EPAPER

Olive Oil: రోజూ అర స్పూన్ ఆలివ్ ఆయిల్ తాగితే.. ఆ ప్రాణాంతక వ్యాధి పరార్

Olive Oil: రోజూ అర స్పూన్ ఆలివ్ ఆయిల్ తాగితే.. ఆ ప్రాణాంతక వ్యాధి పరార్

Olive Oil Health Benifits: ఆలివ్ ఆయిల్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎన్నో ఔషధ గుణాలతో పాటు పోషక విలువలను కలిగి ఉంటుంది. ఇతర ఆయిల్స్ తో పోల్చితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ నేపథ్యంలో ఆలివ్ ఆయిల్ గురించి పలువురు పరిశోధకులు కీలక విషయాలు వెల్లడించారు. ఈ ఆయిల్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ప్రాణాంతక వ్యాధుల నుంచి బయటపడే అవకాశం ఉందంటున్నారు. అల్జీమర్స్ లాంటి సమస్యలను దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు వెల్లడించారు.


గుండెకు మేలు, అల్జీమర్స్ మాయం

అరుదుగా ఆలివ్ ఆయిల్ తినే వారితో పోల్చితే రెగ్యులర్ గా తినేవాళ్లలో అల్జీమర్స్ రిస్క్ 28 శాతం తక్కువగా ఉన్నట్లు బ్రిటీష్ పరిశోధకులు వెల్లడించారు. రోజూ ఒక టీస్పూన్ ఆలివ్ ఆయిల్ తీసుకోవడం వల్ల అల్జీమర్స్ మరణాల సంఖ్య 8 శాతం తగ్గినట్లు గుర్తించారు. అటు అమెరికా పరిశోధకులు నిర్వహించిన స్టడీలోనూ ఆలివ్ ఆయిల్ తో ప్రాణాంతక వ్యాధులు మాయం అవుతున్నట్లు గుర్తించారు. మొత్తంగా 92 వేల మంది నుంచి వివరాలను సేకరించారు. వీరిలో 28 సంవత్సరాల నుంచి 56 ఏండ్ల మధ్య వయసు వాళ్లే ఉన్నారు. ఆలివ్ ఆయిల్ లోని యాంటీ ఆక్సిడెంట్,  యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు.  పురుషులతో పోల్చితే స్త్రీలలో ఆరోగ్య సమస్యలు మరింత తగ్గినట్లు గుర్తించారు. ఆలివ్ ఆయిల్ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో మరింత కీలక పాత్ర పోషిస్తుందని  బ్రిటీష్ వైద్య నిపుణుడు డాక్టర్ థియోడర్ డాల్రింపుల్ వెల్లడించారు. యుకెలో డిమెన్షియా, అల్జీమర్స్ తో చాలా మంది మహిళలు చనిపోతున్నారని, ఆలివ్ ఆయిల్ తో చాలా వరకు మరణాలను అడ్డుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. పురుషులలో కొరోనరీ హార్ట్ డిసీజెస్ కూడా ఆలివ్ ఆయిల్ తో తగ్గించుకునే అవకాశం ఉందన్నారు.


ఆలీవ్ ఆయిల్ తో బోలెడు లాభాలు

రెగ్యులర్ గా ఆలివ్ ఆయిల్ తీసుకోవడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. పరగడుపున కాస్త ఆలివ్ ఆయిల్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ ముప్పును తప్పించుకునే అవకాశం ఉంటుంది.  మృదువైన చర్మం, ఆరోగ్యకరమైన జుట్టు, బలమైన ఎములకు ఆలివ్ ఆయిల్ ఎంతగానో సాయపడుతుంది. ఆలివ్ ఆయిల్ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కాలేయంలోని విష పదార్థాలను సమర్థవంతంగా బయటకు పంపిస్తుంది. రోజూ నిమ్మరసంలో కాస్త ఆలివ్ ఆయిల్ కలుపుకుని తాగితే లివర్ క్లీన్ అవుతుంది. ఆలివ్ ఆయిల్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను కరిగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఊబకాయం ఉన్నవాళ్లు ఆలివ్ ఆయిల్ తీసుకోవడం వల్ల ఈజీగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. అంతేకాదు, రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో ఆలివ్ ఆయిల్ సాయపడుతుంది. బాడీలో షుగర్ లెవల్స్ తగ్గించడంతో పాటు రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ను తొలగించడంలో సాయపడుతుంది. మనిషి ఆరోగ్యాన్ని కాపాడ్డంలో ఆలివ్ ఆయిల్ కీలక పాత్ర వహిస్తుందని నిపుణులు చెప్తున్నారు.

Read Also: కలిసిన పావుగంటకే ముద్దు అడిగాడు, ఆ తర్వాత.. అమ్మాయి ఫస్ట్ డేట్ అనుభవాలు..

Related News

Yoga For Back Pain: ఏం చేసినా నడుము నొప్పి తగ్గడం లేదా ? వీటితో క్షణాల్లోనే దూరం

Health Tips: నీరు సరిపడా త్రాగకపోతే ఎంత ప్రమాదమో తెలుసా ?

Urine: మూత్రం ఆ రంగులో వస్తుందా? ప్రాణాలు పోతాయ్ జాగ్రత్త!

Viagra Sales: వయాగ్రా.. తెగ వాడేస్తున్నారు, ఇండియాలో భారీగా పెరిగిన సేల్స్.. గణంకాలు చూస్తే షాకవుతారు..

Moringa Powder: మునగ ఆకు పొడితో అద్భుతాలు..ఈ రోగాలన్నీ పరార్ !

Multani Mitti: ముల్తానీ మిట్టితో క్షణాల్లోనే.. గ్లోయింగ్ స్కిన్

Big Stories

×