EPAPER

Curry Leaves Hair Oil: కరివేపాకుతో ఇలా చేస్తే.. తెల్లజుట్టు నల్లగా మారడం పక్కా

Curry Leaves Hair Oil: కరివేపాకుతో ఇలా చేస్తే.. తెల్లజుట్టు నల్లగా మారడం పక్కా

Curry Leaves Hair Oil: ప్రస్తుతం చాలా మంది జుట్టు సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అందులో ముఖ్యమైనది తెల్ల జుట్టు. ప్రస్తుతం చిన్నా పెద్దా తేడా లేకుండా తెల్ల జుట్టు సమస్యతో అనేక మంది బాధ పడుతున్నారు. రంగు మారిన జుట్టును తెల్లగా మార్చుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. రకరకాల షాంపూలను వాడటమే కాకుండా హెయిర్ ఆయిల్స్ కూడా వాడుతుంటారు. వీటి వల్ల పెద్దగా ఫలితం లేకపోగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తుంటాయి.


అందుకే రసాయనాలు ఉన్న హెయిర్ ప్రొడక్ట్స్ వాడకుండా ఇంట్లోనే హెయిర్ ఆయిల్ తయారు చేసుకుని వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వీటి వల్ల జుట్టు సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. ముఖ్యంగా కరివేపాకుతో తయారు చేసిన హెయిర్ ఆయిల్ వాడటం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.

ఈ ఆయిల్ జుట్టుకు చాలా మేలు చేస్తుంది.ఈ నూనె బలహీనమైన జుట్టును బలపరుస్తుంది. అంతే కాకుండాా జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న కరివేపాకు నూనెను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.


కరివేపాకు నూనె:
ఆహార రుచిని పెంచే కరివేపాకు జుట్టుకు కూడా ఎంతో మేలు చేస్తుంది. కరివేపాకులో ఉండే సమ్మేళనాలు జుట్టును ఆరోగ్యంగా మార్చడంలో సహాయపడతాయి. కరివేపాకుతో తయారుచేసిన నూనె జుట్టు రాలడం తగ్గించి జుట్టును నల్లగా మార్చడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా జుట్టు విపరీతంగా రాలుతున్న వారు ఈ నూనెను వాడటం వల్ల కూడా జుట్టు రాలడం తగ్గి జుట్టు బాగా పెరుగుతుంది.

అతి తక్కువ ఖర్చుతో తయారుచేసే కరివేపాకు నూనెను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. మీరు తెల్ల జుట్టు కోసం ఖరీదైన ఉత్పత్తులను కొనుగోలు చేయకూడదనుకుంటే మాత్రం ఒకసారి కరివేపాకు నూనెను తయారు చేసి వాడి చూడండి మంచి రిజల్ట్ ఉంటుంది.

కరివేపాకు ఆయిల్ యొక్క ప్రయోజనాలు:

జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది:
కరివేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.

జుట్టు నల్లగా చేస్తుంది:

కరివేపాకులో బీటా కెరోటిన్ ఉంటుంది, ఇది జుట్టును సహజంగా నల్లగా ఉంచడంలో సహాయపడుతుంది.

స్కాల్ప్ దురదను తగ్గిస్తుంది:
కరివేపాకులో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇవి తలపై దురద చుండ్రును తగ్గించడంలో సహాయపడతాయి.

జుట్టును బలపరుస్తుంది:
కరివేపాకులో విటమిన్ బి కాంప్లెక్స్ ఉంటుంది. ఇది జుట్టును బలంగా, మెరిసేలా చేస్తుంది.

జుట్టును మృదువుగా మార్చుతుంది:
కరివేపాకులో ఉండే పోషకాలు జుట్టును మృదువుగా, సిల్కీగా మార్చుతాయి.

కరివేపాకు నూనె ఎలా తయారు చేయాలి ?

కావలసినవి:
కరివేపాకు – 1 కప్పు
కొబ్బరి నూనె – 250 గ్రాములు
కంటైనర్ – ఒకటి

కరివేపాకు నూనె తయారు చేయడానికి.. ముందుగా కరివేపాకులను బాగా కడిగి ఆరబెట్టండి. తర్వాత గ్యాస్ వెలిగించి మందపాటి గిన్నె స్టౌపై పెట్టుకుని అందులో కొబ్బరి నూనె వేసి తక్కువ మంట మీద వేడి చేయాలి. నూనె వేడి అయ్యాక అందులో ముందుగా తీసుకున్న కరివేపాకు వేయాలి. కరివేపాకును బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి. నూనె రంగు కూడా నల్లగా కనిపిస్తుంది. అప్పుడు గ్యాస్‌ను ఆపేసి, నూనెను చల్లారనివ్వాలి. ఆ గ్లాస్ సీసాలో నూనె వడగట్టుకోవాలి.

Also Read:  బీట్ రూట్ ఫేస్ ప్యాక్.. ఎలాంటి మచ్చలైనా మాయం

కరివేపాకు నూనెను ఎలా ఉపయోగించాలి ?

మీరు ఈ నూనెను మీ జుట్టుకు వారానికి 3 సార్లు అప్లై చేసుకోవచ్చు. జుట్టుకు ఈ ఆయిల్ అప్లై చేసుకోవడానికి ముందుగా జుట్టును పూర్తిగా దువ్వాలి. ఆ తర్వాత జుట్టు కుదుళ్లతో పాటు చివర్ల వరకు నూనెను పూర్తిగా అప్లై చేయండి. రాత్రి నూనె రాసి ఉదయం షాంపూతో వాష్ చేయండి. ఇలా చేయడం వల్ల జుట్టు నల్లగా మారుతుంది. అంతే కాకుండా జుట్టు సంబంధిత సమస్యలు కూడా చాలా వరకు తగ్గుతాయి.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Hair Colour: సెలూన్‌కు వెళ్లాల్సిన పని లేదు.. ఇంట్లోనే ఇలా హెయిర్ కలర్ వేసుకోండి

Beetroot Face Pack: బీట్ రూట్ ఫేస్ ప్యాక్.. ఎలాంటి మచ్చలైనా మాయం

Wife and Husband: మీ జీవిత భాగస్వామి మీకు అబద్ధం చెబుతున్నా, మోసం చేస్తున్నా తెలుసుకోవడం చాలా ఈజీ, ఈ టిప్స్ పాటించండి

Panasa Curry: ఆవపెట్టిన పనస కూర ఇలా వండారంటే ఆ రుచికి ఎవరైనా దాసోహమే, రెసిపీ తెలుసుకోండి

Hibiscus Hair Mask: మందారంలో వీటిని కలిపి ఈ హెయిర్ మాస్క్ ట్రై చేశారంటే.. పట్టులాంటి జుట్టు మీ సొంతం

Instant Glow Facial: పండుగ వేళ.. ఇంట్లో దొరికే వస్తువులతో ఫేస్ ప్యాక్ ట్రై చేశారంటే.. ఇన్‌స్టంట్‌ గ్లో ఖాయం

×