EPAPER

Coriander Juice Benefits: ప్రతీరోజూ కొత్తిమీర జ్యూస్‌ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..

Coriander Juice Benefits: ప్రతీరోజూ కొత్తిమీర జ్యూస్‌ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..

Coriander Juice Benefits: ప్రతీ వంటల్లో కొత్తిమీరను వేయకుండా ఆ వంట పూర్తికాదు. కొత్తిమీరతోనే ఏ వంట అయినా రుచిగా మారుతుంది అంటే నిజమే అంటారు మహిళలు. గుమగుమలాగే కూరలు చేయాలంటే దానిలో చివరికి కొత్తిమీరను యాడ్ చేస్తేనే దానికి అనుకున్నదానికంటే అద్భుతమైన రుచి తోడవుతుంది. అయితే ప్రతీ ఆహార పదార్థాలలో ఏదో ఒక విధమైన లాభం అనేది ఉంటుంది. అందులో ముఖ్యంగా కొత్తిమీరతో కూడా ఆరోగ్యానికి చాలా రకాల లాభాలు ఉంటాయి. ముఖ్యంగా కిడ్నీల సమస్యతో బాధపడే వారికి కొత్తిమీర ఓ ఔషధంలా పనిచేస్తుంది.


కొత్తిమీరలో ఉంటే యాంటీ మైక్రోబయల్, యాంటీ మ్యూటాజెనిక్, యాంటీ ఇన్ప్లమేరటీ లక్షణాలు మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తాయి. అంతేకాదు డయేరియాకు కూడా కారణమయ్యే బ్యాక్టీరియాను కూడా నాశనం చేయడంలో తోడ్పడతాయి. అయితే కొత్తిమీర ఆకుతో తయారు చేసిన జ్యూస్ ను తరచూ త్రాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుంది. వీటి ఆకులతో తయారు చేసిన జ్యూస్ ను ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల గ్యాస్ వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి.

కొత్తిమీర ఆకులతో తయారుచేసిన నీటిని తాగడం వల్ల రోగనిరోధక శక్తిని కూడా పెంపొందించుకోవచ్చు. కొత్తిమీరలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని బలోపేతయం చేయడానికి ఎంతగానో తోడ్పడుతుంది. ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి కూడా కొత్తిమీర నీటిని తీసుకోవడం ల్ల కొలస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవచ్చు. శరీర నిర్విషీకరణ ప్రక్రియలో భాగంగా యాంటీఆక్సిండెంట్లు కూడా తోడ్పడతాయి. కీళ్ల వాపు, నొప్పుల నుంచి ఉపశమనం కలిగించేందుకు సహాయపడుతుంది.


కొత్తిమీర జ్యూస్ తయారీ విధానం :

కొత్తిమీర జ్యూస్ తయారు చేసుకోవడానికి కొత్తిమీర, ఒక నిమ్మకాయ, ఉప్పు, నీరును ఉపయోగించాల్సి ఉంటుంది. కొత్తమీర రసం తయారీలో భాగంగా ముందుగా కొత్తిమీరను శుభ్రంగా వాష్ చేసుకోవాలి. అనంతరం దానిని కట్ చేసి గ్రైండ్ చేయాలి. అందులో నిమ్మరసం, ఉప్పు వేసి కలపాలి. ఇలా చేయడం వ్లల కొత్తిమీర రసం తయారవుతుంది. దీనిని ప్రతీరోజూ పరిగడుపున తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

Related News

Relationships: మీ మాజీ లవర్‌తో ఇప్పటికీ స్నేహంగా ఉంటున్నారా? ఇది మంచి ఆలోచనేనా?

Amla Rice: ఉసిరికాయ అన్నం ఇలా చేసుకొని తింటే లంచ్ బాక్స్‌కు బాగుంటుంది, ఇది ఎంతో ఆరోగ్యం కూడా

Youthful Glow: ఎప్పటికీ యవ్వనంగా ఉండాలా? డైలీ, ఈ యాంటీ ఏజింగ్ ఫుడ్స్ తింటే చాలు.. వయస్సే తెలియదు

Rice Water: గంజి వచ్చేలా అన్నం వండి ఆ గంజినీళ్లను ప్రతిరోజూ తాగండి, మీరు ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి

Thyroid: వీటితో ఇంట్లోనే థైరాయిడ్‌కు చెక్ !

Hair Spa: ఇంట్లోనే హెయిర్ స్పా.. ఎలా చేసుకోవాలో తెలుసా ?

Henna For Hair: జుట్టుకు హెన్నా పెడుతున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

Big Stories

×