EPAPER

Cholesterol: చపాతీను ఇలా తింటే కొలస్ట్రాల్ ఇట్టే మాయం అవుతుంది..

Cholesterol: చపాతీను ఇలా తింటే కొలస్ట్రాల్ ఇట్టే మాయం అవుతుంది..

Cholesterol: మారుతున్న జీవనశైలితో పాటు ఆహారపు అలవాట్లు కూడా మారిపోతున్నాయి. పనుల్లో బిజీగా ఉంటూ బయట దొరికే ఫుడ్ తింటూ అనారోగ్య సమస్యలు, ఊబకాయం వంటి విచిత్ర సమస్యల బారిన పడుతుంటారు. ఈ తరుణంలో కొంత మంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి మంచి డైట్ పాటిస్తుంటారు. అందులో భాగంగా రోటిని తినడం అలవాటు చేసుకుంటారు. ఇది కేవలం యువత మాత్రమే కాకుండా, వయసు పైబడిన వారు కూడా అధిక రక్తపోటు, గుండె సమస్యలు, మధుమేహం వంటి చాలా రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. అందువల్ల తరచూ చపాతీ తినడం వల్ల ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు.


ముఖ్యంగా శరీరంలోని కొలస్ట్రాల్ వంటి సమస్యలను తగ్గించుకునేందుకు చపాతీ అద్భుతంగా పనిచేస్తుంది. గోధుమ పిండితో తయారు చేసిన చపాతీలు, జొన్న రొట్టెలు, రాగి రొట్టెలు వంటివి తినడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. అయితే గోధుమ పిండితో తయారు చేసే రొట్టెల్లో సాధారణంగా పిండి, ఉప్పు, నూనె, నీళ్లు కలిపి తయారుచేసిన పిండితో చపాతీలను తయారుచేస్తుంటాం. అయితే చపాతీ పిండితో తయారుచేసిన రోట్టెలను తినడం వల్ల శరీరంలో కొలస్ట్రాల్ ఇట్టే తగ్గించుకోవచ్చు.

రక్తంలో కొలస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవడానికి ప్రతి రోజూ గోధుమ పిండితో తయారుచేసే రొట్టెల్లో ఓట్ పిండిని కలిపి చపాతీలను తయారుచేసుకోవాలి. ఓట్స్‌లో అధిక ఫైబర్ ఉండడం వల్ల ఇవి రక్తంలోని కొలస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. అంతేకాదు ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు, అధిక రక్తపోటు వంటి సమస్యలను తొలగిస్తాయి. ఓట్ మీల్ లో ఉండే ఫైబర్, గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి వాటిని కూడా దూరం చేస్తుంది. మరోవైపు ఓట్స్ లో ఉండే బీటా గ్లూకోన్ శరీరంలోని బరువును తగ్గించేందుకు సహాయపడుతుంది.


Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×