి ఆప్షన్!

Hyderabad Tourist spots: హైదరాబాద్ వాసులు కుటుంబంతో సరదాగా గడిపేందుకు అందమైన ప్రాంతాలివే.. సెలవుల్లో మంచి ఆప్షన్!

Hyderabad Tourist spots| నగర జీవితంలో క్షణం తీరిక లేకుండా బిజీ బిజీ ఉండే సగటు మనిషికి కుటుంబంతో ప్రశాంతంగా గడిపేందుకు లభించేది ఆదివారం ఒక్క రోజు మాత్రమే. సాఫ్టవేర్ లాంటి ఉద్యోగాలు చేసేవారికి వారంలో శనివారం అదనంగా సెలవు ఉంటుంది. అయితే ఎప్పుడైనా కుటుంబంతో నగరం నుంచి దూరంగా ప్రకృతి అందాల మధ్య గడిపాలను కునే వారికి ఈ వారం లో అయిదు రోజులు సెలవు లభిస్తోంది.


ఆగస్టు 15 నుంచి ఆగస్టు 19 (రాఖీ పండుగ) వరకు ఆఫీసులకు సెలవు. ఈ అయిదు రోజుల్లో హైదరాబాద్ నుంచి రోడ్ ట్రిప్ ప్లాన్ చేసుకొని కుటుంబంతో సరదగా గడపవచ్చు. అలా వెళ్లాను కునే వారికి హైదరాబాద్ చుట్టుపక్కల చాలా పర్యాటక ప్రాంతాలున్నాయి.


1. అనంతగిరి హిల్స్ – 80 కిలీమీటర్లు: నవదంపతుల హనీమూన్ కు అనువైన ప్రదేశం అనంతగిరి హిల్స్. అందమైన కొండలు, కాఫీ తోటలు, ఆహ్లాదకరమైన కారు మబ్బుల వాతావరణం. సరదాగా కుటుంబంతో సమయం గడిపేందుకు ఇంతకంటే మంచి ప్రదేశం మరొకటి ఉండదనిపిస్తుంది.

 

2. మృగవాణి నేషనల్ పార్క్ – 30 కిలీమీటర్లు : హైదరాబాద్ నుంచి కేవలం 30 కిలీమీటర్ల దూరంలోని చిలకూరు ప్రాంతంలో ఉన్న మృగవాణి పార్క్ అందమైన అడవి ప్రాంతం. ఇక్కడ చాలా రకాల జంతువులు, పక్షులున్నాయి. సైట్ సీయింగ్ కోసమైతే హైదరాబాద్ వాసుల ఫస్ట్ చాయిస్ ఇదే.

3. పోచారం వైల్డ్ లైఫ్ శాన్టువరీ – 100 కిలోమీటర్లు: ఆల్లేరు నది, పోచారం సరస్సు వద్ద ఉన్న పచ్చదనం, అందమైన వన్యప్రాణులు, పక్షులు సంచరించే స్థలం కావడంత ఈ శాన్టువరీకి వెళ్లేందుక పర్యాటకులు ఇష్టపడుతుంటారు.

4. మెదక్ కోట – 95 కిలోమీటర్లు : తెలంగాణ చరిత్రకు ప్రతీక మెదక్ కోట. ఈ అద్భత కట్టడాన్ని చూసేందుకు నగరం నుంచి పర్యాటకులు వెళుతూ ఉంటారు.

 

5. నాగార్జున సాగర్ – 151 కిలోమీటర్లు: ప్రకృతి జలపాతాలకు నిలయమైన నాగార్జున సాగర్ వద్ద సాగర్ డ్యామ్ తోపాటు, ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఈ ప్రదేశానికి వెళ్లి ప్రకృతి ఒడిలో సరదా సేద తీరండి.

6. వరంగల్ – 140 కిలోమీటర్లు : తెలంగాణ రాజసానికి ప్రతీక ఓరుగల్లు నగరం.. అంటే నేటి వరంగల్. ఇక్కడ పార్ఖల్ సరస్సు, ప్రకృతి అందాలు, చారిత్ర కట్టడాలు చూడడానికి హైదరబాదీలు తరుచూ వెళుతూ ఉంటారు.

 

 

7. కర్నూల్ – 2012 కిలో మీటర్లు: హైదరాబాద్ నుంచి మూడు గంటలు ప్రయాణం చేస్తే.. కర్నూలు నగరం చేరుకోవచ్చు. ఇక్కడ బెలూం గుహలు, పురాతన దేవాలయాలు, రొల్లపాడు వన్యప్రాణుల శాన్టువరీలు.. పర్యాటక ప్రదేశాలుగా ఉన్నాయి.

8. నల్గొండ – 100 కిలోమీటర్లు: హిందూ ముస్లిం రాజులు ఏలిన నేల నల్గొండ. ఇక్కడ ఎన్నో చారిత్రక కట్టడాలు.. పర్యాటక కేంద్రాలుగా ఉన్నాయి.

 

9. బదామి – 419 కిలోమిటర్లు : నాలుగు గుహల దేవాలయాలు, బదామి కోటకు ప్రసిద్ధి గాంచిన బదామికి హైదరాబాద్ నుంచి చేరుకోవడానికి 8 నుంచి 9 గంటల సమయం పడుతుంది. చుట్టూ పచ్చదనంతో కొండపై ఉన్న బదామి కోట ఇక్కడ ప్రముఖ పర్యాటక స్థలం.

Also Read : భూమివైపు దూసుకొస్తున్న రెండు గ్రహశకలాలు.. విమానం కంటే పెద్ద ఆకారంలో..!

10. గుల్ బర్గా – 230 కిలో మీటర్లు: ఒకప్పుడు నిజాం పాలన సమయంలో గుల్ బర్గా హైదరాబాద్ రాజ్యంలో ఉండేది. ఇక్కడ ముస్లిం రాజుల కట్టడాలు అద్భుతంగా ఉన్నాయి. గుల్ బర్గా లో సూఫీ సాధువు ఖాజా బందే నవాజ్ సమాధి ఉన్న దర్గా, జామా మసీదు ఉన్నాయి. వాటితో పాటు చంద్రం పల్లి డ్యామ్, శరణ బసవేశ్వర దేవాలయం పర్యాటక ప్రదేశాలుగా ఉన్నాయి.

 

11. అదిలాబాద్ – 300 కిలోమీటర్లు: తక్కువ జనాభాతో ప్రశాంతంగా ఉండే అదిలాబాద్ కు చాలామంది హైదరాబాదీలు సరదాగా వెళుతుంటారు. నగరంగా ఎదుగుతున్న అదిలాబాద్ లో చాలా చారిత్ర కట్టడాలు, భక్తులు శ్రద్ధతో కొలిచే దేవాలయాలున్నాయి. అడవులు, నదులు, ప్రకృతి అందాలతో అదిలాబాద్ మెండుగా ఉన్నాయి.

 

12. హంపి – 371 కిలోమీటర్లు: తుంగభద్ర నదీ తీరాన సాంస్కృతిక సంపద మెండుగా ఉన్న పట్టణం హంపి. హైదరాబాద్ కు 6-7 గంటల దూరంలో విజయనగర సామ్రాజ్యానికి జ్ఞాపికగా ఇక్కడ విరూపాక్ష దేవాలయం, హంపి విఠల దేవాలయం, లోటస్ ప్యాలెస్ లు ఉన్నాయి. ఇక్కడి ప్రాచీన దేవాలయాలకు ఐక్యరాజ్య సమితి యునెస్కో గుర్తింపు లభించింది. అందుకే దేశ నలుమూలల నుంచి పర్యాటకుల ఇక్కడికి వస్తున్నారు.

13. పాపికొండలు – 309 కిలోమీటర్లు: రాజమండ్రి సమీపంలో గోదావరి నదీతీరాన అందమైన కొండప్రాంతం పాపికొండలు. రెండు కొండల మధ్యలో నది వెళ్తున్న దృశ్యానికి ప్రతీకగా ఈ కొండలకు ‘పాపిడి కొండలు’ అనే పేరు వచ్చింది. కొండల మధ్య నుంచి నదీ మార్గాన ప్రయాణంలో ప్రకృతి అందాలు కన్నుల విందుగా ఉంటాయి. అందుకే పర్యాటక కేంద్రంగా పాపికొండలు బాగా ఫేమస్.

 

14. మారేడుమిల్లి – 420 కిలోమీటర్లు: దేశంలో ఎకో టూరిజమ్ కేంద్రంగా మారేడుమిల్లి ప్రాచుర్యం పొందింది. ఇక్కడి ప్రకృతి, ఆదివాసీల ఆతిథ్యం మీ మనసుని దోచుకుంటాయి. అటవీ ప్రాంతమైన మారేడుమిల్లిలో వందల సంవత్సరాలుగా ఆదివాసీలు నివసిస్తున్నారు. గోదావరి నదికి సమీపంగా ఈ అడవులు మంచి టూరిస్ట్ స్పాట్.

15. అమరావతి – 271 కిలోమీటర్లు: ప్రాచీన బౌద్ధ స్తూపాలు, దేవాలయాలకు అమరావతి ఫేమస్. గుంటూరు జిల్లాలో కృష్ణా నదీ తీరాన వెలసిన చిన్న పట్టణం అమరావతి. బౌద్ధల తీర్థ స్థలంగా, పర్యాటక కేంద్రంగా పేరు పొందిన అమరావతి ఒక దివ్య ప్రాంతమని అంటారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ కు కొత్త రాజధానిగా రూపుదిద్దుకుంటోంది.

 

బోరింగ్ రొటీన్ లైఫ్ నుంచి బ్రేక్ తీసుకొని కాస్త ప్రకృతితో సమయం గడపాలి, అడ్వెంచర్ చేయాలి లేదా చారిత్రక కట్టడాలను తిలకించాలనుకునే వారికి పైన సూచించిన పర్యాటక కేంద్రాలు మంచి అనుభూతినిస్తాయి. మరింకెందుకు ఆలస్యం లగేజ్ సర్దుకొని బయలుదేరండి.

Also Read: ఒక్క రోజులో 10 అంతస్తుల భవన నిర్మాణం పూర్తి.. అంతా చైనా మహిమ!

 

Related News

Multani Mitti Face Pack:ముల్తానీ మిట్టితో స్మూత్, గ్లోయింగ్ స్కిన్..

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Big Stories

×