EPAPER

Online Shopping: ఆన్‌లైన్ షాపింగ్ ఎక్కువగా చేస్తున్నారా ? అయితే ఈ సమస్యలు తప్పవు

Online Shopping: ఆన్‌లైన్ షాపింగ్ ఎక్కువగా చేస్తున్నారా ?  అయితే ఈ సమస్యలు తప్పవు

Online Shopping: స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రాకముందు, ఇండియాకు అమెజాన్ పరిచయం కాకముందు ఏ వస్తువు కొనాలన్నా..మార్కెట్లో.. లేదంటే షాపులకు వెళ్లి కొనుక్కునే వారు. గతంలో అవసరం ఉన్న వాటిని మాత్రమే కొనుగోలు చేసేవారు. ఇంట్లో అవసరం లేని వస్తువుల గురించి పట్టించుకునే వారు కాదు. అయితే అప్పుడు ఉండే షాపులు కూడా అలానే ఉండేవి.


సూపర్ మార్కెట్లు, డీమార్ట్‌‌లు రావడంతో పెద్దగా అవసరం లేని సామాగ్రిని కూడా కొనుగోలు చేయడం చాలా మందికి అలవాటుగా మారిపోయింది. స్మార్ట్ ఫోన్లు చేతికి వచ్చినప్పటి నుంచి ఆన్‌లైన్ లో ఇష్టం వచ్చిన వస్తువులను కొనుగోలు చేయడం పరిపాటిగా మారింది. పదే పదే ఆన్‌లైన్ షాపింగ్ చేయడం కూడా సరికాదని నిపుణులు చెబుతున్నారు. దీన్ని ఆన్లైన్ షాపింగ్ అడిక్షన్, కంపల్సివ్ బయింగ్‌ డిజార్డర్ లేదా ఒమియో మానియా అంటారు.

ఆన్ లైన్ షాపింగ్ తరుచూ చేయడం వల్ల ఫైనాన్షియల్ ఇష్యూస్‌తో పాటు రిలేషన్స్ దెబ్బతినే ప్రమాదం ఉంది. ఆన్‌లైన్ షాపింగ్ తక్షణ ఆనందం ఇస్తుంది. కాబట్టి ఇది ఒక వ్యసనంగా మారుతోంది. డెలివరీ ప్యాకేజ్‌లు ఓపెన్ చేసినప్పుడు డోపమైన్ విడుదల చేస్తుందని దీంతో మరింత షాపింగ్ చేయాలనే ఫీలింగ్ కలుగుతోందని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా డోపమైన్ ప్లేజర్ కెమికల్ మాదకద్రవ్య దుర్వినియోగం లాంటి వ్యసనాన్ని సృష్టిస్తుందని హెచ్చరిస్తున్నారు.


షాపింగ్ అడిక్ట్:
షాపింగ్ కోసం ఈజీ యాక్సిస్ ఉండడం వల్ల మన ఖర్చులు పెరుగుతున్నాయి. సేల్స్ యాడ్స్ కూడా షాపింగ్ ఎక్కువ చేసేందుకు ప్రేరేపిస్తున్నాయి. అయితే ఆత్మనూన్యతతో బాధపడేవారు షాపింగ్ ఎక్కువగా చేసే ఛాన్స్ ఉంటుందట. ఒత్తిడి, నిరాశ, ఆందోళన లేదా ఒంటరితనం ఎదుర్కునేందుకు వారు షాపింగ్ ఎక్కువగా చేస్తారు. ఆన్ లైన్ షాపింగ్ మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అంతే కాకుండా ఆందోళన, ఆర్థిక సమస్యలు, డిప్రెషన్‌కు కారణమవుతుంది. ఇది తాత్కాలికంగా తృప్తినిచ్చినా..కానీ తర్వాత వ్యసనంగా మారి సామాజిక ఒంటరితనానికి దారితీస్తుంది.

Also Read: స్టైల్‌గా ఉంటుందని టాటూ వేసుకుంటున్నారా.. హెచ్ఐవీ, క్యాన్సర్ వస్తుంది జాగ్రత్త

ఎలా మార్చుకోవాలి:
ముందుగా మనకు ఎందుకు షాపింగ్ చేయాలని అనిపిస్తుందో తెలుసుకోవాలి. దాని నుంచి బయటపడేందుకు స్నేహితులతో మాట్లాడడం లేదంటే వ్యాయామం చేయడం, ఏదైనా పని చేయడం వంటివి చేయాలి. ఒక బడ్జెట్ పెట్టుకుని అందులోనే షాపింగ్ చేయండి. అంతకు మించి ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఖర్చు చేయకూడదు. అంతే కాకుండా మీ ఖర్చులను రెగ్యులర్ గా ట్రాక్ చేయండి.

ఆన్‌లైన్ షాపింగ్‌కు సంబంధించిన ప్రమోషన్స్, ఇమెయిల్ అన్ సబ్‌స్క్రైబ్ చేయండి. ఫోన్లో నుంచి షాపింగ్ యాప్‌లను డిలీట్ చేయండి. షాపింగ్ నుంచి డిస్ట్రాక్ట్ అయ్యేందుకు కొత్త అలవాట్లు, వివిధ రకాల యాక్టివిటీస్ ఫాలో అవ్వాలి. అవసరమైతే మానసిక సమస్యలను పరిష్కరించుకునేందుకు నిపుణులను కలవడం మంచిది.

Tags

Related News

Instant Glow Facial: పండుగ వేళ.. ఇంట్లో దొరికే వస్తువులతో ఫేస్ ప్యాక్ ట్రై చేశారంటే.. ఇన్‌స్టంట్‌ గ్లో ఖాయం

Relationships: మీ మాజీ లవర్‌తో ఇప్పటికీ స్నేహంగా ఉంటున్నారా? ఇది మంచి ఆలోచనేనా?

Amla Rice: ఉసిరికాయ అన్నం ఇలా చేసుకొని తింటే లంచ్ బాక్స్‌కు బాగుంటుంది, ఇది ఎంతో ఆరోగ్యం కూడా

Youthful Glow: ఎప్పటికీ యవ్వనంగా ఉండాలా? డైలీ, ఈ యాంటీ ఏజింగ్ ఫుడ్స్ తింటే చాలు.. వయస్సే తెలియదు

Rice Water: గంజి వచ్చేలా అన్నం వండి ఆ గంజినీళ్లను ప్రతిరోజూ తాగండి, మీరు ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి

Thyroid: వీటితో ఇంట్లోనే థైరాయిడ్‌కు చెక్ !

Hair Spa: ఇంట్లోనే హెయిర్ స్పా.. ఎలా చేసుకోవాలో తెలుసా ?

Big Stories

×