EPAPER

Raisins: వీళ్లు ఎండు ద్రాక్షలు అస్సలు తినకూడదు.. ఎందుకో తెలుసా ?

Raisins: వీళ్లు ఎండు ద్రాక్షలు అస్సలు తినకూడదు.. ఎందుకో తెలుసా ?

Raisins: ఆరోగ్యానికి డ్రైఫ్రూట్స్ చాలా మేలు చేస్తాయి. డ్రైఫ్రూట్స్‌లో ఉండే పోషకాల కారణంగా శరీరం ఆరోగ్యంగా ఉండడంతో పాటు అనేక అనారోగ్య సమస్యలు కూడా నయం అవుతాయి. డ్రైఫ్రూట్స్‌లో ముఖ్యంగా ఎండు ద్రాక్షను తినడం వల్ల జీర్ణ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఎండు ద్రాక్షలో ఫఐబర్, కాల్షియం, ప్రోటీన్, ఐరన్ వంటి పోషకాలు శరీరం ధృడంగా ఉండేందుకు తోడ్పడుతుంది. అంతేకాదు బరువు తగ్గాలనుకునే వారు ఎండు ద్రాక్షను తినకుండా ఉంటే మంచిది.


ఎండు ద్రాక్షలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ వంటివి పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అయితే వీటితో తరచూ రాత్రి వేళ నీటిలో నానబెట్టి ఉదయంపూట తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అయితే ఎండు ద్రాక్షను అందరు తినడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ ఎండు ద్రాక్షను అందరు తినడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఎవరు వీటిని తినకూడదు, ఎందుకో తెలుసుకుందాం.

ఎండు ద్రాక్షను బరువు తగ్గాలనుకునే వారు, మధుమేహ వ్యాధి గ్రస్తులు తినకపోవడం మంచిది. ఎండు ద్రాక్షలో ఉండే ఫ్రక్టోజ్, గ్లూకోజ్ కారణంగా బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. అందువల్ల బరువు తగ్గాలనుకునే వారు ఎండు ద్రాక్షకు దూరంగా ఉంటే మంచిది. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా ఎండు ద్రాక్షకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇందులో ఉండే గ్లైసెమిక్ ఇండెక్స్ కారణంగా జీర్ణ సమస్యలు ఎదురవుతాయి. అందువల్ల వీటిని ఎక్కువగా తినకపోవడం మంచిది.


కిడ్నీ సమస్యలు ఉన్న వారికి కూడా ఎండు ద్రాక్ష అస్సలు సహకరించదు. వీటిలో ఉండే ఆక్సటేల్ సమ్మేళనం కారణంగా కిడ్నీలో రాళ్లు తయారయ్యేలా చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల కిడ్నీ సమస్యలు ఉన్న వారు వీటిని తీసుకునే క్రమంలో జాగ్రత్తగా ఉండాలి. వీటిని ఎక్కువగా తీసుకుంటే కిడ్నీ స్ట్రోక్ సమస్య కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంతూకాదు గ్రేప్ అలెర్జీ ఉన్న వారు కూడా ఎండు ద్రాక్షను తీసుకోవడం మంచిది కాదు. ఇందులో సల్ఫైడ్ ఉంటుంది. అందువల్ల ఇది అలర్జీ సమస్యలకు దారి తీస్తుంది.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Poppy Seeds Benefits: గసగసాల ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు !

Sandal Wood: గంధంతో అద్భుతమైన ముఖ సౌందర్యం.. ఈ సమస్యలు కూడా పరార్..

Cucumber Benefits: కీరదోసకాయ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

Drumstick Leaves Benefits: మునగాకు లాభాలు తెలిస్తే.. వదలకుండా తింటారు

Beauty Tips: గ్లోయింగ్ స్కిన్ కోసం కొన్ని చిట్కాలు.. ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు

Early Onset Diabetes: చిన్న వయసులోనే డయాబెటీస్ రాకుండా ఈ జాగ్రత్తలు పాటించండి!

Banana Peel Face Pack: ముఖం అందంగా మెరిసిపోవాలా ? ఈ ఫేస్ ప్యాక్ ఒక్క సారి ట్రై చేయండి

Big Stories

×