EPAPER

Cough: ఎంతకీ దగ్గు తగ్గడం లేదా.. వీటితో వెంటనే ఉపశమనం

Cough: ఎంతకీ దగ్గు తగ్గడం లేదా.. వీటితో వెంటనే ఉపశమనం

Cough: దగ్గు అనేది ఒక సాధారణ ఆరోగ్య సమస్య. ముఖ్యంగా మారుతున్న సీజన్లలో దగ్గు రావడం కామన్. కానీ ఇలా వచ్చిన దగ్గు కొన్ని రోజుల్లో సహజంగా తగ్గినప్పటికీ  తరుచుగా దగ్గడం వల్ల అసౌకర్యంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో కొన్ని రకాల హోం రెమెడీస్ వాడటం మంచిది. ఇవి దగ్గు నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. అంతే కాకుండా త్వరగా దగ్గును తగ్గించడంలో సహాయపడతాయి.


సాధారణంగా 2-3 రోజుల్లో దగ్గు తగ్గకపోతే చాలా మంది మందులను వాడుతుంటారు. మందులు వాడినా కూడా పొడి దగ్గు చాలా రోజుల వరకు తగ్గదు. ఇలాంటి సమయంలో కొన్ని రకాల హోం రెమెడీస్ వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మరి త్వరగా దగ్గు తగ్గడానికి ఎలాంటి హోం రెమెడీస్ ఉపయోగపడతాయి .. వాటిని ఎలా తయారు చేసుకోవాలనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. తేనె, అల్లం : తేనె, అల్లం మిశ్రమం దగ్గును తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.


దగ్గు తగ్గడం కోసం తాజా అల్లం మిక్సీ చేసి దాని నుంచి రసం తీయండి. అందులో ఒక చెంచా తేనె వేసి రోజుకు 2-3 సార్లు తినాలి. ఇది పొడి, శ్లేష్మంతో వచ్చే దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. తరుచుగా దగ్గు సమస్యతో ఇబ్బంది పడే వారు దీనిని వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

2. పసుపు ,పాలు: పసుపులో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇది ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడుతుంది. పసుపు పాలు దగ్గును తగ్గించడంలో చాలా బాగా ఉపయోగసపడుతుంది.

ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో అర టీస్పూన్ పసుపు కలపాలి. రాత్రి పడుకునే ముందు దీన్ని తాగండి. ఇది గొంతు నొప్పి నుండి ఉపశమనాన్ని అందిస్తుంది . అంతే కాకుండా దగ్గును కూడా తగ్గిస్తుంది. ప్రతి రోజు పసుపు కలిపిన పాలు తాగడం వల్ల కూడా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతే కాకుండా శరీరం వైరల్ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండేందుకు పసుపు కలిపిన పాలు ఎంతగానో ఉపయోగపడతాయి. తరుచుగా దగ్గు సమస్యతో ఇబ్బంది పడే వారు పసుపు పాలు తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

3. తులసి, తేనె టీ: ఆయుర్వేద వైద్యంలో తులసిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. తులసి సమర్థవంతమైన ఔషధంగా ప్రసిద్ధి చెందింది. తులసి ఆకులలో యాంటీ బాక్టీరియల్‌తో పాటు యాంటీవైరల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి.

5-6 తులసి ఆకులను గ్లాస్ నీటిలో వేసి మరిగించండి. అందులో కొద్దిగా అల్లం, తేనె మిక్స్ చేసి రోజుకు 2-3 సార్లు త్రాగాలి. ఇది దగ్గు, గొంతు నొప్పి నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. అంతే కాకుండా రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అల్లం జీర్ణ క్రియ సక్రమంగా పనిచేయడంలో ఉపయోగపడుతుంది.

Also Read: ఎముకలు ఆరోగ్యంగా, బలంగా ఉండాలంటే చేయాల్సినవి ఇవే !

4. ఆవిరి: దగ్గు, జలుబుతో ఇబ్బంది పడుతున్న సమయంలో ఆవిరి తీసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది గొంతు వాపును తగ్గిస్తుంది.అంతే కాకుండా బ్లాక్ అయిన ముక్కు, ఛాతీలో పేరుకుపోయిన శ్లేష్మంను బయటకు తెస్తుంది.

ఒక పెద్ద పాత్రలో సగం వరకు నీటిని వేసి వేడి చేయండి. తర్వాత మీ తలను టవల్‌తో కప్పి ఆవిరి తీసుకోండి.ఇది శ్లేష్మంతో గొంతు వాపు, దగ్గును తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.

గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే వీటిని పాటించాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Multani Mitti: ముల్తానీ మిట్టితో క్షణాల్లోనే.. గ్లోయింగ్ స్కిన్

Relationships: మీరు మీ జీవిత భాగస్వామితో మాట్లాడకూడని కొన్ని విషయాలు ఇవిగో, వీటిని మాట్లాడితే బంధానికి బీటలే

Anga Tribe: మరణించిన వారిని ఇంకా మమ్మీలుగా మారుస్తున్న తెగ, ఎలా మారుస్తారో తెలిస్తే అవాక్కయిపోతారు

Home Remedies For Hair: ఇవి వాడితే.. వద్దన్నా జుట్టు పెరుగుతుంది తెలుసా ?

Dates For Hair: ఇలా చేస్తే చాలు.. జుట్టు రాలడం ఆగిపోతుంది తెలుసా ?

Homemade Rose Water: ఇంట్లోనే రోజ్ వాటర్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసా ?

Big Stories

×