EPAPER
Kirrak Couples Episode 1

Vitamin deficiency: మీకు విపరీతంగా జుట్టు రాలిపోతుందా? అయితే ఈ విటమిన్ల లోపం ఉన్నట్టే, వీటిని తినండి

Vitamin deficiency: మీకు విపరీతంగా జుట్టు రాలిపోతుందా? అయితే ఈ విటమిన్ల లోపం ఉన్నట్టే, వీటిని తినండి

Vitamin deficiency: జుట్టు రాలడం అనేది ఇప్పుడు యువతను ఎక్కువగా బాధిస్తున్న సమస్య. ఒత్తిడి వల్ల కొన్ని ఆరోగ్య పరిస్థితుల వల్ల విపరీతంగా జుట్టు రాలిపోతుంది. అలాగే పోషకాహార లోపం వల్ల జుట్టు రాలే సమస్య అధికంగానే ఉంది. ముఖ్యంగా విటమిన్ల లోపం జుట్టు రాలడానికి కారణం అవుతుంది. విటమిన్లలో జుట్టు పెరుగుదలకు ఉపయోగపడేది విటమిన్ డి. ఎప్పుడైతే మీలో ఈ విటమిన్ లోపిస్తుందో జుట్టు పెరిగే ప్రక్రియ మందగిస్తుంది. కాబట్టి మీరు తినే ఆహారంలో విటమిన్ డి ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి.


విటమిన్ డి ఎందుకు?

ఆరోగ్యకరమైన హెయిర్ ఫోలికల్స్‌కు విటమిన్ డి చాలా అవసరం. హెయిర్ ఫోలికల్స్ ఎంత ఆరోగ్యంగా ఉంటే జుట్టు అంత అందంగా పెరుగుతుంది. విటమిన్ డి లోపం వల్ల వెంట్రుకలు రాలిపోతాయి. కాబట్టి హెయిర్ ఫోలికల్స్ అభివృద్ధికి సహాయపడే విటమిన్ డి ఉన్న ఆహారాన్ని అధికంగా తీసుకోవాలి. ఎప్పుడైతే మీ శరీరంలో విటమిన్ డి తక్కువ స్థాయిలో ఉంటుందో జుట్టు రాలడం అనేది క్రమేపీ కొనసాగుతూనే ఉంటుంది. కొన్నాళ్లకు అది బట్టతలగా కూడా మారిపోవచ్చు. కాబట్టి ముందు నుంచే జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. విటమిన్ డి ఉండే ఆహారాలు సాల్మన్ చేపలు, మాకెరెల్ చేపలు, పాల ఉత్పత్తులు, గుడ్లు వంటివి. వీటిని తినడం ద్వారా విటమిన్ డి పొందవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా రోజుల్లో కనీసం 20 నిమిషాల పాటు ఉదయపు ఎండలో నిలుచోండి. మీకు కావలసినంత విటమిన్ డి లభిస్తుంది.


విటమిన్ ఏ

విటమిన్ ఏ మన శరీరానికి అత్యవసరమైన పోషకం. అలాగే జుట్టు పెరుగుదలకు కూడా ముఖ్యమైనది. తలపై ఉండే మాడు ఆరోగ్యంగా ఉంటేనే జుట్టు బాగా పెరుగుతుంది. ఆ మాడును ఆరోగ్యంగా ఉంచే శక్తి విటమిన్ ఏకు ఉంది. విటమిన్ ఏ సెబమ్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కాస్త జిడ్డుగా ఉండే పదార్థం. తలను హైడ్రేటెడ్ గా ఉంచడానికి ఇది ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే విటమిన్ ఏ లోపిస్తుందో మాడు పొడిబారిపోయి జుట్టు రాలడం ఎక్కువవుతుంది. విటమిన్ ఏ అధికంగా ఉండే ఆహారాలను తినడం ద్వారా జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు. ఇందుకోసం మీరు పాల ఉత్పత్తులను తీసుకోవాలి. అలాగే క్యారెట్, టమోటో, చికెన్ లివర్, తృణధాన్యాలు, చిలగడదుంప, పాలకూర వంటివి ఎక్కువగా తింటూ ఉండాలి.

Also Read: ఇప్పటివరకు తిన్నది చాలు, ఇకపై టీ తాగుతూ బిస్కెట్లు తినడం మానేయండి, అది మీకే ప్రమాదం

విటమిన్ బి12

ఇది కూడా మన శరీరానికి అత్యవసరమైనదే. ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి ముఖ్యమైనది. అలాగే డిఎన్ఏ సంశ్లేషణలో ఉపయోగకరంగా ఉంటుంది. జుట్టు పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తుంది. విటమిన్ బి12 లోపిస్తే మనకు తీవ్రంగా అలసటగా అనిపిస్తుంది. అలాగే జుట్టు కూడా రాలిపోతూ ఉంటుంది. ఇది రక్తహీనతకు కూడా దారితీస్తుంది. నాడీ కణాల ఆరోగ్యానికి కూడా విటమిన్ బి12 చాలా అవసరం. కాబట్టి జుట్టు రాలడాన్ని ఆపాలంటే విటమిన్ బి12 ఉన్న ఆహారాన్ని అధికంగా తీసుకోండి. లీన్ ప్రోటీన్ ఉండే ఆహారాల్లో విటమిన్ బి12 ఉంటుంది. ఇందుకోసం మీరు మాంసం, పాల ఉత్పత్తులు, గుడ్లు అధికంగా తినాలి. మాంసం అనగానే అధిక కొవ్వు ఉన్న మాంసం జోలికి వెళ్ళకండి. లీన్ ప్రోటీన్ ఉండే చికెన్ తీసుకునేందుకు ప్రయత్నించండి.

విటమిన్ ఈ

విటమిన్ ఈ అనేది సౌందర్య విటమిన్ గా కూడా చెప్పుకోవచ్చు. జుట్టు పెరుగుదలకు చర్మం మెరుపుకు విటమిన్ ఇ చాలా ముఖ్యం. ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనం. తలపై ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన జుట్టును ప్రోత్సహిస్తుంది. ఫ్రీ రాడికల్స్ తో పోరాడే శక్తిని అందిస్తుంది. జుట్టును బలంగా మారుస్తుంది. హెయిర్ ఫోలికల్స్ దెబ్బతినకుండా కాపాడుతుంది. కాబట్టి అలాగే మాడులో రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. విటమిన్ ఈ కోసం మీరు బాదం, జీడిపప్పు, వాల్నట్స్, గుమ్మడి గింజలు వంటి వాటితో పాటు పాలకూర తినాలి.

 

Related News

Tomato Juice: టమాటా రసం తాగితే ఒంట్లో కొవ్వు ఇట్టే కరిగిపోతుంది..

Vitamin E Capsules: విటమిన్ ఇ క్యాప్సూల్స్‌లో మీ అందం రెట్టింపు

Weight Loss Tips: ఈజీగా బరువు తగ్గండిలా ?

Screen Strain Eye Health: ఎక్కువ సేపు స్మార్ట్ ఫోన్ చూడడంతో కంటి సమస్యలు.. ఈ సెటింగ్స్ తో మీ ఆరోగ్యం కాపాడుకోండి!

Tea and Biscuits: ఇప్పటివరకు తిన్నది చాలు, ఇకపై టీ తాగుతూ బిస్కెట్లు తినడం మానేయండి, అది మీకే ప్రమాదం

Cloves Health Benefits: లవంగాలతో మతిపోయే లాభాలు!

Big Stories

×