EPAPER

Mirchi: మిరపకాయలకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..? అందుకు మిరియాలే కారణమంటా..

Mirchi: మిరపకాయలకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..? అందుకు మిరియాలే కారణమంటా..

Mirchi or Chili: మిరపకాయలు.. వీటి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీటి గురించి అందరికీ సుపరిచితమే. బహుశా మన దేశంలో మిరపకాయల గురించి తెలియని వారుండరేమో. ఎందుకంటే.. ఏ ఇంటిలోనైనా కారం మస్ట్ గా ఉంటుంది. ఇది లేకుండా వంట ఇంపాజిబుల్. అవును.. ప్రతి వంటకంలోనూ మిరపకాయలను లేదా కారంపొడిని వాడుతుంటారు. కూరలో కారం కొద్దిగా ఎక్కువైతే చాలు అబ్బా.. కారం ఎక్కువైందని చెబుతుంటారు. తక్కువైతే కారం తక్కువైందీ కూర టేస్టీగా లేదంటుంటారు. ఇలా ఒక్కటేమిటీ.. వంటలకు మిరపకాయలకు ప్రత్యేక అనుబంధం ఉంది. అందుకే మిరపకాయలు లేదా కారంపొడి లేకుండా వంటలు అంటే కష్టమనే చెప్పాలి. అయితే, మిరపకాయల గురించి మీకు పలు వాస్తవాలు తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. అవును.. ఎందుకంటే.. అసలు మిరపకాయ ఏ దేశానికి చెందిన పంట..? వీటిని మొదటగా ఎక్కడా వినియోగించారు అని అంటే చాలామంది అదేంటి..? మన ఇండియాలోనే కదా..! అంటూ సమాధానం చెబుతారు. కానీ, అసలు విషయాలు తెలిస్తే షాకవుతారు.


Also Read: ఖర్జూర, పాలు కలిపి తింటే బోలెడు ప్రయోజనాలు

కూరగాయలలో మిరపకాయలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. మన దేశంలో మిరపకాయల రైతులు చాలామంది ఉంటారు. వారు మిరప పంటలను సాగు చేస్తూ లాభాలు గడిస్తుంటారు. మనం ఎక్కడ కూరగాయల మార్కెట్ చూసినా.. లేదా కూరగాయలమ్మేవారిని చూసినా వారి వద్ద ఖచ్చితంగా మిరపకాయలు ఉంటాయి. వాటిని అమ్ముతుంటారు. ఎందుకంటే ఎవరైనా కూడా ఏ కూరగాయలు తీసుకున్నా.. మిర్చీని ఖచ్చితంగా తీసుకుంటారు కాబట్టి. అయితే, చాలామందికి మిరపకాయలకు ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉందని తెలియదు. అదేమంటే.. అసలు మిరపకాయలు మన దేశానికి చెందిన పంట కాదని, అప్పట్లో మన దేశంలో మిరపకాయలు ఉండేవి కావని చాలామందికి తెలియదు.  దేశంలో ఎక్కడా చూసినా విరివిగా మిరపకాయలు కనిపించడం.. వాటిని విరివిగా ఉపయోగించడం వంటి వల్ల అది మన దేశానికి చెందినదే అని భావిస్తుంటారు. కానీ, అసలు విషయమేమంటే.. మిరప కాయలను ఇతర దేశస్థులు మన దేశానికి పరిచయం చేశారు. అప్పటి నుంచి ఈ మిరపకాయలు అలవాటుగా మారిపోయాయి. పోర్చుగీస్ వారు మన దేశానికి ఈ మిరపకాయలను పరిచయం చేశారు. వారి దేశం నుంచి వాటిని ఇన్ పుట్ చేసుకునేవారు.. వాటిని ఇక్కడ పండించేవారంటా. అలా ఈ మిరపకాయలు ఇండియాకు పరిచయమయ్యాయంటా. అప్పటి నుంచి భారతీయులు మిరపకాయలను వాడుతున్నారంటా.


మిరపకాయలకు ఆ పేరు ఎలా వచ్చిందంటే..?

అయితే, మిరపకాయలను వాడుతున్నారు.. కానీ, వాటికి ఆ పేరు ఎలా వచ్చిందనేదానికి కూడా ఒక రీజన్ ఉందంటా. అందుకు మన దేశంలో లభించే మిరియాలే కారణమంటా. మిరపకాయల ఉపయోగం ప్రారంభమైనప్పుడు వాటిని ఏమని పిలువాలో అనేది కొంత సందిగ్ధంలో ఉండేదంటా. ఈ క్రమంలో వారికి మిరియాలే గుర్తొచ్చాయంటా. ఎందుకంటే.. మిరియాలు కూడా కారంగా ఉంటాయి కాబట్టి. దీంతో ఆ మిరియాలకు ఉన్న పేరును వీటికి మిరపకాయలు అనే నామకరం చేశారంటా. అలా అప్పటి నుంచి వాటిని మిరపకాయలుగా పిలుస్తున్నారంటా.

మిరపకాయలు మన దేశానికి పరిచయం కాకముందు ఏం వాడారనే సందేహం కూడా మీలో కలుగొచ్చు. దానికి కూడా ఓ ఆన్సర్ ఉంది. అదేమంటే.. మిరియాలను వాడేవారంటా. కారంకు బదులు వీటినే వాడేవారంటా. ఎందుకంటే మిరియాలు కూడా ఘాటుగా ఉంటాయి కాబట్టి. ఈ మిరియాల స్థానంలో మిరపకాయలు వచ్చాక వాటి వాడకం కొంతవరకు తగ్గింది. ఇప్పుడు కొన్ని ప్రత్యేక వంటకాల్లో మాత్రమే మిరియాలను వాడుతుంటారు. లేదా ఇతర విధాలుగా వాడుతుంటారు. కానీ, మిరపకాయలంతా విరివిగా వినియోగించడంలేదు.

Also Read: రాక్ సాల్ట్‌తో జీర్ణ సమస్యలు దూరం.. మరెన్నో ప్రయోజనాలు

మిరపకాయలను రెండు రకాలుగా పిలుస్తారు. ఎండు మిరపకాయలు.. పచ్చి మిరపకాయలు అని. పలు ప్రాంతాల్లో రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. గుంటూరు మిరప, కేరళ కన్సారీ మిరప, భూతం మిరపకాయ, కశ్మీరి మిరప.. ఇలా ప్రాంతాలను బట్టి పిలుస్తుంటారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో మిరపకాయ పంటకు ఒక్కో ప్రత్యేకత ఉంది. మిరప కాయలను కేవలం వంటకాలకే కాదు.. పలు పదార్థాల తయారీలో కూడా ఉపయోగిస్తుంటారు. ఇండియాలో మిరపకాయలు ఎంతలా ప్రాచుర్యం పొందాయంటే.. మిరపకాయలు తినే పోటీలు కూడా నిర్వహించే వరకు వెళ్లింది. ఇదీ.. మిరపకాయల వెనుక అసలు స్టోరీ.

Related News

Roadside Book Stores: రోడ్లపై పుస్తకాలు అమ్మితే.. ఏం వస్తుంది…?

Murine Typhus: అమ్మో దోమ.. కేరళలో కొత్త రోగం, ఈ అరుదైన వ్యాధి సోకితే ఏమవుతుందో తెలుసా?

Coffee Benefits: మిరాకిల్.. రెండు కప్పుల కాఫీతో ఇన్ని బెనిఫిట్సా? మీరు నమ్మలేరు!

Tips For Pregnant Women: గర్భిణీలు ఈ పోషకాహారం తింటే తల్లీ, బిడ్డా ఆరోగ్యంగా ఉంటారు

Heart Disease: మహిళలకు గుండె జబ్బులు తక్కువ వస్తాయి ?.. ఎందుకో కారణాలు తెలిస్తే షాక్ అవుతారు

Type 1 Diabetes: అరగంటలో టైప్ 1 డయాబెటిస్ మాయం, వైద్య రంగంలో పరిశోధకుల అద్భుతం

Big Stories

×