EPAPER

Home Remedies: వంట గదిలో చేతులు కాలాయా ? ఇవి రాయండి

Home Remedies: వంట గదిలో చేతులు కాలాయా ? ఇవి రాయండి

Home Remedies: వంట గదిలోని పనులతోనే చాలా మంది ఉదయం ప్రారంభం అవుతుంది. రకరకాల వంటకాలు చేస్తూ చాలా మంది వంట గదిలోనే ఎక్కువ సేపు గడుపుతుంటారు. అయితే ఇలా తక్కువ సమయంలోనే వంటకాలు పూర్తి చేయాలనుకున్న సమయంలో చిన్న చిన్న గాయాలు అవుతుంటాయి. అంతే కాకుండా కొన్ని సర్లు పెద్ద గాయాలు అయ్యి రక్తం కూడా వస్తుంది. అలాంటి సమయంలో వెంటనే కొన్ని రకాల ఇంట్లోని హోం రెమెడీస్ వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. తక్షణ ఉపశమనం కలుగుతుంది.


చాలా సార్లు వంటగదిలో పని చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు కూడా చేతులు కాలిపోతాయి. వేడి పాత్రలు, నీరు లేదా నూనె చిందడం వల్ల చేతులు కాలితే, ఈ మంటను నయం చేయడానికి కూడా హెం రెమెడీస్ ఉపయోగపడతాయి. వంటగదిలో పని చేస్తున్నప్పుడు మీ చేయి కాలిపోయి, తీవ్రమైన మంటగా ఉంటే కనక ఈ 5 రకాల హోం రెమెడీస్ వాడండి.

1.చల్లని నీరు, మంచు:
వంటగదిలో చర్మంపై కాలినప్పుడల్లా, కాలిన ప్రాంతాన్ని చల్లటి నీటితో కడగడం మొదటి , సులభమైన పరిష్కారం. చల్లటి నీటిలో గాయం అయిన ప్రాంతాన్ని ఉంచండి. లేదా కనీసం 10-15 నిమిషాలు ట్యాప్ క్రింద గాయం అయిన చోటును ఉండనివ్వండి. ఇది చికాకు ప్రభావాన్ని తగ్గిస్తుంది. అంతే కాకుండా చర్మానికి చల్లదనాన్ని అందిస్తుంది. చల్లటి నీరు అందుబాటులో లేకుంటే, మీరు ఐస్ ముక్కలను కూడా ఉపయోగించవచ్చు. కానీ చర్మంపై నేరుగా ఐస్‌ను పూయకూడదని గుర్తుంచుకోండి. ఐస్‌ను ఒక గుడ్డలో చుట్టి గాయంపై అప్లై చేయండి.


2. అలోవెరా జెల్:

తాజా అలోవెరా జెల్‌ని తీసి కాలిన ప్రదేశంలో రాయండి. అలోవెరా జెల్ చికాకును తగ్గించడంతో పాటు చర్మాన్ని రిపేర్ చేయడంలో సహాయపడుతుంది. దీని రెగ్యులర్ ఉపయోగం బర్న్ మార్కులను కూడా తగ్గిస్తుంది. అందుకే కిచెన్ లో గాయాలయినప్పుడు అలోవెరా జెల్ ను ఉపయోగించండి. దీంతో గాయాలు త్వరగా తగ్గుతాయి. అంతే కాకుండా తక్షణ ఉపశమనం కలుగుతుంది.

3. పాలు, పెరుగు:

పాలు , పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్, ప్రొటీన్లు చర్మపు చికాకును తగ్గించడంలో సహాయపడతాయి. మీ చేతులు కాలినప్పుడల్లా, వాటిని చల్లని పాలు లేదా పెరుగులో ముంచండి. ఇది చర్మానికి చల్లదనాన్ని అందిస్తుంది. అంతే కాకుండి చికాకు తీవ్రతను తగ్గిస్తుంది. గాయం అయిన సమయంలో నుంచి తరుచుగా పాలు లేదా పెరుగును గాయంపై రాయం వల్ల త్వరగా నయం అవుతుంది.

Also Read: అల్ బుకారాతో బోలెడు ప్రయోజనాలు

4. టీ బ్యాగ్:

టీలో ఉండే టానిన్లు చర్మంపై మంట, చికాకును తగ్గించడంలో సహాయపడతాయి. కాలిన ప్రదేశంలో చల్లని టీ బ్యాగ్ ఉంచండి. ఇది చర్మపు చికాకును తగ్గిస్తుంది. అంతే కాకుండా కాలిన నొప్పిని తగ్గిస్తుంది.

5. దోసకాయ రసం:

కీరదోసకాయలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. తాజా దోసకాయ తురుము, దాని రసం తీసి కాలిన ప్రదేశంలో రాయండి. ఇది మీకు తక్షణ చల్లదనాన్ని ఇస్తుంది. అంతే కాకుండా మంటను కూడా తగ్గిస్తుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Protein Rich Foods: వీటిని తింటే ఆరోగ్య సమస్యలు రమ్మన్నా.. రావు

Glowing Skin Tips: మీ ఫేస్ అందంగా కనిపించాలా ? ఈ ఫేస్ ప్యాక్స్ ట్రై చేయండి

Anti Aging Foods: వీటితో గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం

Beauty tips: ముఖానికి పసుపు ఇలా వాడారంటే రంగు పెరగడమే కాదు, చర్మ సమస్యలు రావు

Meat in Fridge: పచ్చి మాంసాన్ని ఫ్రిడ్జ్‌లో పెడుతున్నారా? ఎవరికి ఎక్కువ ప్రమాదమో తెలుసా?

Aloo Bukhara: అల్ బుకారాతో బోలెడు ప్రయోజనాలు

Big Stories

×