EPAPER

Cucumber Juice Benefits : కీరదోస జ్యూస్‌తో శరీరంలో జరిగే మార్పులివే!

Cucumber Juice Benefits : కీరదోస జ్యూస్‌తో శరీరంలో జరిగే మార్పులివే!
Cucumber Juice Benefits

Cucumber Juice Benefits : సాధారణంగా వేసవి కాలం వచ్చిందంటే అంతా పుచ్చకాయలతో పాటు కీరదోసను కూడా ఎక్కువగా తింటుంటారు. ఇవి మన శరీరంలోని వేడిని బయటికి పంపించి చల్లగా ఉంచుతాయి. అంతేకాకుండా శరీరంలో నీటి శాతాన్నికూడా పెంచుతారు. మామూలుగా కీరదోస అనేది ఏ సీజన్‌లో అయినా మనకు విరివిగా లభిస్తుంది. కాబట్టి దీన్ని రోజూ తీసుకుంటే మంచిది. అందులోనూ ఒక గ్లాస్‌ కీరదోస జ్యూస్‌ తాగితే ఆ తర్వాత మీ శరీరంలో వచ్చే మార్పును మీరే నమ్మలేరు. ఒక కీరదోస తీసుకుని దానిని జ్యూస్‌లా చేసి నిమ్మకాయ రసం కలుపుకోవాలి. ఆ తర్వాత దాన్ని రోజూ ఒక గ్లాస్‌ చొప్పున ఉదయం సమయంలో లేదా మధ్యాహ్న సమయంలో తీసుకోవాలి. దీని వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.


ఇలా కీరదోస జ్యూస్‌ ప్రతిరోజు తాగడం వల్ల మన శరీరంలో ఉండే అధిక కొవ్వు కరుగుతుంది. బరువు కూడా తొందరగా తగ్గుతారు. మన పొట్ట భాగంలో ఉన్న కొవ్వు కూడా ఇట్టే కరిగిపోతుంది. ఊబకాయులకు కీరదోస జ్యూస్‌ చాలా ఉపయోగకరం. కాబట్టి ప్రతిరోజు దీన్ని తీసుకుంటే మంచిది. అంతేకాకుండా కీరదోస జ్యూస్‌ మంచి డిటాక్స్‌ డ్రింక్‌లా కూడా పనిచేస్తుందని చెబుతున్నారు. ప్రతిరోజు ఉదయంపరగడుపునే ఈ జ్యూస్‌ తాగితే మన శరీరంలోని వ్యర్థాలన్నీ సులభంగా బయటికి పోతాయి. శరీరం శుభ్రంగా మారుతుంది. అనేక వ్యాధుల నుంచి మనకు రక్షణగా ఈ కీర ఉంటుంది. కీర‌దోస‌లో ఫైబ‌ర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలను కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా అజీర్ణం,గ్యాస్‌, మలబద్ధకాన్ని పోగొడుతుంది. అదేవిధంగా కీరలోని విట‌మిన్ సి మన ఇమ్యూనిటీని కూడా బాగా పెంచుతుంది. వ్యాధులు మన దరి చేరకుండా ఉంటాయి.

కీర‌దోస‌లో విట‌మిన్ కె అధికంగా ఉండటం వల్ల గాయాలు అయిన వెంటనే రక్తస్రావం కాకుండా రక్తం త్వరగా గడ్డకట్టేలా చేస్తుంది. కీర‌దోస‌లోని మెగ్నీషియం నిద్రబాగా పట్టేలా చేస్తుంది. శరీరానికి ఎంతో రిలాక్సేషన్‌ ఇస్తుంది. దీంతో నిద్ర‌లేమి స‌మ‌స్యల నుంచి బ‌య‌టప‌డొచ్చు. ఇందులోని పొటాషియం అధిక రక్తపోటును తగ్గిస్తుంది. మన శరీరంలోని చక్కెర, కొలెస్ట్రాల్‌ స్థాయిలను కూడా అదుపులో ఉంచుతుంది. దీని వల్ల మన గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్‌ ఎటాక్‌లు కూడా మన దరిచేరవు. కీర‌దోస‌లో ఎక్కువ శాతం నీరు ఉంటుంది. దీని వల్ల మన బాడీలో వాటర్‌ లెవల్స్‌ బాగా పెరుగుతాయి. అంతేకాకుండా వేసవి తాపాన్ని తగ్గిస్తుంది. వడదెబ్బ బారిన పడకుండా కాపాడుతుందని వైద్య నిపుణులు అంటున్నారు.


Related News

Golden Face Pack: ముఖాన్ని బంగారంలా మెరిపించే ఫేస్ ప్యాక్ ఇదే

Laryngeal Cancer: గొంతులో నొప్పి.. బొంగురు మాటలు.. స్వరపేటిక క్యాన్సర్ కావచ్చు జాగ్రత్త!

Wall Cleaning Tips: ఈ టిప్స్‌తో గోడలపై ఉన్న జిడ్డు, నూనె మరకలు మాయం !

Hair Care Tips: జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగాలంటే.. ఈ ఆహారాలు తినాల్సిందే!

Papad History: కరకరలాడే అప్పడాలు ఈనాటివి కాదు, వేల ఏళ్ల నుంచి మనం తింటూనే ఉన్నాం

Biryani Cooking Tips: రెస్టారెంట్ స్టైల్‌లో ఇంట్లోనే బిర్యానీ వండుకుని తినాలనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Bitter Gourd Juice For Diabetes: కాకరకాయ జ్యూస్‌తో షుగర్ కంట్రోల్.. మరెన్నో లాభాలు

Big Stories

×