EPAPER

Red Amaranth: డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు ఎర్ర తోటకూర తింటే షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయట..

Red Amaranth: డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు ఎర్ర తోటకూర తింటే షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయట..

Red Amaranth: ఆరోగ్యంగా ఉండాలంటే తరచూ కూరగాయలతో పాటు పండ్లు, జ్యూస్ లు, ఆకుకూరలు వంటివి తీసుకుంటూ ఉండాలి. అంతేకాదు వీటితో పాటు మాంసాహారం, గుడ్లు, పాలు వంటివి కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ముఖ్యంగా ఆకుకూరలు తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఆకూకురల్లో చాలా రకాలు ఉంటాయి. పాలకూర, తోటకూర ఇలా అనేక రకాల ఆకూకురలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిలో ఉండే పోషకాలు, మినరల్స్, పుష్కలంగా ఉంటాయి. అయితే తోటకూరను తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు ఉంటుంది. అందులో ముఖ్యంగా ఎర్ర తోటకూర తీసుకోవడం వల్ల ఊహించని లాభాలు చేకూరుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.


తోటకూరను వారంలో రెండు సార్లు అయినా తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా ఎర్ర తోటకూరను తీసుకోవడం వల్ల విటమిన్ ఎ, సి, ఈ, బి, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, పాస్పరస్, కాపర్, జింక్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్, మాంగనీస్ వంటి చాలా రకాల పోషకాలు అందుతాయి. ముఖ్యంగా ఎర్ర తోటకూర వల్ల కాల్షియం ఎక్కువగా అంది ఎముకలు, దంతాలు బలంగా మారుతాయి. ఎర్ర తోటకూరలో పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల రక్తపోటును నియంత్రించుకోవచ్చు. శరీరంలోని రక్తంలో పేరుకుపోయిన కొలస్ట్రాల్ ను తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ఇక డయాబెటీస్ పేషెంట్స్ కోసం ఎర్ర తోటకూర అద్భుతంగా పనిచేస్తుంది. ఎర్రతోటకూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల దీనిని తీసుకోవడం వల్ల రక్త హీనత సమస్యకు చెక్ పెట్టవచ్చు. అంతేకాదు శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది. రక్తపోటును తగ్గించడానికి కూడా ఎర్ర తోటకూర సహాయపడుతుంది. డయాబెటీస్ వ్యాధిగ్రస్తులు ఎర్ర తోటకూరను తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ తగ్గి ఈ వ్యాధి నుంచి ఉపశమనం పొందవచ్చు. మరోవైపు ఎర్ర తోటకూరను తీసుకుంటే ఊబకాయం వంటి సమస్యను కూడా తగ్గించుకోవచ్చు. అంతేకాదు కొలస్ట్రాల్ అదుపులోకి తీసుకువచ్చి ఆరోగ్యాన్ని కూడా రక్షిస్తుంది.


Related News

Hair Care Tips: జుట్టు సమస్యలన్నింటికీ చెక్ పెట్టండిలా !

Tips For Skin Glow: క్షణాల్లోనే మీ ముఖాన్ని అందంగా మార్చే టిప్స్ !

Yoga For Stress Release: ఒత్తిడి తగ్గేందుకు ఈ యోగాసనాలు చేయండి

Throat Infection: గొంతు నొప్పిని ఈజీగా తగ్గించే డ్రింక్స్ ఇవే..

Skin Care Tips: గ్లోయింగ్ స్కిన్ కోసం.. ఇంట్లోనే ఈ ఫేస్ ప్యాక్స్ ట్రై చేయండి

Sweets: స్వీట్లు ఇష్టపడేవారు ఈ సమయంలో తింటే అన్నీ సమస్యలే..!

Coffee For Glowing Skin: కాఫీ పౌడర్‌లో ఇవి కలిపి ఫేస్‌ప్యాక్ వేస్తే.. మీ ముఖం మెరిసిపోవడం ఖాయం

Big Stories

×