EPAPER
Kirrak Couples Episode 1

Tomato Juice: టమాటా రసం తాగితే ఒంట్లో కొవ్వు ఇట్టే కరిగిపోతుంది..

Tomato Juice: టమాటా రసం తాగితే ఒంట్లో కొవ్వు ఇట్టే కరిగిపోతుంది..

Tomato Juice: టమాటాలు ఉంటేనే ఏ కూరకు అయినా రుచి వస్తుంది. టమాటలను చేర్చకుండా వంట చేయడం అంటే ఇంట్లో మహిళలకు అస్సలు నచ్చదు. ఎందుకంటే టమాటలు వేస్తే వాటి రసంతో కూరకు ఎంతో రుచి వస్తుంది. అయితే కేవలం రుచి కోసం మాత్రమే కాకుండా టమాటాలను తినడం వల్ల ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. టమాటాల్లో విటమిన్, బీ6, సీ, మెగ్నీషియం, పొటాషియం వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి.


టమాటాలను కొంత మంది వంటలో మాత్రమే కాకుండా పచ్చిగా కూడా తినడానికి ఇష్టపడుతుంటారు. అయితే కూరలో తినే టమాటాల కన్నా పచ్చిగా తినే టమాటాలతో ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా పచ్చి టమాటా రసం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. పచ్చి టమాటా రసాన్ని తరచూ అంటే 30 రోజుల పాటు తాగడం వల్ల పుష్కలమైన ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆరోగ్యానికి టమాటా రసం చేసే మేలు ఏంటో తెలుసుకుందాం.

టమాటా రసం శరీరంలో పేరుకుపోయిన కొలస్ట్రాల్ ను తగ్గించేందుకు తోడ్పడుతుంది. అంతేకాదు రక్తపోటు, గుండెపోటు వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. ముఖ్యంగా ఒత్తిడి, పనిలో టెన్షన్ ఫీల్ అయ్యే వారు టమాటా రసం తీసుకుంటే అనేక పర్యోజనాలు ఉంటాయి.


టమోటా రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..

క్యాన్సర్

దీర్ఠకాలికంగా బాధపడే సమస్యలను నివారించడానికి టమాటా రసం అద్భుతంగా పనిచేస్తుంది. టమాటలో ఉండే లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తో పోరాడడానికి సహాయపడుతుంది. అంతేకాదు ఇవి సెల్ డ్యామెజ్ చేయడానికి కారణం అవుతుంది. అందువల్ల తరచూ టమాటా రసం తీసుకుంటే క్యాన్సర్ వంటి సమస్యను తగ్గించుకోవచ్చు. అంతేకాదు బ్రెస్ట్ క్యాన్సర్ ను నివారించడంలోను ఇవి సహాయపడుతుంది.

గుండె పోటు

గుండె సంబంధింత సమస్యలకు టమాటా రసం తాగడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది. దీంతో శరీరంలోని కొలస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చు. ఇక గుండె సమస్యల ప్రమాదాన్ని కూడా నివారించవచ్చు.

బరువు తగ్గడం

బరువు తగ్గాలనుకునే వారు తరచూ టమాటా రసం తాగడం వల్ల ఇందులో క్యాలరీల పరిమాణం తక్కువగా ఉంటుంది. పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ జ్యూస్ తాగడం ఆకలిని పొదుపు చేస్తుంది. అంతేకాదు జీవక్రియను కూడా మెరుగుపరుస్తుంది.

యాంటీ ఏజింగ్

టమాటాలో యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉంటాయి. అందువల్ల ఇది చర్మాన్ని రక్షించడానికి సహాయపడుతుంది. అంతేకాదు హైడ్రేటింగ్ గా కూడా ఉంచుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు చర్మంపై ముడతలు రాకుండా చేస్తుంది. మరోవైపు టమాటా రసం తరచూ తాగడం వల్ల ముఖంపై మొటిమలు, మచ్చలను తగ్గిస్తుంది.

జీర్ణక్రియ సమస్య

టమాటాలో ఉండే ఫైబర్ జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అంతేకాదు మలబద్ధకం, కడుపులో ఆమ్లత వంటి వాటిని తగ్గించడానికి కూడా తోడ్పడుతుంది. దీని వల్ల తిన్న ఆహారం జీర్ణం కావడానికి సులభమవుతుంది.

టామాట రసం తయారీ విధానం..

టమాటా రసం తయారుచేసుకోవడానికి ముందుగా టమాటాలను మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేసి అందులో అల్లం ముక్కను కూడా వేసి ఉప్పు, నిమ్మరసం వేసుకుని జ్యూస్ తయారుచేసుకోవాలి. లేదంటే టమాటాలను నీళ్లలో బాగా మరిగించి తర్వాత దానిని మెత్తగా స్మాష్ చేసి జ్యూస్ తయారుచేసుకుని అందులో నిమ్మరసం పిండుకుని తాగితే మంచిది.

(గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే వీటిని పాటించాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.)

Related News

Vitamin E Capsules: విటమిన్ ఇ క్యాప్సూల్స్‌లో మీ అందం రెట్టింపు

Vitamin deficiency: మీకు విపరీతంగా జుట్టు రాలిపోతుందా? అయితే ఈ విటమిన్ల లోపం ఉన్నట్టే, వీటిని తినండి

Weight Loss Tips: ఈజీగా బరువు తగ్గండిలా ?

Screen Strain Eye Health: ఎక్కువ సేపు స్మార్ట్ ఫోన్ చూడడంతో కంటి సమస్యలు.. ఈ సెటింగ్స్ తో మీ ఆరోగ్యం కాపాడుకోండి!

Tea and Biscuits: ఇప్పటివరకు తిన్నది చాలు, ఇకపై టీ తాగుతూ బిస్కెట్లు తినడం మానేయండి, అది మీకే ప్రమాదం

Cloves Health Benefits: లవంగాలతో మతిపోయే లాభాలు!

Big Stories

×