EPAPER
Kirrak Couples Episode 1

New Cancer Drug: చౌకైన ఔషధంతో బ్రెయిన్ ట్యూమర్ మాయం, ప్రాణాంతక క్యాన్సర్ కు సరికొత్త డ్రగ్ కనుగొన్న పరిశోధకులు

New Cancer Drug: చౌకైన ఔషధంతో బ్రెయిన్ ట్యూమర్ మాయం, ప్రాణాంతక క్యాన్సర్ కు సరికొత్త డ్రగ్ కనుగొన్న పరిశోధకులు

ETH Zurich Researchers Discover New Cancer Drug: గ్లియోబ్లాస్టోమా అనేది చాలా అత్యంత ప్రమాకరమైన క్యాన్సర్ కణితి. మెదడుకు సోకే ఈ కణితికి ఇప్పటి వరకు సరైన చికిత్స లేదు. రేడియేషన్, కీమోథెరపీ లేదంటే సర్జరీ ద్వారా రోగులను కొద్ది కాలం పాటు బతికించినా పూర్తి స్థాయిలో నయం చేయడం కుదరదు. ఈ వ్యాధి నిర్థారణ జరిగిన ఏడాదిలోపే చాలా మంది రోగులు చనిపోతారు. ప్రస్తుతం అదుబాటులో ఉన్న క్యాన్సర్ మందులు కూడా ఈ కణితి మీద ప్రభావం చూపలేవు. న్యూరో-ఆంకాలజిస్టులు మెదడుకు చేరి, గ్లియోబ్లాస్టోమా కణితిని నిర్మూలించే మెరుగైన ఔషధాలను కనుగొనేందుకు చేసేందుకు చాలా కాలంగా పరిశోధనలు జరుపుతున్నారు. తాజాగా స్విట్జర్లాండ్‌ పరిశోధకులు ఈ ప్రమాదకర క్యాన్సర్ కు మందు కనుగొనడంలో సక్సెస్ అయ్యారు.


వోర్టియోక్సేటైన్ తో గ్లియోబ్లాస్టోమాకు చెక్!

ETH జ్యూరిచ్ ప్రొఫెసర్ బెరెండ్ స్నిజ్డర్ నేతృత్వంలోని పరిశోధకులు గ్లియోబ్లాస్టోమాస్‌ ను నయం చేసే ఔషధాన్ని కనుగొన్నారు. ఇప్పటికే మార్కెట్లో ఉన్న వోర్టియోక్సేటైన్ అనే చౌకైన యాంటీడిప్రెసెంట్  గ్లియోబ్లాస్టోమాస్‌ ను ఎదుర్కొంటుందని గుర్తించారు. స్నిజ్డర్ నేతృత్వంలోని టీమ్ సభ్యుడు సోహియోన్ లీ దీనిని ఫార్మాకోస్కోపీని ఉపయోగించి కనుగొన్నారు. ఫార్మకోస్కోపీతో క్యాన్సర్ కణజాలంపై ఏకకాలంలో వందలాది క్రియాశీల పదార్థాలను టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ అధ్యయనంలో వోర్టియోక్సేటైన్ యాంటీడిప్రెసెంట్స్ , పార్కిన్సన్స్, యాంటీసైకోటిక్స్ సాయంతో రక్త, మెదడు అవరోధాన్ని దాటే న్యూరోయాక్టివ్ పదార్థాలపై ప్రధానంగా ఫోకస్ పెట్టారు. ఈ పరిశోధనా బృందంలోని సభ్యులు 40 మంది రోగుల కణితి కణజాలంపై 130 వేర్వేరు ఏజెంట్లను పరీక్షించారు. ఏ పదార్థాలు క్యాన్సర్ కణాలపై ఎఫెక్టివ్ గా పని చేస్తాయో తెలుసుకునేందుకు  ఇమేజింగ్ పద్ధతులు, కంప్యూటర్ విశ్లేషణలను ఉపయోగించారు.


కణితి కణాలను అడ్డుకున్న వోర్టియోక్సేటైన్  ఔషధం

పరిశోధన అనతరం ఫలితాలను విశ్లేషించగా, వోర్టియోక్సేటైన్  యాంటీ డిప్రెసెంట్లు క్యాన్సర్ కణాలు సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు గుర్తించారు. చివరి దశలో జ్యూరిచ్‌ పరిశోధకులు వోర్టియోక్సేటైన్‌ను ఎలుకల్లోని గ్లియోబ్లాస్టోమాపై పరీక్షించారు.  అక్కడ ఫలితాలు అనుకున్నట్లు రావడంతో ETH జ్యూరిచ్, USZ పరిశోధకుల బృందం రెండు క్లినికల్ ట్రయల్స్‌ కు రెడీ అవుతున్నారు. ఒకదానిలో గ్లియోబ్లాస్టోమా రోగులకు ప్రామాణిక చికిత్సతో పాటు వోర్టియోక్సేటైన్‌ తో చికిత్సను అందివ్వనున్నారు. “వోర్టియోక్సేటైన్ ఔషధం అనేది సురక్షితమైన, చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది. ఈ ఔషధం ఇప్పటికే ఆమోదించబడినందున, మరోసారి సంక్లిష్టమైన ఆమోద ప్రక్రియలో పాల్గొనవలసిన అవసరం లేదు. ప్రాణాంతక మెదడు కణితికి ప్రామాణిక చికిత్సలో కీలక పాత్ర పోషిస్తుందని ఆశిస్తున్నాం. ఈ ఔషధం మనుషులలో పనిచేస్తుందో లేదో, కణితిని ఎదుర్కోవడానికి ఏ మోతాదు అవసరమో త్వరలోనే తెలియనుంది.  అందుకే క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నాం”అని అని  ETH జ్యూరిచ్ పరిశోధకులు తెలిపారు. ఎలుకల్లో మాత్రం మంచి ఫలితాలు వచ్చినట్లు గుర్తించామన్నారు పరిశోధకులు. ట్రయల్స్ లో వోర్టియోక్సేటైన్ మంచి ఫలితాలు వస్తే.. గ్లియోబ్లాస్టోమా చికిత్సను అందించేందుకు గత దశాబ్దాలలో కనుగొన్న ఔషధం ఇదే అవుతుందని అభిప్రాయపడ్డారు.ః

Read Also: రోజూ కాఫీ తాగితే ఇన్ని లాభాలా.. అలవాటు లేకపోతే ఇవి మిస్ అవుతున్నట్లే!

Related News

Beauty Tips: రోజ్ ఫ్లవర్‌తో ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేశారంటే.. గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం

Sleeping on the stomach: నడుము నొప్పికి కారణం అయ్యే ఈ 4 సమస్యలు తెలిస్తే షాక్ అవుతారు

Face Mask: చియా సీడ్స్‌తో ఫేస్ మాస్క్.. మొటిమలు మాయం

Homemade Hair Oils: జుట్టు రాలడాన్ని తగ్గించే.. హెయిర్ ఆయిల్స్ ఇవే

Potato Vada: బంగాళదుంప గారెలు రెసిపీ, మీ కోసమే క్రంచీగా, క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి

Pink Pineapple: పింక్ పైనాపిల్ ఎప్పుడైనా తిన్నారా..? ప్రయోజనాలో తెలిస్తే అస్సలు వదలరు

Beauty Tips: వీటితో క్షణాల్లోనే మిలమిల మెరిసే చర్మం మీ సొంతం

Big Stories

×