EPAPER

Chapped Lips : చలికి పెదాలు పగులకుండా ఇలా చేయండి

Chapped Lips : చలికి పెదాలు పగులకుండా ఇలా చేయండి
Chapped Lips

Chapped Lips : చలికాలంలో సాధారణంగా కనిపించే ప్రధాన సమస్య పెదాలు ఎండిపోవడం, పగలడం. పెదవులపై తేమలేక నిర్జీవంగా మారుతాయి. ఇలాంటి సందర్భాల్లో మన ఇంట్లో లభించే వస్తువులతో పెదాలకు పునర్జీవం కల్పించవచ్చని నిపుణులు చెబుతున్నారు. తేనెలో కొంచెం వ్యాజిలైన్‌ కలిపి ప్రతి రోజూ ఆ మిశ్రమాన్ని రాసుకుంటే పెదాలు అందంగా కనిపిస్తాయి.


ప్రతి రోజు రాత్రి నిద్రపోయే ముందు తేనెతో పెదాలపై మర్దన చేస్తే తేమను కోల్పోకుండా ఉంటాయి. శీతాకాలంలో మనకు ఎక్కువగా దాహం అనిపించదు. అయినా సరే ఎప్పటిలాగే శరీరానికి సరిపడా నీటిని తప్పకుండా తీసుకోవాలి. దాహం వేయకపోయినా సరే ప్రతి గంటకు గ్లాసు నీటిని తాగడం మంచిది. చలికాలంలో పెదాలకు అలోవెరా ఆయిల్, ఆలివ్ ఆయిల్స్‌ని రాసినా అద్భుతంగా పనిచేస్తాయి.

రాత్రి పడుకునే ముందుగా అలోవెరా ఆయిల్, ఆలివ్ ఆయిల్‌ను పెదాలకు రాసి పడుకోవాలి. ఉదయం వరకు మన పెదాలకు కావాల్సిన తేమ అందుతుంది. మిల్క్ క్రీమ్స్ వాడితే పెదవుల పగుళ్ల నుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా నెయ్యిని రోజూ రాత్రి సమయంలో పెదవులకు రాసుకోవాలి. స్నానానికి ముందు కొబ్బరి నూనె వాడినా బాగా పనిచేస్తుంది. చలికాలమంతా ఈ చిట్కాలు పాటించవచ్చు.


లిప్‌బామ్‌ను పెదాలకు రాసిన కాసేపటి తర్వాత టూత్‌బ్రష్‌తో సున్నితంగా రద్దాలి. ఆ తర్వాత శుభ్రమైన గుడ్డను వేడి నీటిలో ముంచి తుడుచుకోవాలి. మళ్లీ కాసేపటి తర్వాత ఇలాగే చేయాలి. దీంతో పెదాలు మృదువుగా అవుతాయి. కొన్ని దానిమ్మ గింజలను తీసుకొని జ్యూస్ తీసి ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవాలి. రోజూ కొద్దిగా ఆ జ్యూస్‌ను తీసుకుని కాటన్‌బాల్స్‌ ముంచి పెదాలపై సున్నితంగా మర్దన చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Related News

Hair Care Tips: జుట్టు సమస్యలన్నింటికీ చెక్ పెట్టండిలా !

Tips For Skin Glow: క్షణాల్లోనే మీ ముఖాన్ని అందంగా మార్చే టిప్స్ !

Yoga For Stress Release: ఒత్తిడి తగ్గేందుకు ఈ యోగాసనాలు చేయండి

Throat Infection: గొంతు నొప్పిని ఈజీగా తగ్గించే డ్రింక్స్ ఇవే..

Skin Care Tips: గ్లోయింగ్ స్కిన్ కోసం.. ఇంట్లోనే ఈ ఫేస్ ప్యాక్స్ ట్రై చేయండి

Sweets: స్వీట్లు ఇష్టపడేవారు ఈ సమయంలో తింటే అన్నీ సమస్యలే..!

Coffee For Glowing Skin: కాఫీ పౌడర్‌లో ఇవి కలిపి ఫేస్‌ప్యాక్ వేస్తే.. మీ ముఖం మెరిసిపోవడం ఖాయం

Big Stories

×