EPAPER

Daily Skin Care: డైలీ ఇలా ఫేస్ క్లీన్ చేసుకుంటే.. మీ అందం రెట్టింపు

Daily Skin Care: డైలీ ఇలా ఫేస్ క్లీన్ చేసుకుంటే.. మీ అందం రెట్టింపు

Daily Skin Care: అందంగా కనిపించాలని అందరూ కోరుకుంటారు. ముఖం మెరిస్తూ, ఆకర్షణీయంగా కనిపించాలంటే ముఖాన్ని సరిగ్గా శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. దీంతో పాటు చర్మ సంరక్షణ కూడా అవసరం. స్కిన్ కేర్ పాటించకపోతే ముఖం జిడ్డుగా మారుతుంది. అంతే కాకుండా అందాన్ని కోల్పోతుంది. అందుకే కొన్ని రకాల టిప్స్ పాటిస్తూ ముఖాన్ని అందంగా మెరిసేలా చేసుకోవచ్చు.


ఆరోగ్యకరమైన, మెరిసే చర్మం కోసం ముఖాన్ని క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. ముఖాన్ని శుభ్రపరచడం వల్ల చర్మంపై ఉన్న మురికి, నూనెలు తొలగిపోతాయి. అంతే కాకుండా చర్మం శ్వాస పీల్చుకోవడానికి ఆరోగ్యంగా ఉండటానికి ఇది కారణం అవుతుంది. సరైన చర్మ సంరక్షణ పద్దతులు పాటిస్తే ముఖంపై మొటిమలు రాకుండా ఉంటాయి. అంతే కాకుండా ముఖం అందంగా మెరిసిపోతుంది.

ముఖం శుభ్రపరిచే పద్ధతులు:


1.ముందుగా మీ చర్మం రకాన్ని తెలుసుకోండి:
పొడి చర్మం: మాయిశ్చరైజింగ్ క్లెన్సర్‌లను ఉపయోగించండి.
జిడ్డు చర్మం: జెల్ ఆధారిత లేదా ఫోమ్ క్లెన్సర్ ఉపయోగించండి.
సున్నితమైన చర్మం: హైపోఅలెర్జెనిక్ ,సువాసన లేని క్లెన్సర్‌లను ఉపయోగించండి.

2. నిద్ర లేచిన వెంటనే:

ఉదయం నిద్ర లేచిన తర్వాత, రాత్రి పడుకునే ముందు రోజుకు రెండుసార్లు మీ ముఖాన్ని కడగాలి . మేకప్ వేసుకున్న తర్వాత రాత్రి కూడా మీ ముఖాన్ని శుభ్రం చేసుకోండి. నెమ్మదిగా చేతులతో క్లెన్సర్‌ని ముఖానికి పట్టించి మసాజ్ చేయండి. కళ్ల చుట్టూ ఉన్న చర్మాన్ని చాలా సున్నితంగా శుభ్రం చేయండి.

3. చల్లటి నీటితో కడగాలి:
వేడి నీళ్లతో చర్మం పొడిబారుతుంది కాబట్టి చల్లటి నీటితోనే ముఖాన్ని కడుక్కోవాలి.

4. టోనర్‌ని ఉపయోగించడం:

టోనర్‌ చర్మం యొక్క pH స్థాయిని సమతుల్యం చేస్తుంది. అంతే కాకుండా చర్మ రంధ్రాలను మూసివేస్తుంది.

5.మాయిశ్చరైజర్ అప్లై చేయండి:
ముఖాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత తప్పకుండా మాయిశ్చరైజర్ అప్లై చేయండి.

6.వారానికి ఒకసారి స్క్రబ్ చేయడం:

స్క్రబ్ వల్ల చర్మంలోని మృతకణాలు తొలగిపోయి చర్మం మెరిసిపోతుంది.

7.మేకప్ రిమూవర్‌ని ఉపయోగించడం:
మేకప్ రిమూవర్‌తో మేకప్‌ను తొలగించి, ఆపై ముఖాన్ని కడగాలి.

8.కాటన్ క్లాత్‌తో ముఖాన్ని తుడవండి:
పొడి టవల్‌తో తుడవకండి. ఇది చర్మంపై చికాకు తొలగిస్తుంది.

Also Read: ముల్తానీ మిట్టితో క్షణాల్లోనే.. గ్లోయింగ్ స్కిన్

9.హోం రెమెడీస్:
తేనె: తేనె సహజసిద్ధమైన మాయిశ్చరైజర్. దీన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి.

పెరుగు: పెరుగులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. దీన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి.

ముల్తానr మిట్టి: ముల్తాని మిట్టి చర్మాన్ని శుభ్రంగా , మెరిసేలా చేస్తుంది. దీనిని నీళ్లలో కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి పట్టించాలి.

ఓట్స్: ఓట్స్ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తాయి. ఓట్స్ ను గ్రైండ్ చేసి, నీళ్లలో కలిపి పేస్ట్ లా చేసి ముఖానికి పట్టించాలి.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Kiwi Fruit: ఈ ఫ్రూట్‌ విటమిన్ సి యొక్క పవర్ హౌజ్.. తింటే చెప్పలేనన్ని లాభాలు

Memory Increase: మతిమరుపు ఎలా మొదలవుతుంది ? ఎప్పుడు జాగ్రత్త పడాలి

Henna: హెన్నాలో ఈ ఒక్కటి కలిపితే జుట్టు బాగా పెరుగుతుంది తెలుసా ?

Beetroot for Intercourse: బీట్ రూట్ తినండి బాబాయ్‌లూ.. ఆ సమస్యలన్నీ హాంఫట్!

Milk adulteration: కల్తీ పాలను గుర్తించడం ఎలా? ఈ సింపుల్ టిప్స్‌తో ఈజీగా కనిపెట్టేయొచ్చు

Home Remedies For Hair: బియ్యం నీటితో పొడవాటి జుట్టు

Big Stories

×