EPAPER

stress relief : ఒత్తిడిని చిత్తు చేసేద్దాం..!

stress relief : ఒత్తిడిని చిత్తు చేసేద్దాం..!
Stress

stress relief : ఉరుకుల పరుగుల జీవితంలో మనిషి తెలియకుండానే బోలెడంత ఒత్తిడికి లోనవుతున్నాడు. ఇక.. పట్టణ, నగర వాసుల సంగతైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. జీవనశైలి మార్పులు, ఆహారం, వృత్తి సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు.. ఇలా ప్రతి అంశమూ ఒత్తిడికి దారితీస్తోంది. ఈ ఒత్తిడిని తట్టుకోలేని చాలామంది డిప్రెషన్‌కు లోనవుతున్నారు. అయితే.. ఈ ఒత్తిడిని చిత్తుచేయగల మార్గాలూ మన ముందున్నాయంటున్నారు.. మానసిక నిపుణులు. అవేంటో చూద్దాం.


మనసు ఆందోళనకు లోనైనా, ఒత్తిడిగా ఉన్నా.. కాసేపు వాకింగ్‌కు వెళ్లండి
పచ్చని చెట్టు, కూసే పిట్ట గొంతు, పచ్చిక మీద పడుకోవటంతో బాటు పెంపుడు జంతువులతో కాలక్షేపమూ చేయొచ్చు.
మంచి స్నేహితుడితో కాసేపు హాయిగా జోక్‌లు వేస్తూ మాట్లాడండి. రిలీఫ్‌గా అనిపిస్తుంది
వ్యాయామానికి మించిన బెస్ట్ ఆప్షన్ మరొకటి లేదు. కాబట్టి కాస్త ఒంటికి చెమట పట్టే పనిచేయండి.
ఏదైనా కవిత, ఉత్తరం, జర్నల్‌ రాయడానికి ప్రయత్నించండి.
వెచ్చటి కప్పు కాఫీ, టీ తాగండి. సువాసన వెదజల్లే ఓ కొవ్వొత్తిని వెలిగించండి.
మంచి పుస్తకాన్ని చదవటం మొదలుపెడితే.. అరగంటలో ఒత్తిడి దూరం ఖాయం.
కార్టూన్, కామెడీ సినిమా వంటివి చూడండి. కాసేపు గార్డెనింగ్ చేసినా చాలు.
ఇక.. ఏదైనా వాయిద్యం వాయించటం, కనీసం వాయించేందుకు ప్రయత్నించటం చేసినా.. మనసుకు సంతోషం కలుగుతుంది.
ఏదైనా సేవా కార్యక్రమంలో ఓ గంటపాటు వాలంటీర్‌గా పనిచేయండి. ఒత్తిడి పోయి.. రెట్టింపు ఆత్మవిశ్వాసం మీ సొంతమవుతుంది.
నిజానికి.. ఒత్తిడిని దూరం చేసుకోవడానికి ఏం చేయాలన్నది మీ మీ ఆసక్తి మీద ఆధారపడి ఉంటుంది కనుక మీకు నచ్చిన పని చేయండి. ఒత్తిడిని తరిమికొట్టండి.


Tags

Related News

Hair Care Tips: జుట్టు సమస్యలన్నింటికీ చెక్ పెట్టండిలా !

Tips For Skin Glow: క్షణాల్లోనే మీ ముఖాన్ని అందంగా మార్చే టిప్స్ !

Yoga For Stress Release: ఒత్తిడి తగ్గేందుకు ఈ యోగాసనాలు చేయండి

Throat Infection: గొంతు నొప్పిని ఈజీగా తగ్గించే డ్రింక్స్ ఇవే..

Skin Care Tips: గ్లోయింగ్ స్కిన్ కోసం.. ఇంట్లోనే ఈ ఫేస్ ప్యాక్స్ ట్రై చేయండి

Sweets: స్వీట్లు ఇష్టపడేవారు ఈ సమయంలో తింటే అన్నీ సమస్యలే..!

Coffee For Glowing Skin: కాఫీ పౌడర్‌లో ఇవి కలిపి ఫేస్‌ప్యాక్ వేస్తే.. మీ ముఖం మెరిసిపోవడం ఖాయం

Big Stories

×