Pimple Problem: ప్రతి ఒక్కరూ తమ ముఖం, మొటిమలు లేకుండా ఉండాలని కోరుకుంటారు. చర్మంపై మొటిమలు ముఖం యొక్క అందాన్ని తగ్గిస్తాయి. ముఖంపై మొటిమలు ఉంటే ఆత్మ నూన్యత భావం కూడా పెరుగుంది. ఇదిలా ఉంటే కొంత మంది పింపుల్స్ తగ్గించుకోవడానికి మార్కెట్‌లో లభించే ఖరీదైన ఫేస్ క్రీమ్స్ వాడుతుంటారు. అయితే వీటికి బదులో హోం రెమెడీస్ తో పింపుల్స్ తగ్గించుకోవచ్చు.
ఇవి తక్కువ సమయంలోనే ఎఫెక్టీవ్ గా పని చేస్తాయి కూడా. మరి ఏ హోం రెమెడీస్ ముఖంపై పింపుల్స్ తగ్గించడానికి ఉపయోగపడతాయి. వాటిని ఎలా ఉపయోగించాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మొటిమలను వదిలించుకోవడానికి మార్గాలు:
మొటిమలు చాలా మందిని ఇబ్బంది పెట్టే సాధారణ సమస్య. హార్మోన్ల అసమతుల్యత, ఒత్తిడి, కాలుష్యం, తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల కూడా మొటిమలు రావచ్చు. ఎలాంటి మొటిమలను అయినా హెం రెమెడీస్‌తో తగ్గించుకోవచ్చు.
ముల్తానీ మిట్టి: ముల్తానీ మిట్టి ఫేషియల్ ముఖంపై ఆయిల్ గ్రహిస్తుంది. అంతే కాకుండా మొటిమలు తగ్గించడంలో సహాయపడుతుంది. మొటిమల సమస్య ఉన్న వారు రోజ్ వాటర్, పెరుగుతో కలిపి పేస్ట్ ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా తరుచుగా చేయడం వల్ల ముఖంపై మొటిమలు చాలా వరకు తగ్గుతాయి. అంతే కాకుండా ముఖం కూడా మృదువుగా మారుతుంది.
పెరుగు:పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. మొటిమలు ఉన్న చోట పెరుగును అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
తేనె: తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి మొటిమలను నయం చేయడంలో సహాయపడతాయి. మీరు మొటిమలపై నేరుగా తేనెను అప్లై చేయవచ్చు.
నిమ్మరసం: నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది. ఇది మొటిమల మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. కాస్త నిమ్మరసాన్ని నీటితో కలిపి ముఖానికి రాసుకోవచ్చు.
టమాటో: టమాటోలో లైకోపీన్ ఉంటుంది. ఇది మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది. టమాటో రసాన్ని కూడా నేరుగా ముఖానికి రాసుకోవచ్చు.
అలోవెరా జెల్: అలోవెరా జెల్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి మొటిమలకు సంబంధించిన మంటలను కూడా తగ్గిస్తాయి. దీన్ని నేరుగా మొటిమలపై అప్లై చేసుకోవచ్చు.
పసుపు: మొటిమలను నయం చేయడంలో సహాయపడే యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలు పసుపులో ఉన్నాయి. పసుపు, నీళ్ళు కలిపి పేస్ట్ లా చేసి మొటిమల మీద రాసుకోవచ్చు. ఇది మొటిమలను తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది.
Also Read: హెన్నాలో ఇవి కలిపి అప్లై చేస్తే.. జీవితంలో తెల్ల జుట్టు రాదు తెలుసా ?
కొన్ని అదనపు చిట్కాలు:
ముఖాన్ని శుభ్రంగా ఉంచుకోండి: రోజుకు రెండుసార్లు ముఖం కడగాలి.
ఆయిల్ ఫుడ్ మానుకోండి: వేయించిన ఆహారాలు, స్వీట్లు తినడం మానుకోండి.
పుష్కలంగా నీరు త్రాగండి: ఇది చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.
ఒత్తిడిని తగ్గించండి: ఒత్తిడి మొటిమలు రావడానికి కారణం అవుతుంది. కాబట్టి యోగా, ధ్యానం వంటివి చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.