EPAPER

Dinner: తరచూ రాత్రి ఇలా భోజనం చేస్తే ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో తెలుసా.. !

Dinner: తరచూ రాత్రి ఇలా భోజనం చేస్తే ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో తెలుసా.. !

Dinner: సాధారణంగా అందరూ తరచూ రాత్రి వేళ భోజనం చేయడానికే ఇష్టపడుతుంటారు. కొంత మంది బరువు తగ్గడానికి చపాతీలు తినడానికి ట్రై చేస్తుంటారు. కానీ కొంత మంది ఆకలికి ఉండలేక కేవలం ఆహారం మాత్రమే తీసుకుంటూ ఉంటారు. ఈ తరుణంలో ఎప్పుడు పడితే అప్పుడు తినేస్తుంటారు. కానీ రాత్రి వేళ భోజనం చేయడం కోసం పలు జాగ్రత్తలు తీసుకోవాలి. బరువు పెరుగుతారని భోజనం తినకపోవడం తప్పని, రాత్రి వేళ భోజనం తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆ ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.


ప్రస్తుతం ఉన్న కాలంలో ఆరోగ్యంగా ఉండడం అంటే పెద్ద సమస్యగా మారిపోయింది. ఎక్కడ చూసినా మంచి పోషకాలు కలిగిన ఆహారం కంటే అనారోగ్య సమస్యలకు గురిచేసే ఆహారాన్నే తినాల్సి వస్తుంది. అయితే చాలా మంది తరచూ రాత్రి వేళ భోజనం చేయడానికి సందేహ పడుతుంటారు. మరోవైపు రాత్రి వేళ భోజనం చేయాలి అనుకునే వారు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే రాత్రి భోజనంతో చాలా ప్రయోజనాలు పొందుతారని నిపుణులు సూచిస్తున్నారు. రాత్రి వేళ భోజనం చేయాలని అనుకునేవారు 7 గంటల లోపే తినాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఫిట్ గా, బరువు పెరగకుండా, ఆరోగ్యంగా ఉంటారట.

రాత్రి వేళ ఆహారం ఎక్కువగా తీసుకుంటే జీర్ణ సమస్యలు ఎదురవుతాయి. అందువల్ల తేలికపాటి ఆహారాన్ని అది కూడా రాత్రి 7 గంటల లోపే తీసుకోవాల్సి ఉంటుంది. 7 గంటల సమయం తర్వాత భోజనం చేయడం వల్ల మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే 7 గంటల సమయంలో భోజనం చేయడానికి కూడా కారణాలు ఉన్నాయి. నిద్రించే సమయానికి దాదాపు 3 గంటల ముందు భోజనం చేస్తే ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది.


ఇలా తరచూ రాత్రి 7 గంటల సమయానికి భోజనం చేస్తే బరువు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాదు రాత్రి నిద్రకూడా సరిగా పోవచ్చు. దీని కారణంగా రక్తంలోని చక్కెర స్థాయిలు, రక్తపోటును నియంత్రించడం వంటి చాలా వాటిని కంట్రోల్ చేయవచ్చు. భోజనం చేసిన తర్వాత కాసేపు వాకింగ్ చేయాలి. ఇలా చేస్తే ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. ముఖ్యంగా గుండె జబ్బులు వంటి సమస్యలు ఉన్న వారు ఈ నియమాలను పాటించాల్సి ఉంటుంది.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Multani Mitti Face Pack:ముల్తానీ మిట్టితో స్మూత్, గ్లోయింగ్ స్కిన్..

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Big Stories

×