EPAPER

Fast Eating : త్వరగా తింటే ఏమోతుందో తెలుసా..?

Fast Eating : త్వరగా తింటే ఏమోతుందో తెలుసా..?

Fast Eating Side Effects : మనం ఎంత మంచి ఆహారం తింటున్నామనేది కాదు.. ఎలా తింటున్నామనేది చాలా ముఖ్యం. చాలా మంది ఆహారాన్ని హడావుడిగా తినేసి వెళ్తుంటారు. ఇలా తినడం అనేది మన ఆరోగ్యానికి అసలు మంచిది కాదు. తినడంతో పాటు నమలడం కూడా చాలా ముఖ్యం. ఆహారాన్ని సరిగా నమలకుండా త్వరగా తినడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.


ఆహారం మనిషి జీవితంలో చాలా ముఖ్యమైనది. ఆహారం లేకుండా మనిషికి జీవితమే లేదు. ఎంత పనిచేసినా కడుపు కోసమే. ఆహారాన్ని ఆశ్వాధిస్తూ తినాలి. మంచి టేస్ట్ ఉంది కదా అని గాబరగా తినొద్దు. మెల్ల మెల్లగా నమిలి తినాలి. అప్పుడే అది మీ శరీరానికి ఉపయోగపడుతుంది. మనం తినే ఆహారం తొందరపడకుండా ప్రశాంతంగా హాయిగా తినాలి.

Read More : ఏడాదికి ఒక్కసారి ఈ రక్త పరీక్షలు తప్పనిసరి..!


మనలో చాలా మంది ఆహారాన్ని త్వరత్వరగా తింటుంటారు. అలానే కాఫీ, టీ కూడా వేగంగా తాగుతుంటారు. ఎవరో వెనకాల నుంచి తరుముతున్నట్టుగా తింటారు. ఇలా చేయడం వల్ల సమయం ఆదా అవుతుందని భావిస్తుంటారు. కానీ మీ ఆరోగ్యం పాడవుతుందని నిపుణులు చెబుతున్నారు.

తొందరపడి తినడం వల్ల త్వరగా బరువు పెరుగుతారు. వేగంగా తినడం వల్ల మీరు ఆహారాన్ని సరిగ్గా నమలలేరు. నమలకుండా కడుపులోకి చేరిన ఆహారం సరిగా జీర్ణం కాదు. దీని వల్ల శరీర బరువు చాలా సులభంగా పెరుగుతుంది.

అలానే వేగంగా తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీని వల్ల గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఆహారాన్ని వీలైనంత నెమ్మదిగా తినడానికి ప్రయత్నించండి. అప్పుడే మీ శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.

Read More : మీరు టీవీ చూస్తూ తింటున్నారా..?

త్వరగా తినడం వల్ల లాలాజలం సరిగ్గా కలిసిపోదు. ఇది కడుపు నొప్పి, అజీర్ణం, ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం కలిగిస్తుంది. సరిగా నమలకుండా తింటే మొత్తం ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. నిపుణులు కూడా ఆహారాన్ని బాగా నమిలి తినాలని చెబుతున్నారు.

వేగంగా తినడం వల్ల చాలా మంది ఎదుర్కొనే ప్రధాన సమస్య సరిగా జీర్ణం కాకపోడవం. దీనితో గ్యాస్ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. దీనివల్ల వచ్చే ప్రధాన సమస్యలు చాలా ఉంటాయి. కాబట్టి గ్యాస్ సమస్య రాకుండా ఆహారాన్ని సరిగా నమిలి తినాలి.

Disclaimer : ఈ కథనం పలు అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ ఆధారంగా సేకరించిన సమాచారం మాత్రమే.

Related News

Hair Care Tips: జుట్టు సమస్యలన్నింటికీ చెక్ పెట్టండిలా !

Tips For Skin Glow: క్షణాల్లోనే మీ ముఖాన్ని అందంగా మార్చే టిప్స్ !

Yoga For Stress Release: ఒత్తిడి తగ్గేందుకు ఈ యోగాసనాలు చేయండి

Throat Infection: గొంతు నొప్పిని ఈజీగా తగ్గించే డ్రింక్స్ ఇవే..

Skin Care Tips: గ్లోయింగ్ స్కిన్ కోసం.. ఇంట్లోనే ఈ ఫేస్ ప్యాక్స్ ట్రై చేయండి

Sweets: స్వీట్లు ఇష్టపడేవారు ఈ సమయంలో తింటే అన్నీ సమస్యలే..!

Coffee For Glowing Skin: కాఫీ పౌడర్‌లో ఇవి కలిపి ఫేస్‌ప్యాక్ వేస్తే.. మీ ముఖం మెరిసిపోవడం ఖాయం

Big Stories

×