EPAPER

Tips to Prevent Pimples: ఈ టిప్స్ ఫాలో అయితే ముఖంపై ఒక్క మొటిమ కూడా ఉండదు

Tips to Prevent Pimples: ఈ టిప్స్ ఫాలో అయితే ముఖంపై ఒక్క మొటిమ కూడా ఉండదు

Tips to Prevent Pimples: ప్రస్తుతం అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడా లేకుండా చాలామంది మొటిమల సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. మొటిమలు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయి. అంటే కొందరికి చిన్న సైజులో తక్కువ సంఖ్యలో కనిపిస్తుంటే.. ఇంకొందరికి పెద్ద సంఖ్యలో ఉంటూ ముఖంపై ఎక్కువగా ఉంటాయి. మొటిమలు ముఖంపై అధికంగా ఉంటే అంద విహీనంగా కనిపిస్తుంది. దీంతో నలుగురితో కలిసి బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుంది.


ఈ క్రమంలోనే చాలా మంది వీటిని తగ్గించుకునేందుకు ఏవే మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అలాంటి వారు చిన్నచిన్న టిప్స్ ఫాలో మొటిమల సమస్య ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మొటిమలు ఎక్కువగా జిడ్డు చర్మం ఉన్న వారికి రావడం సాధారణం. రోజుకు రెండుసార్లు ముఖం కడుక్కోవడం వల్ల చర్మంపై జుట్టు, మురికి, మృతకణాలు తొలగిపోతాయి. ముఖంపై ఉన్న హెయిర్ మూసుకుపోకుండా బ్యాక్టీరియా పెరగకుండా ఇది నిరోధిస్తుంది. తద్వారా మొటిమలు తగ్గే అవకాశం ఉంది.. 2016 లో జర్నల్ ఆఫ్ డెర్మటాలజికల్ ట్రీట్‌మెంట్ ద్వారా ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం రోజుకు రెండుసార్లు ముఖం కడుక్కున్న వారిలో మొటిమల తీవ్రత తగ్గుతుందని వెల్లడించారు.ఇందుకు సంబంధించిన పరిశోధన న్యూయార్క్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో నిర్వహించారు. ఇందులో పాల్లొన్న చర్మవ్యాధి నిపుణులు వందమందిని ఎనిమిది వారాల పాటు పరిశీలించారు. రోజుకు రెండుసార్లు ముఖం కడుక్కోవడం వల్ల మొటిమల తీవ్రత తగ్గిందని గుర్తించారు.


చాలా మంది ఎక్కువ గాఢత కలిగిన సబ్బులను వాడుతుంటారు. అయితే ఆ కఠినమైన సబ్బులు కూడా చర్మానికి చికాకు కలిగిస్తాయి. కాబట్టి మృదువైన సబ్బులతో పాటు మృదువైన టవల్‌ను వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. కొందరైతే చేతులు ఎక్కడ పడితే అక్కడ పెట్టి మళ్లీ వాటితో ముఖాన్ని తాకుతుంటారు. ఇలా చేయడం వల్ల మొటిమలు తగ్గవు ఎందుకంటే మన చేతిలో ఉన్న బ్యాక్టీరియా ముఖంపైకి చేరుతుంది. ముఖంపై ఉన్న మొటిమలకు ఇది మరింత చికాకును కలిగిస్తుంది. కాబట్టి వాడే టవల్ ఎప్పుడు శుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలి.

మొటిమలు వచ్చినప్పుడు చాలామంది వాటిని గిల్లుతూ ఉంటారు. అలా చేయడం మంచిది కాదు అని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే చర్మంపై ఉండే బ్యాక్టీరియా లోపలికి వెళ్లి ఇన్‌ఫెక్షన్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వీలైనంతవరకు ఈ అలవాటు మానేసే ప్రయత్నం చేయాలి.
మొటిమలు ముఖంపై ఉన్న అమ్మాయిలు ముఖ్యంగా మేకప్ వేసుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించడం అవసరం. మొటిమలు ఉన్నప్పుడు ఫౌండేషన్, పౌడరు పెట్టుకోకుండా ఉండడమే మంచిది, ఒకవేళ తప్పనిసరి పరిస్థితిలో వేసుకుంటే రాత్రిపూట క్లీన్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: మీ పళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ పదార్థాలకు దూరంగా ఉండండి

తలస్నానం చేసే ముందు తలకు నూనె అప్లై చేసుకుంటారు. కానీ అలా చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే తలస్నానం చేసే ముందు నూనె పెట్టుకుంటే ఇది ముఖం మీద వ్యాపించి చర్మ రంధ్రాలు మూసుకుపోయేలా చేస్తుంది. తద్వారా మొటిమలు వస్తాయి.
తినే ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. వేపుళ్లు, కొవ్వు పదార్థాలు తినకుండా ఉండటం మంచిది. తాజా కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినాలి. పాల ఉత్పత్తులు, చక్కెర ఎక్కువగా ఉండే స్వీట్స్ వంటివి తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు.

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×